




Best Web Hosting Provider In India 2024

Brahmamudi April 5th Episode: కావ్యకు ముద్దు పెట్టిన రాజ్ -యామిని డ్రామాకు పుల్‌స్టాప్ -రాహుల్‌ను చితక్కొట్టిన స్వప్న
Brahmamudi April 5th Episode: బ్రహ్మముడి ఏప్రిల్ 5 ఎపిసోడ్‌లో రుద్రాణి కుట్రలకు పుల్‌స్టాప్ పెట్టాలని అప్పు, స్వప్న ఫిక్సవుతారు. రుద్రాణికే పిచ్చి పట్టిందని అందరూ అనుకునేలా ఆమెను ఆట ఆడుకుంటారు. మరోవైపు కావ్యను కలవడానికి రాజ్ ఆమె ఆఫీస్‌కు వస్తాడు.

Brahmamudi April 5th Episode: రుద్రాణిని ఓ ఆట ఆడుకోవాలని ఫిక్సవుతారు స్వప్న, అప్పు. టేబుల్‌పై నాన్‌వెజ్ ఐటమ్స్ వండనివి పెడతారు. అవన్నీ వండినట్లు తమకు కనిపిస్తున్నాయని కావాలనే నాటకం ఆడుతారు. నాన్ వెజ్ ఐటమ్స్ టేస్ట్ అద్భుతంగా ఉన్నాయని పొగుడుతారు. కానీ ఆ వంటలు మొత్తం వండనివే టేబుల్‌పై రుద్రాణికి కనిపిస్తాయి. అవన్నీ పచ్చివని , మీకు కూడా కావ్యలాగే పిచ్చి ముదిరిందని రుద్రాణి అంటుంది.
టేస్ట్ ఇంత అద్భుతంగా ఉంటే వండనివి అంటూ పచ్చిగా ఉన్నాయంటూ గోల చేస్తున్నారేం అని రుద్రాణిపై సెటైర్లు వేస్తారు స్వప్న, అప్పు. అందరిని పిచ్చోళ్లను చేయాలనే పిచ్చిలో మీకు పిచ్చి బాగా ముదిరినట్లు ఉందని రుద్రాణిని అప్పు ఆట ఆడుకుంటుంది. వెంటనే రుద్రాణిని మెంటల్ హాస్పిటల్‌కు తీసుకెళ్లాలని స్వప్న అంటుంది.
అప్పు ర్యాగింగ్…
అప్పు, స్వప్న కలిసి చేసే ర్యాగింగ్ భరించలేకపోతుంది రుద్రాణి. మీ సంగతి చెప్తా అంటూ ప్రకాశం, ధాన్యలక్ష్మి దగ్గరకు వెళుతుంది. తన తరఫున సాక్ష్యం చెప్పాలని డైనింగ్ టేబుల్ దగ్గరకు వారిని తీసుకొస్తుంది రుద్రాణి. నన్ను అప్పు, స్వప్న కలిసి నన్ను వెధవను చేయాలని చూస్తున్నారని అంటుంది. నిన్ను ప్రత్యేకంగా వెధవను చేయాల్సిన పనిలేదని, నీతో పది నిమిషాలు మాట్లాడితే వాళ్లకే ఆ విషయం తెలుస్తుందని ప్రకాశం పంచ్ వేస్తాడు.
రుద్రాణికి పంచ్…
టేబుల్‌పై చేపలు, చికెన్ పచ్చివే ఉన్నాయని, కానీ అప్పు, స్వప్న మాత్రం వండినవి ఉన్నాయని నాతో వాదిస్తున్నారని, వాటిని మీరే చూసి సాక్ష్యం చెప్పమని ప్రకాశం, ధాన్యలక్ష్మిలతో చెబుతుంది రుద్రాణి. టేబుల్‌పై గుమగుమలాడే వంటకాలు ప్రకాశం, ధాన్యలక్ష్మికి కనిపిస్తాయి.
వాటిని చూడగానే ఇవేలా వచ్చాయని రుద్రాణి కేకలు వేస్తుంది. ఇప్పటివరకు అవి పచ్చిగానే ఉన్నాయని గొడవ చేస్తుంది. కావ్యతో పాటు మమ్మల్ని అందరిని పిచ్చొళ్లను చేయాలని చూస్తున్నావని, ఇదేం శునకానందం నీకు అంటూ రుద్రాణికి క్లాస్ ఇస్తుంది ధాన్యలక్ష్మి. పిచ్చి బాగా ముదిరినట్లు ఉందని అప్పు అంటుంది. అవి పచ్చివో వండినవో తెలియడం లేదని అంటూ తినకుండానే రుద్రాణి వెళ్లిపోతుంది.
కావ్య అబద్ధం…
తనకు తలనొప్పిగా ఉందని కావ్య అన్న మాటలు రాజ్‌కు గుర్తొస్తాయి. ఎలా ఉందో తెలుసుకోవడానికి కాల్ చేస్తాడు. కానీ కావ్య కిచెన్‌లో ఉండటంతో ఫోన్ లిఫ్ట్ చేయదు. వంట పనుల్లో ఉన్న కావ్య ఎవరు ఫోన్ చేశారో చూడమని అపర్ణకు చెబుతుంది. రాజ్ గనక ఫోన్ చేస్తే…అత్తయ్య మాట్లాడితే కొంపలు అంటుకుంటాయని కావ్య కంగారు పడుతుంది.
పరిగెత్తుకుంటూ వచ్చి ఫోన్ పట్టుకోబోతున్న అపర్ణను ఆపేస్తుంది. తాను మాట్లాడుతానని అంటుంది. రాజ్‌తో మాట్లాడుతున్న విషయం అపర్ణకు అర్థం కాకుండా ఉండాలని…శృతి, రమ్య అంటూ పిలుస్తుంది. ఇక్కడ సిగ్నల్ సరిగ్గా లేదని…పైన రూమ్‌లో మాట్లాడుతానని అపర్ణతో చెబుతుంది. రోజురోజుకు కావ్య ప్రవర్తన కొత్తగా కనిపించడం అపర్ణకు అంతుపట్టదు.
రాజ్ సలహా…
బెడ్‌రూమ్‌లోకి వచ్చిన తర్వాత ఓ అబ్బాయితో మాట్లాడుతున్నానని తెలిస్తే మా ఇంట్లో వాళ్లు ఏమనుకుంటారు అందుకే మిమ్మల్ని రమ్య, శృతి అని పిలిచానని కావ్య అంటుంది. కావ్యకు సారీ చెబుతాడు రాజ్. మీ తలనొప్పి ఎలా ఉందని కావ్యను అడుగుతాడు రాజ్. నాకు వచ్చింది హార్ట్ ఎటాక్ కాదని కావ్య సెటైర్ వేస్తుంది. కొంపదీసి నన్ను హాస్పిటల్‌కు తీసుకెళతారా అని అడుగుతుంది.
తలనొప్పి తగ్గడానికి తన దగ్గర ఓ చిట్కా ఉందని రాజ్ అంటాడు. రాజ్ చెప్పినట్లుగా తన తలకు ఆయిల్ పెట్టుకోవడానికి గార్డెన్‌లోకి వెళుతుంది కావ్య.
నీ జ్ఞాపకాల్లో….
రాజ్ వచ్చి తనకు అయిల్ పెట్టి మసాజ్ చేసినట్లు కల కంటుంది కావ్య. ఇన్ని రోజులు ఏం జరిగిన మీరు నా పక్కనే ఉన్నారన్న ధైర్యం ఉండేది..ఇప్పుడు ఏం చేయాలన్న భయంగా ఉందని రాజ్‌తో అంటుంది కావ్య. నీ జ్ఞాపకాల్లో ఎప్పుడు నీ పక్కనే ఉన్నాను కదా అని రాజ్ అంటాడు. నా గతాన్ని నువ్వే గుర్తుచేయాలి…నీ వైపుకు నన్ను నువ్వే నడిపించాలని రాజ్ అంటాడు. దేవుడు నా గతాన్ని దూరం చేసినా…మనసులో నుండి నిన్ను మాత్రం దూరం చేయలేదని కావ్యతో చెబుతాడు రాజ్.
నా గుండె లోతుల్లో దాగి ఉన్న జ్ఞాపకాలు బయటకు వచ్చేలానువ్వే ప్రయత్నించమని చెప్పి కావ్యకు ముద్దు పెడతాడు రాజ్. ఆ ముద్దుతో కల నుంచి బయటకు వస్తుంది కావ్య.
టీనా కోసం రాహుల్ అన్వేషణ…
టీనా పేరుతో రాహుల్‌తో మాట్లాడుతుంది స్వప్న. టీనానే స్వప్న అనే విషయం తెలియక ఆమె కోసం సిటీ మొత్తం తిరుగుతాడు రాహుల్. అయినా ఆమె అడ్రెస్ దొరక్కపోవడంతో కాల్ చేస్తాడు. నువ్వు ఒక్క సారి దర్శనమిస్తే నీ కోసం తిరిగి కష్టం మొత్తం మర్చిపోతానని రొమాంటిక్‌గా మాట్లాడుతాడు రాహుల్.
నాకు నువ్వు, నీకు నేను అని టీనాతో చెబుతాడు. రాహుల్‌కు అడ్రెస్ చెప్పకుండా లెఫ్ట్, రైట్ అంటూ తిప్పుతూనే ఉంటుంది స్వప్న. టీనాను కలవాలనే ఆనందంలో ఆమె చొప్పిన చోటికి వస్తాడు రాహుల్. కిందికి దిగి చూస్తే తన ఇళ్లు కనిపిస్తుంది. ఎదురుగా చీపురుతో స్వప్న కనిపిస్తుంది.
చీపురుతో చితక్కొట్టిన స్వప్న…
చెప్పిన రూట్‌కు కరెక్ట్‌గా వచ్చానవి చీపురు తిప్పుతూ స్వప్న అంటుంది. నిన్ను సిటీ మొత్తం కుక్కలా తిప్పిన టీనాను నేనే. నీతో మూడు రోజులు రొమాంటిక్‌గా ఛాటింగ్ చేసింది నేనే చీపురు తిరగేసి తుక్కు రేగ్గొడుతుంది. పెళ్లాం పిల్లలు ఉన్నా…నాకు పెళ్లి కాలేదని అబద్ధం ఆడుతావా అని చితక్కొడుతుంది.
ఇంకోసారి ఇలాగే చేస్తే పాడే ఎక్కిస్తానని వార్నింగ్ ఇస్తుంది. స్వప్న కొట్టిన దెబ్బలకు తట్టుకోలేక నొప్పితో విలవిలలాడుతాడు రాహుల్. తన్నిన చోట తన్నకుండా ఫుట్‌బాల్ ఆడేసిందని రుద్రాణితో తన బాధను పంచుకుతాడు రాహుల్.
కావ్య ఆఫీస్‌కు రాజ్…
అయినా రుద్రాణి ఏం జరుగనట్లు ఉంటుంది. నాకు ఏం చెప్పకు అని అంటుంది. నాకే ఏమైందో తెలియడం లేదని చెబుతుంది. ఇంట్లో అందరూ తనను పిచ్చిదానిలా చూస్తున్నారని అంటుంది. కావ్యను కలవడానికి ఆమె ఆఫీస్‌కు వస్తాడు రాజ్. అతడు ఎక్కడికి వెళుతున్నాడో, ఎవరిని కలుస్తున్నాడో తెలుసుకోవడానికి కారులో జీపీఎస్ ఫిక్స్ చేస్తుంది యామిని.
కావ్య ఆఫీస్‌కు రాజ్ వెళ్లడం చూసి షాకవుతుంది. రాజ్‌ను అతడి ఆఫీస్‌లోని వారు గుర్తుపడితే తన నాటకం మొత్తం రివర్స్ అవుతుందని భయపడుతుంది. మరోవైపు రాజ్ తన ఆఫీస్‌కు రావడం చూసి కావ్య కూడా కంగారు పడుతుంది. అక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ ముగిసింది.
సంబంధిత కథనం