




Best Web Hosting Provider In India 2024

Income Tax Inspector : హైదరాబాద్ లో విషాదం, 8వ అంతస్తు నుంచి దూకి మహిళా అధికారి ఆత్మహత్య
Income Tax Inspector : హైదరాబాద్ లో ఆదాయపుపన్ను శాఖ ఇన్ స్పెక్టర్ జయలక్ష్మి ఆత్మహత్యకు పాల్పడ్డారు. కవాడిగూడ సీజీవో టవర్స్ లోని 8వ అంతస్తు నుంచి దూకడంతో ఆమె తలకు బలమైన గాయమై అక్కడికక్కడే మృతి చెందారు. ఆమె ఆత్మహత్యకు అనారోగ్య సమస్యలు కారణంకావొచ్చని పోలీసులు భావిస్తున్నారు.

Income Tax Inspector : హైదరాబాద్ లో ఆదాయపుపన్ను శాఖ ఇన్‌స్పెక్టర్ జయలక్ష్మి ఆత్మహత్య చేసుకున్నారు. కవాడిగూడ సీజీవో టవర్స్ లోని 8వ అంతస్తు నుంచి దూకి ఆమె బలవన్మరణానికి పాల్పడ్డారు. సీజీవో టవర్స్ సెక్యూరిటీ సిబ్బంది గాంధీనగర్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు క్లూస్‌టీమ్ ద్వారా వివరాలు సేకరించారు. జయలక్ష్మి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. అనారోగ్య సమస్యలతో ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు.
గాంధీనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని కవాడిగూడ సీజీవో టవర్స్‌లో శనివారం ఉదయం 11:15 సమయంలో ఆదాయపు పన్ను శాఖ ఇన్ స్పెక్టర్ జయలక్ష్మి ఆత్మహత్య చేసుకున్నారు. జయలక్ష్మి(52) సీజీవో టవర్స్‌పై నుంచి దూకడంతో ఆమె తలకు తీవ్రగాయాలు కావడంతో అక్కడికక్కడే మృతిచెందారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న గాంధీనగర్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
వేద పాఠశాలలో విద్యార్థి మృతి
హనుమకొండ జిల్లా శాయంపేట మండల కేంద్రానికి చెందిన బండారి రాజేందర్, కవిత దంపతుల పెద్ద కుమారుడు మణికంఠ. వరంగల్‌లో ఓపెన్ డిగ్రీ చదువుతూ స్థానిక శ్రీ మత్స్యగిరీంద్ర స్వామి ఆలయంలోని అర్చుకులు ఆరుట్ల కృష్ణమాచార్యులు వద్ద కొద్దిరోజులు వేద పారాయణం చేశారు. ఈ క్రమంలోనే రెండేళ్ల కిందట నిర్మల్ జిల్లా బాసరలోని వేద పాఠశాలలో చేరాడు. ఇంతవరకు బాగానే ఉండగా.. వేద పాఠశాల తరఫున ప్రతి రోజు సాయంత్రం గోదావరి నదికి హారతి ఇచ్చే కార్యక్రమం నిర్వహిస్తుంటారు. హారతి ఇచ్చే ప్రదేశంలో నీళ్లు లేకపోవడంతో.. గోదావరి నదిలోని బోరు బావి పంపు సెట్ ఆన్ చేస్తున్నారు.
మోటార్ ఆన్ చేస్తుండగా..
నదిలో ఉన్న బోరు బావి పంపును ఆన్ చేసేందుకు శుక్రవారం మణికంఠ వెళ్లాడు. అక్కడున్న ఒక రేకుపై నిలబడి మోటార్ ఆన్ చేసేందుకు ప్రయత్నించాడు. ఇంతలోనే బోర్డు నుంచి విద్యుత్తు తీగ బయటకు వచ్చి మణికంఠ నిల్చుని ఉన్న రేకుపై పడింది. విద్యుదాఘాతానికి గురై కింద పడిపోయాడు. అక్కడున్న వాళ్లంతా గుర్తించి వెంటనే మణికంఠను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మణికంఠ ప్రాణం కోల్పోయినట్లు అక్కడి డాక్టర్లు నిర్ధారించారు.
మృతిపై అనుమానాలు..
మణికంఠ తల్లిదండ్రులు అతడి మృతిపై అనుమానాలు వ్యక్తం చేశారు. భైంసా ఏఎస్పీ అవినాశ్ కుమార్, సీఐ మల్లేశ్, ఎస్సై సంజీవ్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. వేద పాఠశాల నిర్వాహకుడు విద్యాభారతి స్వామి, పనిచేసే మాతాజీ, అక్కడి విద్యార్థులతో మాట్లాడి వివరాలు సేకరించారు. ఇదిలాఉంటే.. వేద పాఠశాలలో లోహిత్ అనే విద్యార్థిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసినట్లు తెలిసింది. లోహిత్‌పై ఎవరు, ఎందుకు దాడికి పాల్పడారనే విషయంపై ఇంతవరకు వివరాలు బయటకు రాకపోవడం గమనార్హం.
సంబంధిత కథనం
టాపిక్