Smart People Weekend Plans: తెలివైన వారు వీకెండ్స్‌లో చేసే పనులేంటో తెలుసా? టైం వేస్ట్ చేయకుండా మీరు కూడా ఫాలో అయిపోండి!

Best Web Hosting Provider In India 2024

Smart People Weekend Plans: తెలివైన వారు వీకెండ్స్‌లో చేసే పనులేంటో తెలుసా? టైం వేస్ట్ చేయకుండా మీరు కూడా ఫాలో అయిపోండి!

Ramya Sri Marka HT Telugu
Published Apr 06, 2025 08:30 AM IST

Smart Weekend Plans: వీకెండ్స్‌లో ఏం చేయాలా అని ఆలోచిస్తున్నారా..? తెలివైన వారు ఆలోచిస్తూ టైం వేస్ట్ చేసుకోరు. మంచి ఐడియాలను తెలుసుకుని త్వరత్వరగా ఫాలో అయిపోతారు. మరి, మీరూ అదే విధంగా మీ ప్రవర్తనను మార్చుకోవాలనుకుంటే వెంటనే ఈ టెక్నిక్స్ ఫాలో అయిపోండి.

వీకెండ్స్‌లో ఏం చేయాలా అని ఆలోచిస్తున్నారా..?
వీకెండ్స్‌లో ఏం చేయాలా అని ఆలోచిస్తున్నారా..?

వీకెండ్ టైంలో.. ఎంజాయ్ చేద్దామనే ఆలోచన నుంచి బయటకొచ్చి, సక్సెస్‌ఫుల్ పర్సన్స్ ఏం చేస్తారా అనే ఆలోచనలో పడ్డారా..? వాస్తవానికి వారు టైంను బంగారంలా భావిస్తారు. ప్రత్యేకించి రెండు వీకాఫ్ లు ఉన్నవారు ఈ ధోరణితో వ్యవహరిస్తుంటారు. టైం వినియోగించుకోవడంలో మ్యాజిక్ ఏం ఉండదు. కేవలం స్మార్ట్ ఛాయీస్‌లు మాత్రమే ఉంటాయి. మరి, సక్సెస్‌ఫుల్ పీపుల్ ఫాలో అయ్యే ఆ 9 స్మార్ట్ ఐడియాలేంటో తెలుసుకుందా.

1. సోషల్ మీడియా స్క్రోలింగ్‌కు నో చెబుతారు.

ఆలోచనలు హరించే సోషల్ మీడియా స్క్రోలింగ్ ట్రాప్‌లో వారు అస్సలు పడరు. ఒక నోటిఫికేషన్ వచ్చిందని, ఫోన్ పట్టుకుని గంటల కొద్దీ సమయాన్ని దాని కోసమే అస్సలు వెచ్చించరు. విలువైన, అమూల్యమైన సమయాన్ని ఉపయోగం లేని పనుల కోసం కేటాయించాలని అనుకోరు. వాస్తవానికి సోషల్ మీడియా అనేది ప్రత్యేకమైన విషయాలను, శక్తివంతమైన అంశాలను చూపించినా అందులో వేస్టేజ్ చాలా ఎక్కువగా ఉంటుంది. మనల్ని ఉపయోగకరమైన వాటినుంచి అది దూరం చేస్తుంది.

2. వ్యాయామం స్కిప్ చేయరు

ఎక్సర్‌సైజ్ అంటే శరీరాన్ని ఫిట్‌గా ఉంచుకోవడమేకాదు. మనస్సును కూడా ఆరోగ్యంగా ఉంచుతుంది. మెదడు చురుకుగా పనిచేసేలా ప్రేరేపించి శక్తిని అందిస్తుంది. ఇంతేకాదు, మార్నింగ్ వాక్, యోగా, రన్నింగ్ లాంటివి శరీరాన్ని ఉత్తేజపరుస్తాయి కూడా. సక్సెస్ ఫుల్ పీపుల్ బాగా అర్థం చేసుకునే విషయమేమిటంటే,హెల్తీ బాడీ మాత్రమే హెల్తీ మైండ్‌కు దోహదపడుతుంది. హెల్తీ మైండ్ మాత్రమే సక్సెస్ కావడానికి కారణమవుతుంది. కాబట్టి డైలీ రోటీన్లో భాగమైన వ్యాయామాన్ని వీళ్లు స్కిప్ చేయరు.

3. పర్సనల్ రిలేషన్‌షిప్స్ నిర్లక్ష్యం చేయరు

ప్రతి ఒక్కరి జీవితంలో పర్సనల్ రిలేషన్స్ అనేవి వెన్నెముక లాంటివి. ఎమోషనల్ సపోర్ట్ కోసం, ఉత్తేజపరచడానికి, ప్రభావితం చేయడానికి, పూర్తి ఆరోగ్యంగా ఉంచడానికి కారణమవుతాయి. చాలా స్టడీల్లో సక్సెస్‌ఫుల్ పీపుల్ వారి రిలేషన్స్ ను ఎప్పుడూ నిర్లక్ష్యపెట్టరనే చెబుతున్నాయి. మరి వీకెండ్ టైంలో వారి కోసం క్వాలిటీ టైం స్పెండ్ చేయడం వల్ల మీ బంధాలు బలపడతాయి. అంతే కాకుండా మీ రిలేషన్‌లో కొత్త అనుభవాలకు దారి తీసి, మరింత ఆనందమయం చేస్తుంది.

4. వర్క్‌కు సంబంధించిన స్ట్రెస్‌ తీసుకోరు

వీకెండ్స్ అంటే వర్క్ వీక్‌కు పొడిగింపు కానే కాదు. తెలివైన వారు, విజయవంతమైన వారు ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకుంటారు. శరీరానికి రెస్ట్ లేకుండా పనిచేయడాన్ని పక్కకుపెడతారు. కాస్త విరామం తీసుకుని శరీరాన్ని రీఛార్జ్ చేసుకున్న తర్వాతే ఎక్కువ ప్రొడక్టివిటీ పొందగలమని వారికి తెలుసు. పైగా ఎటువంటి ఆరోగ్య సమస్యలు కూడా ఉండవు కూడా. అందుకే వీకెండ్స్‌లో వర్క్‌కు సంబంధించిన స్ట్రెస్‌కు దూరంగా ఉండి, ప్రశాంతంగా గడుపుతారు. ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి. సక్సెస్ అనేది ఒక లాంగ్ వాక్. వంద మీటర్ల పరుగు పందెం కాదు. లక్ష్యాలను వేగంగా అందుకోవడానికి ప్రయత్నించకండి. సమర్థవంతంగా నెరవేర్చేందుకు ట్రై చేయండి.

5. సెల్ఫ్ కేర్‌పై దృష్టి పెడతారు

ఈ బిజీ ప్రపంచంలో సెల్ఫ్ కేర్ మీద ధ్యాస పెట్టకపోవడం సహజమే. కానీ, శరీరానికి అందివ్వాల్సిన సౌకర్యాలు, శుభ్రత వంటి వాటిని ఇవ్వడం మీ బాధ్యత. ఇది తప్పనిసరి కూడా. తెలివైన వారు చేసే పనే ఇది. వీకెండ్ వచ్చిందంటే అన్ని పనులు పక్కకు పెట్టేసి తమ కోసం తాము ఏదైనా చేసుకుంటారు. వేడినీటితో స్నానం, ఫేస్ ప్యాక్, హెయిర్ కేర్, ధ్యానం, మంచి పుస్తకం చదవడం, పాటలు వినడం, పెయింటింగ్ వంటి ఇష్టమైన పనులు చేసి మానసిక ప్రశాంతను పొందుతారు. ఇంకా సమయం దొరికితే కొద్దిపాటు కునుకు కూడా తీస్తారు.

గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల అభిప్రాలయను క్రోడీకరించి మాత్రమే ఈ సూచనలు అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

Ramya Sri Marka

eMail
మార్క రమ్యశ్రీ హిందుస్తాన్ టైమ్స్‌ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ లైఫ్‌స్టైల్, ఆస్ట్రాలజీ వార్తలు రాస్తున్నారు. గతంలో ఈనాడు, టీన్యూస్, ఈటీవీ భారత్ వంటి సంస్థల్లో కంటెంట్ రైటర్‌గా పనిచేశారు.జర్నలిజంలో ఎనిమిదేశ్లకు పైగా అనుభవం ఉంది. కాకతీయ యూనివర్సిటీలో మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం పీజీ చేశారు. 2024 నవంబరులో హెచ్.టి తెలుగులో చేరారు.

సంబంధిత కథనం

Source / Credits

Best Web Hosting Provider In India 2024