OTT Movies Today: ఓటీటీలో ఇవాళ 4 సినిమాలు.. 2 తెలుగులో ఒకేదాంట్లో నేరుగా స్ట్రీమింగ్.. ఫ్రీగా ఇక్కడ చూసేయండి!

Best Web Hosting Provider In India 2024

OTT Movies Today: ఓటీటీలో ఇవాళ 4 సినిమాలు.. 2 తెలుగులో ఒకేదాంట్లో నేరుగా స్ట్రీమింగ్.. ఫ్రీగా ఇక్కడ చూసేయండి!

Sanjiv Kumar HT Telugu
Published Apr 06, 2025 11:41 AM IST

OTT Movies Release Today Telugu: ఓటీటీలో ఇవాళ నాలుగు సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చేశాయి. వాటిలో రెండు తెలుగు సినిమాలు డైరెక్ట్‌గా ఓటీటీ రిలీజ్ అయ్యాయి. అది కూడా ఒకే ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో స్ట్రీమింగ్ అవుతున్నాయి. మరి ఆ సినిమాలు, వాటి ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.

ఓటీటీలో ఇవాళ 4 సినిమాలు.. 2 తెలుగులో ఒకేదాంట్లో నేరుగా స్ట్రీమింగ్.. ఫ్రీగా ఇక్కడ చూసేయండి!
ఓటీటీలో ఇవాళ 4 సినిమాలు.. 2 తెలుగులో ఒకేదాంట్లో నేరుగా స్ట్రీమింగ్.. ఫ్రీగా ఇక్కడ చూసేయండి!

OTT Release Movies Today Telugu: ఓటీటీలోకి ఇవాళ నాలుగు సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చేశాయి. వాటిలో రెండు తెలుగు సినిమాలు నేరుగా ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్నాయి. అది కూడా ఒకే ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో రిలీజ్ అయ్యాయి. ఫ్యామిలీ డ్రామా, లవ్ రొమాంటిక్ జోనర్స్‌తో ఆ రెండు సినిమాలు ఉన్నాయి. ఇవి, మిగతా సినిమాలు ఏంటీ, వాటి ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.

కథా సుధ ఓటీటీ

ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఇటీవల మొదలుపెట్టిన సరికొత్త ఓటీటీ వీక్లీ సిరీస్ కథా సుధ. అంటే, ఇందులో ప్రతి ఆదివారం కొత్త సినిమాను ఓటీటీ స్ట్రీమింగ్ చేయనున్నారు. అంటే ఒక ఎపిసోడ్ తరహాలో ప్రతి ఆదివారం కేవలం దాదాపుగా 30 నిమిషాల రన్ టైమ్‌తో కథా సుధా ఓటీటీ వీక్లీ సిరీస్‌ను డిజిటల్ ప్రీమియర్ చేస్తున్నారు.

సతీష్ వేగేశ్న, దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు సమర్పణలో ఈ సినిమాలు తెరకెక్కుతున్నాయి. ఈ క్రమంలోనే ఇవాళ (ఏప్రిల్ 6) రెండు సినిమాలను నేరుగా ఓటీటీ స్ట్రీమింగ్‌కు తీసుకొచ్చారు. వాటిలో ఒకటే ఉత్తరం. ఈ ఉత్తరం సినిమా సుమారుగా 31.54 నిమిషాల రన్‌టైమ్‌తో ఉంది.

ఉత్తరం ఓటీటీ

ఈ ఉత్తరం కథ మొబైల్స్ వాడకం లేకముందు బంధువులతో ఎలా కమ్యూనికేట్ చేసేవారో చూపించారు. చిన్ని తన తాతయ్య, నానమ్మ మధ్య ఉండే కమ్యునికేషన్ గురించి అడగడంతో ఈ కథ మొదలు అవుతుంది. భర్త ఉత్తరం కోసం ఓ భార్య చూసే ఎదురుచూపుల కాన్సెప్ట్‌తో ఉత్తరం ఎపిసోడ్ ఉంది. దీనికి కథ, రచన, దర్శకత్వం సతీష్ వేగేశ్న వహించారు.

ఉత్తరంతోపాటు ఈటీవి విన్‌లో ఓటీటీ రిలీజ్ అయిన మరో సినిమా లైఫ్ పార్ట్‌నర్. బిగ్ బాస్ ఫేమ్ శ్రీహాన్, విరూపాక్ష ఫేమ్ సోనియా సింగ్ ప్రధాన పాత్రల్లో నటించారు. 34.21 రన్ టైమ్ ఉన్న ఈ సినిమాకు లిరిక్స్, స్క్రీన్ ప్లే, ప్రొడ్యూసర్, డైరెక్షన్ సూపర్‌విజన్‌గా దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు ఉన్నారు. అలాగే, స్టోరీ, డైలాగ్స్, డైరెక్షన్ రాంకీ వహించారు.

లైఫ్ పార్ట్‌నర్ ఓటీటీ

వి కిరణ్ కుమార సంగీతం అందించిన లైఫ్ పార్టనర్ ఈటీవీ విన్‌లో ఫ్రీగా స్ట్రీమింగ్ అవుతోంది. ఈటీవీ విన్ లో నేరుగా ఓటీటీ స్ట్రీమింగ్ అయిన ఈ రెండు తెలుగు సినిమాలు లైఫ్ పార్టనర్, ఉత్తరంను ఎలాంటి సబ్‌స్క్రిప్షన్ లేకుండా ఫ్రీగా చూసేయొచ్చు.

ఇన్‌సైడ్ జాబ్ సీజన్ 2 ఓటీటీ

హాలీవుడ్ కార్టూన్ అడ్వెంచర్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ఇన్‌సైడ్ జాబ్. ఈ సీజన్ నుంచి రెండో సీజన్ ఇవాళ ఓటీటీ స్ట్రీమింగ్‌కు వచ్చింది. నెట్‌ఫ్లిక్స్‌లో ఇన్‌సైడ్ జాబ్ సీజన్ 2 ఓటీటీ రిలీజ్ అయింది. షియాన్ టెకూచీ, అలెక్స్ హిర్స్చ్, అలిషా బ్రోఫీ, స్కాట్ మైల్స్, చేస్ మిట్చెల్, అడమ్ లెదరర్ దీనికి రైటర్స్‌గా పనిచేశారు. షియాన్ టేకూచీ క్రియేటర్‌గా వ్యవహరించారు.

డేవిడ్ బ్లెయిన్ డు నాట్ అటెంప్ట్ ఓటీటీ

అమెరికన్ మెజిషీయన్, మెంటలిస్ట్ డేవిడ్ బ్లెయిన్ చేసిన రియల్ అడ్వెంచర్‌ను ఎపిసోడ్స్‌గా మలిచి ఓటీటీ ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చిందే డు నాట్ అటెంప్ట్. ఎవరు చేయని సాహోసోపేతమైన పనులను రెండు ఎపిసోడ్స్‌తో ఇవాళ జియో హాట్‌స్టార్/డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో ఓటీటీ రిలీజ్ చేశారు. ఇదిలా ఉంటే, ఈ నాలుగింటిలో చూసేందుకు బెస్ట్‌గా కథా సుధ రెండు తెలుగు సినిమాలు ఉన్నాయి.

Sanjiv Kumar

TwittereMail
సంజీవ్ కుమార్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియ‌ర్ కంటెంట్ ప్రొడ్యూస‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్‌ కథనాలు, మూవీ రివ్యూలు అందిస్తుంటారు. గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. తెలంగాణ యూనివర్సిటీలో మాస్ క‌మ్యూనికేష‌న్ అండ్ జ‌ర్న‌లిజంలో పీజీ చేశారు. 2023 ఆగస్టులో హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024