Amaravati : చంద్రబాబు కుటుంబానికి వెలగపూడి రైతుల కానుక.. ఏంటో తెలుసా?

Best Web Hosting Provider In India 2024

Amaravati : చంద్రబాబు కుటుంబానికి వెలగపూడి రైతుల కానుక.. ఏంటో తెలుసా?

Basani Shiva Kumar HT Telugu Published Apr 06, 2025 01:56 PM IST
  • Share on Whatsappమమ్మల్ని ఫాలో అవ్వండి
  • Share on Facebook
Basani Shiva Kumar HT Telugu
Published Apr 06, 2025 01:56 PM IST

Amaravati : చంద్రబాబు కుటుంబానికి అమరావతి ప్రాంత రైతులు కానుక ఇవ్వడానికి సిద్ధమయ్యారు. ఈనెల 9వ తేదీన ఇందుకు ముహూర్తం ఖరారు చేశారు. తమ గ్రామ పరిధిలో చంద్రబాబు ఇల్లు నిర్మించుకుంటున్నారని.. అందుకే కానుక ఇవ్వబోతున్నామని వెలగపూడి అన్నదాతలు చెబుతున్నారు.

చంద్రబాబు దంపతులు
చంద్రబాబు దంపతులు
మమ్మల్ని ఫాలో అవ్వండిShare on Whatsapp
  • Share on Facebook

ముఖ్యమంత్రి చంద్రబాబు కుటుంబానికి వెలగపూడి రైతులు పట్టువస్త్రాలను కానుకగా ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. తమ గ్రామ పరిధిలో ఇల్లు నిర్మించుకుంటున్నందుకు పట్టు వస్త్రాలు పెడుతున్నట్టు రైతులు చెబుతున్నారు. ఇటీవల వెలగపూడి రెవెన్యూ పరిధిలో కొనుగోలు చేసిన స్థలంలో చంద్రబాబు కుటుంబం ఇల్లు నిర్మించుకుంటోంది.

ఈనెల 9న శంకుస్థాపన..

నూతన ఇంటి నిర్మాణానికి ఈనెల 9వ తేదీన శంకుస్థాపన చేయనున్నారు. ఆరోజు ఉదయం 9 గంటలకు ముహూర్తంగా నిర్ణయించినట్లు సమాచారం. స్థలం రిజిస్ట్రేషన్‌ కార్యక్రమం నాలుగు రోజుల కిందటే పూర్తి అయింది. ప్లాట్‌లో నిర్మాణానికి సంబంధించి సన్నాహక పనులను కాంట్రాక్టర్ ప్రారంభించారు. గతంలో తాత్కాలిక సచివాలయం, అసెంబ్లీ భవనాలను నిర్మించడం.. తాజాగా ఇంటిని తమ పరిధిలోనే కట్టుకుంటుండడంతో వెలగపూడి గ్రామస్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

కృతజ్ఞతగా పట్టువస్త్రాలు..

తమ గ్రామానికి గుర్తింపు తీసుకొచ్చినందుకు కృతజ్ఞతగా.. చంద్రబాబు, భువనేశ్వరి, లోకేష్, బ్రాహ్మిణి, దేవాన్ష్‌లకు వెలగపూడి తరఫున పట్టువస్త్రాలు అందించాలని రైతులు నిర్ణయించారు. అమరావతి ఉద్యమం సమయంలో వెలగపూడిలోని తమ శిబిరానికి… భువనేశ్వరి వచ్చి రెండు బంగారు గాజులు, పిండి వంటలు ఇచ్చారని రైతులు గుర్తు చేసుకుంటున్నారు. ఆ గాజులను తాము ఇప్పటికీ గుర్తుగా ఉంచుకున్నామని స్పష్టం చేస్తున్నారు.

5 ఎకరాల స్థలంలో..

వెలగపూడి రెవెన్యూ పరిధిలో 5 ఎకరాల స్థలంలో చంద్రబాబు కొత్త ఇల్లు నిర్మించుకుంటున్నారు. ఈ ఇంటిలో గార్డెన్, భద్రతా సిబ్బంది గదులు, వాహనాల పార్కింగ్ వంటి సదుపాయాలు ఉంటాయి. ఏప్రిల్ 9న ఈ ఇంటికి భూమి పూజ చేయనున్నారు. అమరావతిలో శాశ్వత నివాసం ఏర్పాటు చేసుకోవడం ద్వారా.. రాజధాని అభివృద్ధికి తన నిబద్ధతను చాటాలని చంద్రబాబు భావిస్తున్నారు.

అభివృద్ధికి సంకేతంగా..

ఈ కొత్త ఇంటి నిర్మాణం అమరావతి నగర అభివృద్ధికి ఒక ముఖ్యమైన సంకేతంగా అక్కడి ప్రజలు, రైతులు భావిస్తున్నారు. చంద్రబాబు ప్రస్తుతం ఉండవల్లిలో లింగమనేనికి చెందిన అతిథి గృహంలో నివసిస్తున్నారు. దానికి అద్దె చెల్లిస్తున్నట్టు తెలుగుదేశం పార్టీ నేతలు చెబుతున్నారు. అమరావతిలో చంద్రబాబుకు సొంత ఇల్లు కూడా రాజకీయ ప్రత్యర్థులు విమర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు అమరావతి ప్రాంతంలో స్థలం కొనుగోలు చేసి.. ఇల్లు నిర్మించుకుంటున్నారు.

Basani Shiva Kumar

eMail

సంబంధిత కథనం

టాపిక్

AmaravatiChandrababu NaiduTrending ApAndhra Pradesh News
మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ తాజా వార్తలు, క్రైమ్ వార్తలు, ట్రెండింగ్ వార్తలు, పొలిటికల్ వార్తలు చూడండి.
Source / Credits

Best Web Hosting Provider In India 2024