Brahmamudi Serial: బ్రహ్మముడికి పోటీగా సరికొత్త సీరియల్.. మీ ఛాయిస్ ఏది?

Best Web Hosting Provider In India 2024

Brahmamudi Serial: బ్రహ్మముడికి పోటీగా సరికొత్త సీరియల్.. మీ ఛాయిస్ ఏది?

Hari Prasad S HT Telugu
Published Apr 07, 2025 01:27 PM IST

Brahmamudi Serial: బ్రహ్మముడి సీరియల్ కు ఇప్పుడు పోటీగా కొత్త సీరియల్ వచ్చేసింది. సోమవారం (ఏప్రిల్ 7) నుంచే ఈ సీరియల్ ప్రారంభమైంది. జీ తెలుగులో ఈ సరికొత్త సీరియల్ టెలికాస్ట్ అవుతోంది.

బ్రహ్మముడికి పోటీగా సరికొత్త సీరియల్.. మీ ఛాయిస్ ఏది?
బ్రహ్మముడికి పోటీగా సరికొత్త సీరియల్.. మీ ఛాయిస్ ఏది?

Brahmamudi Serial: స్టార్ మా టాప్ సీరియల్స్ లో ఒకటైన బ్రహ్మముడి.. ప్రైమ్ టైమ్ నుంచి మధ్యాహ్నానికి మారిన తర్వాత క్రమంగా తన టీఆర్పీ కోల్పోతూ వస్తోంది. అయితే తాజాగా ఇప్పుడీ సీరియల్ కు మరో పోటీ ఎదురవుతోంది. జీ తెలుగు ఛానెల్ నుంచి దీర్ఘసుమంగళీభవ పేరుతో ఓ కొత్త సీరియల్ సోమవారం (ఏప్రిల్ 7) నుంచి ప్రారంభమైంది.

బ్రహ్మముడికి పోటీ ఈ సీరియలే

బ్రహ్మముడి ఒకప్పుడు తెలుగు టీవీ సీరియల్స్ ను ఏలింది. టీఆర్పీల్లో ఎన్నో నెలల పాటు నంబర్ వన్ స్థానంలో కొనసాగింది. అయితే రాత్రి 7.30కు వచ్చే ఈ సీరియల్ ను తర్వాత మధ్యాహ్నం ఒంటి గంటకు మార్చారు. దీంతో ఈ సీరియల్ టీఆర్పీ పడిపోయింది. ఒక దశలో టాప్ 10 నుంచి కూడా వెళ్లిపోయింది. అయితే ఇప్పుడు ఒంటి గంటకు కూడా బ్రహ్మముడికి పోటీగా కొత్త సీరియల్ వచ్చింది.

ఈ సీరియల్ పేరు దీర్ఘసుమంగళీభవ. ఈ సీరియల్ ను సోమవారం నుంచి జీ తెలుగు ఛానెల్ ప్రారంభించింది. సోమవారం నుంచి శనివారం వరకు ప్రతి రోజూ మధ్యాహ్నం 1 గంటకు టెలికాస్ట్ అవుతుంది. ఈ కొత్త సీరియల్ ప్రేక్షకులను ఆకట్టుకుంటే కనుక బ్రహ్మముడి టీఆర్పీ మరింత తగ్గే అవకాశం కూడా ఉంటుంది.

ఏంటీ దీర్ఘసుమంగళీభవ సీరియల్

ఈ దీర్ఘసుమంగళీభవ ముగ్గురి జీవితాల చుట్టూ తిరిగే కథతో వస్తోంది. అమ్మమ్మ అమర్నాథ్ యాత్ర కలను సాకారం చేసేందుకు అహల్య చేసే ప్రయత్నం, విధికి బలైన అహల్య, ఇంద్ర జీవితాలతో ఈ కథ ముడిపడి ఉంటుంది. బంధాలు, బంధుత్వాల మధ్య ఉద్వేగభరితంగా సాగే సీరియల్ ‘దీర్ఘ సుమంగళీ భవ’ జీ తెలుగులో అలరించడానికి వచ్చింది.

అహల్య (మహీ గౌతమి) టైలర్‌గా పనిచేస్తూ అనారోగ్యంతో బాధపడుతున్న తన అమ్మమ్మను అమర్‌నాథ్ యాత్రకు తీసుకెళ్లాలని కలలు కంటుంది. అక్కడ ఇంద్ర (పవన్ రవీంద్ర) అనే సైనికుడితో ప్రేమలో పడుతుంది. ఇంద్ర మాత్రం తన గతంతో పోరాడుతుంటాడు. ఈ క్రమంలోనే ఇంద్ర మరణంతో వారి ప్రేమ విషాదకరంగా ముగుస్తుంది.

ప్రేమ, విధికి మధ్య బంధీ అయిన అహల్య భవిష్యత్తు ఎలా ఉంటుంది? అహల్య జీవితం ఎలాంటి మలుపు తిరగబోతోంది? అనే విషయాలు తెలుసుకోవాలంటే దీర్ఘ సుమంగళీ భవ సీరియల్‌ను చూడాల్సిందే. ఎన్నో మలుపులు, ఇంట్రెస్టింగ్ ఫ్యామిలీ ఎమోషనల్ ఎలిమెంట్స్‌తో తెరకెక్కిన దీర్ఘ సుమంగళీ భవ సీరియల్ సోమవారం (ఏప్రిల్ 7) నుంచి ప్రారంభమైంది.

ఒంటి గంట సీరియల్స్ ఇవే..

ఇక మధ్యాహ్నం ఒంటి గంట సీరియల్స్ విషయానికి వస్తే స్టార్ మాలో బ్రహ్మముడి, జీ తెలుగులో ఈ దీర్ఘసుమంగళీభవ ప్రసారం అవుతాయి. ఇదే సమయానికి జెమినిలో అభనందన, ఈటీవీలో కావ్య సీరియల్స్ వస్తున్నాయి. మరి వీటిలో మీ ఛాయిస్ ఏదో చూసుకోండి.

ఈ కొత్త సీరియల్ దీర్ఘ సుమంగళీ భవ ప్రారంభంతో జీ తెలుగు ఇతర సీరియల్స్ ప్రసార సమయాల్లో స్వల్ప మార్పులు జరగనున్నాయి. సోమవారం నుంచి శనివారం వరకు ముక్కుపుడక సీరియల్ మధ్యాహ్నం 12 గంటలకు, సీతే రాముడి కట్నం సీరియల్ మధ్యాహ్నం 3:30 గంటలకు ప్రసారం కానున్నాయి.

Hari Prasad S

TwittereMail
హరి ప్రసాద్ ఎస్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఈయన 20 ఏళ్ల అనుభవం ఉన్న సీనియర్ జర్నలిస్ట్. ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియాల్లో పని చేసిన అనుభవం ఉంది. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షిలాంటి ప్రముఖ దిన పత్రికలు, టీవీ ఛానెల్లో పని చేశారు. నవంబర్ 1, 2021 నుంచి అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా స్పోర్ట్స్, ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలు చూస్తున్నారు.

సంబంధిత కథనం

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024