




Best Web Hosting Provider In India 2024

AP Telangana Today : ఏపీ, తెలంగాణకు సంబంధించిన ఇవాళ్టి ముఖ్యమైన కార్యక్రమాలు.. 9 హైలైట్స్
AP Telangana Today : సత్యసాయి జిల్లాలో జగన్ పర్యటన, మరోసారి సిట్ ముందుకు శ్రవణ్‌రావు, దిల్సుఖ్నగర్ బాంబు పేలుళ్ల కేసుపై తీర్పు, తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షాలు, అహ్మదాబాద్‌కు సీఎం రేవంత్‌రెడ్డి.. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఇలాంటి 9 ముఖ్యమైన అంశాలను ఇప్పుడు తెలుసుకుందాం.

1.ఇవాళ సత్యసాయి జిల్లాలో జగన్ పర్యటించనున్నారు. లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించనున్నారు. ఇటీవల హత్యకు గురైన వైసీపీ కార్యకర్త లింగమయ్య ఇంటికి వెళ్లనున్నారు. ముందస్తుగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. 2 కి.మీ.దూరంలో హెలిప్యాడ్‌కు అనుమతి ఇచ్చారు. ఇతరులకు గ్రామంలోకి ప్రవేశం లేదని పోలీసులు స్పష్టం చేశారు. పాపిరెడ్డిపల్లి దగ్గరలో హెలిప్యాడ్ ఏర్పాటుకు సూచించారు.
2.ఇవాళ మరోసారి సిట్ ముందు శ్రవణ్‌రావు హాజరుకానున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో మూడోసారి సిట్ విచారణ చేస్తోంది. గత ఎన్నికల టైమ్‌లో వాడిన ఫోన్లు ఇవ్వాలని..ఇప్పటికే శ్రవణ్‌రావుకు సిట్ నోటీసులు ఇచ్చింది. 2 సెల్ఫోన్ల కోసం శ్రవణ్‌రావుకు సిట్ నోటీసులు జారీ చేసింది.
3.ఇవాళ దిల్సుఖ్నగర్ బాంబు పేలుళ్ల కేసుపై తీర్పు రానుంది. 2013లో జరిగిన ఘటనలో హైకోర్టు తీర్పు ఇవ్వనుంది. పేలుళ్లలో 18 మంది మృతి, 130 మందికి గాయాలు అయ్యాయి. 2016లో యాసిన్ భత్కల్ సహా ఐదుగురికి ఉరిశిక్ష ఖరారు అయ్యింది. కోర్టు తీర్పుపై ముద్దాయిలు హైకోర్టును ఆశ్రయించారు. ఇప్పటికీ ప్రధాన నిందితుడు రియాజ్ భత్కల్ పరారీలో ఉన్నాడు.
4.ఇవాళ తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. పలు చోట్ల ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఆదిలాబాద్, మంచిర్యాల, కొమురం భీం..నిజామాబాద్ జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ అయ్యింది.
5.ఇవాళ పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ సమావేశం జరగనుంది. ఇరురాష్ట్రాల ఈఎన్సీలు, సీడబ్ల్యూసీ సభ్యులు హాజరుకానున్నారు. పోలవరం బ్యాక్ వాటర్ సర్వే అంశాలపై చర్చించనున్నారు.
6.ఇవాళ అహ్మదాబాద్‌కు వెళ్లనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఏఐసీసీ కీలక సమావేశాల్లో పాల్గొననున్నారు. జాతీయ స్థాయిలో పార్టీ అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించనున్నారు. డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు కూడా అహ్మదాబాద్‌కు వెళ్లనున్నారు. తెలంగాణ కాంగ్రెస్ నుంచి 44 మంది నేతలకు ఆహ్వానం అందింది. కులగణన సర్వే,బీసీ రిజర్వేషన్లు, ఎస్సీ వర్గీకరణపై..సమావేశాల్లో వివరించనున్నారు సీఎం రేవంత్, భట్టి విక్రమార్క.
7.ఇవాళ జీహెచ్ఎంసీ పరిధిలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కేటీఆర్ భేటీ కానున్నారు. తెలంగాణ భవన్లో ఈ సమావేశం జరగనుంది. వరంగల్‌లో బహిరంగ సభ, గ్రేటర్ సమస్యలపై చర్చించనున్నారు.
8.ఇవాళ ఏలూరు జిల్లా వైసీపీ విస్తృతస్థాయి సమావేశం జరగనుంది. బొత్స సత్యనారాయణ, కారుమూరి నాగేశ్వరరావు, మాజీ ఎంపీ కోటగిరి శ్రీధర్, జిల్లా అధ్యక్షులు దూలం నాగేశ్వరరావు, నియోజకవర్గాల ఇంఛార్జ్‌లు హాజరుకానున్నారు.
9.ఎస్ఎల్బీసీ టన్నెల్లో 46వ రోజు తవ్వకాలు జరుగుతున్నాయి. ఆరుగురి ఆచూకీ ఇంకా లభించలేదు. ఈనెల 10వ తేదీ టార్గెట్‌గా తవ్వకాలు వేగవంతం చేశారు. శకలాలు, మట్టి, బురద తరలింపు కొనసాగుతున్నాయి. తవ్వుతున్న కొద్దీ నీరు ఉబికి వస్తుంది.
టాపిక్