




Best Web Hosting Provider In India 2024

Food Poison: రాజన్న సిరిసిల్లలో విషాదం.. పుడ్ పాయిజన్ తో తల్లికొడుకు మృతి… బంధువుల ఆందోళనతో ఉద్రిక్తత…
Food Poison: రాజన్నసిరిసిల్ల జిల్లా రుద్రంగి లో పుడ్ ఫాయిజన్ తో తల్లికొడుకు మృతి ఉద్రిక్తతకు దారితీసింది. భర్త దుబాయ్ లో ఉండగా అత్తింటివారి వేధింపులే కారణమని బంధువులు ఆందోళనకు దిగారు. అత్తమామలపై దాడికి యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

Food Poison: రాజన్న సిరిసిల్ల జిల్లాలో తల్లీకొడుకులు అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం ఉద్రిక్తతకు దారి తీసింది. రుద్రంగి మండల కేంద్రానికి చెందిన కాదాను పుష్పలత (35), నిహాల్ (6), శుక్రవారం రాత్రి ఇంట్లో రొట్టెలు తిని పడుకున్నారు. అనంతరం వాంతులు విరోచనాలు కావడంతో స్థానిక ఆర్ఎంపీ వద్ద వైద్యం చేయించుకున్నారు. పరిస్థితి విషమించడంతో శనివారం కోరుట్ల, కరీంనగర్ లోని ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స పొందారు.
కరీంనగర్‌లో చికిత్స పొందుతూ ఆదివారం తల్లి పుష్పలత మృతిచెందగా.. పరిస్థితి విషమించడంతో కొడుకు నిహాల్ను వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ నిహాల్ సోమవారం తెల్లవారుజామున ప్రాణాలు కోల్పోయాడు. గంటల వ్యవధిలో తల్లీకొడుకులు మృతి చెందడంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి.
అత్తమామలే కారణమని….
రాజన్న సిరిసిల్లకు చెందిన వ్యక్తి ఉపాధికోసం దుబాయ్ వెళ్ళడంతో అత్తమామలే పుష్పలత, నిహాల్ మృతికి కారణమని పుష్పలత పుట్టింటి వారు ఆరోపిస్తు ఆందోళనకు దిగారు. అత్తమామలపై ఇంటిపై దాడికి యత్నించారు. అత్తమామలపై చెయిచేసుకున్నారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో చందుర్తి సిఐ వెంకటేశ్వర్లు ఆద్వర్యంలో పోలీసులు భారీగా మొహరించి సముదాయించారు.
తల్లీకొడుకు మృతిపై అనుమానాలు ఉన్నాయని వారి చావుకు అత్తమామల వేధింపులే కారణమని పుష్పలత సోదరుడు శ్రీనివాస్ పోలీసులకు పిర్యాదు చేశాడు. అత్తమామలు తరుచు కోడలితో గొడవపడేవారని వాటిని మనసులో పెట్టుకొని పుష్పలత అత్త కుటుంబ సభ్యులే విషప్రయో గం చేసి ఉంటారని ఫిర్యాదు చేయడంతో పోలీసులు అనుమానస్పద మృతిగా కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
దుబాయ్ లో భర్త…
తల్లీకొడుకు మృతితో దుబాయ్ లో ఉన్న భర్త స్వగ్రామానికి బయలు దేరారు. తల్లికొడుకు ఇద్దరి మృతదేహాలను వేములవాడ ఏరియా ఆస్పత్రిలో భద్రపరిచారు. మంగళవారం సాయంత్రం వరకు స్వగ్రామానికి చేరుకోనున్నారు. గ్రామంలో ఉద్రిక్తత నెలకొనడంతో పోలీసులు పికెటింగ్ ఏర్పాటు చేశారు. ఆత్మహత్యనా, నిజంగానే బంధువులు ఆరోపిస్తున్నట్లు పుడ్ పాయిజన్ తో హత్య చేశారా అనే కొణంలో పోలీసులు విచారణ చేపట్టారు. పోస్ట్ మార్టమ్ రిపోర్ట్ వచ్చాక చర్యలు చేపడుతామని రుద్రంగి ఎస్ఐ అశోక్ తెలిపారు.
రిపోర్టింగ్ కె.వి.రెడ్డి ఉమ్మడి కరీంనగర్ జిల్లా కరస్పాండెంట్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగు
సంబంధిత కథనం
టాపిక్