Train schedule : రైల్వే ప్రయాణికులకు అలర్ట్​! ఈ రూట్​లో పలు రైళ్లు రద్దు..

Best Web Hosting Provider In India 2024


Train schedule : రైల్వే ప్రయాణికులకు అలర్ట్​! ఈ రూట్​లో పలు రైళ్లు రద్దు..

Sharath Chitturi HT Telugu
Published Apr 08, 2025 10:20 AM IST

Train cancel : బెంగళూరులో రైల్వే బ్రిడ్జ్​ పనుల కారణంగా పలు రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడనుంది. బెంగళూరు వైపు వెళ్లే కొన్ని రైళ్లు రద్దు అయ్యాయి. ఇంకొన్నింటి షెడ్యూల్​ మారింది. పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

బెంగళూరులో బ్రిడ్జ్​ పనుల కారణంగా పలు రైళ్లు రద్దు..
బెంగళూరులో బ్రిడ్జ్​ పనుల కారణంగా పలు రైళ్లు రద్దు..

రైళ్లల్లో బెంగళూరుకు ప్రయాణిస్తున్న వారికి కీలక అలర్ట్​! వైట్​ఫీల్డ్​- కేఆర్​ పురం స్టేషన్స్​ మధ్యలో ఉన్న బ్రిడ్జ్​ నెంబర్​ 834 మీద పనుల కారణంగా పలు రైళ్లు పూర్తిగా రద్దు అయ్యాయి. మరికొన్ని పాక్షికంగా రద్దు అయ్యాయి. ఇంకొన్నింటిని దారి మళ్లించడం జరిగింది. మరికొన్నింటి షెడ్యూల్​ సైతం మారింది. పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

బెంగళూరు రైలు ప్రయాణికులకు అలర్ట్​!

బ్రిడ్జ్​ పనుల కారణంగా 06527 బంగరపేట్​- ఎస్​ఎంవీటీ బెంగళూరు ఎంఈఎంయూ స్పెషల్​ రైలు ఏప్రిల్​ 12, 15, 19, 22 తేదీల్లో రద్దు అయ్యింది.

06528 ఎస్​ఎంవీటీ బెంగళూరు- బంగరపేట్​ ఎంఈఎంయూ స్పెషల్​ రైలు ఏప్రిల్​ 13, 16, 20, 23 తేదీల్లో రద్దు అయ్యింది.

వైట్​ఫీల్డ్​- కేఎస్​ఆర్​ బెంగళూరు మధ్య నడిచే 16521 బంగరపేట్​- కేఎస్​ఆర్​ బెంగళూరు ఎంఈఎంయూ ఎక్స్​ప్రెస్​ ఏప్రిల్​ 15, 22 తేదీల్లో వైట్​ఫీల్డ్​ దగ్గర ఆగిపోతుంది.

06269 మైసూరు- ఎస్​ఎంవీటీ బెంగళూరు డైలీ ప్యాసింజర్​ స్పెషల్​ రైలు ఏప్రిల్​ 12, 15, 19, 22 తేదీల్లో బెంగళూరు కంటోన్మెంట్​లో ఆగకుండా ఎస్​ఎంవీటీ బెంగళూరు, బనస్వాడి, హెబ్బాల్​, యశ్వంతపూర్​, కేఎస్​ఆర్​ బెంగళూరు మధ్య నడుస్తుంది.

11013 లోక్​మాన్య తిలక్​ టర్మినస్​- కోయంబత్తూర్​ డైలీ ఎక్స్​ప్రెస్​.. ఏప్రిల్​ 14, 21 తేదీల్లో గౌరిబిదనూర్​, యెలహంక, లొట్టెగొల్లహళ్లి, యశ్వంత్​పూర్​, హెబ్బాల్​, బనస్వాడి, కర్మెలారం, హోసూర్​ మధ్య నడుస్తుంది. ఆయా రోజుల్లో ఈ రైలు బెంగళూరు-ఈస్ట్​, బెంగళూరు కంటోన్మెంట్​, కేఎస్​ఆర్​ బెంగళూరులో ఆగదు. కాగా యశ్వంత్​పూర్​లో మాత్రం తాత్కాలిక స్టాప్​ ఉంటుంది. ఆయా రోజుల్లో ఉదయం రాత్రి 9 గంటల 20 నిమిషాలకు వచ్చి 9 గంటల 40 నిమిషాలకు బయలుదేరుతుంది.

మరిన్ని వివరాల కోసం స్థానిక రైల్వే స్టేషన్​, రైల్వే వెబ్​సైట్స్​ని సందర్శించాల్సి ఉంటుంది.

ఈ రైళ్లు ఇక సికింద్రాబాద్​కి రావు..!

సికింద్రబాద్​ విషయానికొస్తే, ఇప్పటివరకు ఈ స్టేషన్​లో ఆగిన పలు రైళ్లకు స్టాప్​ తొలగించారు. సికింద్రాబాద్​ రైల్వే స్టేషన్​లో జరుగుతున్న అభివృద్ధి పనులు ఇందుకు కారణం.

దాదాపు 10 రైళ్ల గమ్యస్థానాన్ని మార్చడం జరిగింది. ఇది తాత్కాలిక చర్య మాత్రమే. పూర్తి వివరాలను ఇక్కడ క్లిక్​ చేసి తెలుసుకోండి.

Sharath Chitturi

TwittereMail
శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో 6 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది.

సంబంధిత కథనం

జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.

Best Web Hosting Provider In India 2024


Source link