Gunde Ninda Gudi Gantalu Serial:స‌త్యం ఫ్యామిలీకి సినిమా చూపించిన మాణిక్యం – రోహిణి వార్నింగ్ – మీనాపై సుశీల‌ పొగ‌డ్త‌లు

Best Web Hosting Provider In India 2024

Gunde Ninda Gudi Gantalu Serial:స‌త్యం ఫ్యామిలీకి సినిమా చూపించిన మాణిక్యం – రోహిణి వార్నింగ్ – మీనాపై సుశీల‌ పొగ‌డ్త‌లు

Nelki Naresh HT Telugu
Published Apr 08, 2025 09:09 AM IST

Gunde Ninda Gudi Gantalu Serial: గుండె నిండా గుడి గంట‌లు ఏప్రిల్ 8 ఎపిసోడ్‌లో ప్ర‌భావ‌తి, రోహిణి కూర‌గాయ‌లు మెల్ల‌గా త‌ర‌గ‌డం చూస్తాడు మాణిక్యం. రోహిణి వ‌ద్ద‌న్న విన‌కుండా జెట్ స్పీడులో వెజిటేబుల్స్ మొత్తం క‌ట్ చేస్తాడు. మాణిక్యం చేస్తోన్న ప‌నులు చూసి రోహిణి త‌ల‌ప‌ట్టుకుంటుంది.

గుండె నిండా గుడి గంట‌లు ఏప్రిల్ 8 ఎపిసోడ్‌
గుండె నిండా గుడి గంట‌లు ఏప్రిల్ 8 ఎపిసోడ్‌

Gunde Ninda Gudi Gantalu Serial: మలేషియా నుంచి వచ్చిన రోహిణి మావయ్య కోసం స్పెషల్‌గా వంట‌కాలు ప్రిపేర్ చేయాల‌ని ప్ర‌భావ‌తి అనుకుంటుంది. మీనా సాయం లేకుండా వంట‌లు చేయాల‌ని ఫిక్స‌వుతుంది. శృతి, ప్ర‌భావ‌తి, రోహిణి కూర‌గాయ‌లు క‌ట్ చేస్తుంటారు. వారికి స‌త్యం సాయ‌ప‌డ‌తాడు. ర‌వి కూడా హెల్ప్ చేస్తాన‌ని అంటాడు. నీ ప‌ని వంట చేయ‌డ‌మే క‌దా అంటూ ర‌విపై మ‌నోజ్ సెటైర్లు వేస్తాడు. నాకు ఈ ప‌నైనా ఉంది…మ‌రి నీకు అని కోపంగా ర‌వి రివ‌ర్స్ పంచ్ వేస్తాడు.

మ‌నోజ్ త‌డ‌బాటు…

నువ్వు జాబ్ చేయ‌కుండా పార్కుల్లో ప‌డుకుంటున్నావ‌ట‌ నిజ‌మేనా సుశీల అడుగుతుంది. నాన‌మ్మ మాట‌ల‌తో మ‌నోజ్ త‌డ‌బ‌డిపోతాడు. ఈ మాట రోహిణి మావ‌య్య ముందు అనోద్ద‌ని సుశీల‌ను బ‌తిమిలాడుతుంది ప్ర‌భావ‌తి.

విల‌న్ క్యారెక్ట‌ర్‌…

అప్పుడే అక్క‌డికి మాణిక్యం వ‌స్తాడు. స‌త్యం కొబ్బ‌రి తుర‌మ‌డం చూసి…మీరు ఇంట్లో చేసే ప‌ని ఇదేనా త‌క్కువ చేసి మాట్లాడుతాడు. రోహిణి నాకు చెప్ప‌లేదే అని అంటాడు. నా కొడుకు ఆర్టీసీ డ్రైవ‌ర్ అని సుశీల స‌మాధాన‌మిస్తుంది. ఓ డ్రైవ‌రా అని మాణిక్య అంటాడు. ఏంటి డ్రైవ‌ర్ అని సాగ‌దీస్తున్నారు అని బాలు ఫైర్ అవుతాడు.

ఇక్క‌డ విల‌న్ క్యారెక్ట‌ర్ చేస్తుంది బాలు అని రోహిణి అన్న మాట‌లు గుర్తుచేసుకుంటాడు మాణిక్యం. అత‌డితో జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని అనుకుంటాడు. నువ్వు భ‌లే త‌మాషాగా మాట్లాడుతున్నావు బాబు…ఇలాగే ఉంటే అంద‌రికి న‌చ్చుతావ‌ని కావాల‌నే బాలుతో మంచిగా ఉన్న‌ట్లుగా న‌టిస్తాడు.

నువ్వు ఏం చేస్తున్నావ‌ని బాలును అడుగుతాడు మాణిక్యం. కారు డ్రైవ‌ర్ అని బాలు బ‌దులిస్తాడు. మా సంగ‌తి ప‌క్క‌న పెట్టి మీ రోహిణి భ‌ర్త ఏం చేస్తున్నాడో అడిగారా అని మాణిక్యంతో అంటాడు బాలు. నిజం బ‌య‌ట‌ప‌డ‌కుండా ప్ర‌భావ‌తి టాపిక్ డైవ‌ర్ట్ చేస్తుంది.

మాణిక్యం టాలెంట్‌…

ప్ర‌భావ‌తి, రోహిణి, శృతి మెల్ల‌గా కూర‌గాయ‌లు క‌ట్ చేయ‌డం చూస్తాడు మాణిక్యం. ఇలాగైతే మ‌నం మ‌ధ్యాహ్నం చేయాల్సిన భోజ‌నం రాత్రి తినాల్సివ‌స్తుంద‌ని అంటాడు. తాను కూర‌గాయ‌లు క‌ట్ చేస్తాన‌ని చెబుతాడు. ప్ర‌భావ‌తి, రోహిణి వ‌ద్ద‌న్న విన‌డు. మాణిక్యం కూర‌గాయ‌లు క‌ట్ చేస్తోన్న స్పీడు చూసి స‌త్యం ఫ్యామిలీ షాక‌వుతారు.

మ‌ట‌న్ కొట్టిన‌ట్లు వెజిటేబుల్స్‌ను కీమా చేస్తాడు. పెళ్లిల్లో వంట‌లు చేసే గ‌ణేష్ మాస్ట‌ర్ కూడా ఇంత స్పీడుగా క‌ట్ చేయ‌లేద‌ని, మీది జెట్ స్పీడు అని మాణిక్యంతో బాలు అంటాడు. గ‌ణేషా…ఏ ఊరు…అని మాణిక్య ఆరాలు తీస్తాడు. మావ‌య్య అంటూ రోహిణి వార్నింగ్ ఇస్తుంది. మ‌లేషియాలో మేము ఇలాగే కూర‌గాయ‌లు క‌ట్ చేస్తామ‌ని టాపిక్ డైవ‌ర్ట్ చేస్తాడు.

మాణిక్యానికి క్లాస్‌…

మాణిక్య త‌రిగే తీరు చూస్తుంటే క‌టింగ్‌లో మంచి అనుభ‌వం ఉన్న‌ట్లు ఉంద‌ని బాలు డౌట్ ప‌డ‌తాడు.

మీరు తాగ‌డానికి వేడి నీళ్లు అడిగారు క‌దా ఇస్తాను రండి అంటూ మాణిక్యాన్ని బెడ్‌రూమ్‌లోకి తీసుకెళుతుంది రోహిణి. త‌ల ప‌ట్టుకుంటుంది.నువ్వు చేసే ప‌నులు వ‌ల్ల నిన్ను చంప‌డ‌మే, నేను విషం తాగి చావ‌డ‌మే జ‌రిగేలా ఉంద‌ని అంటుంది. సీన్ మొత్తం పులిహోర చేస్తున్నావ‌ని మాణిక్యానికి క్లాస్ ఇస్తుంది. నువ్వు వేసుకునే బ‌ట్ట‌ల‌కు, చేసే ప‌నుల‌కు సంబంధం లేద‌ని వార్నింగ్ ఇస్తుంది.

నెక్స్ట్ సీన్‌లో పిచ్చేక్కిస్తా…

నువ్వు ఇలా చేస్తే జూనియ‌ర్ ఆర్టిస్ట్‌గా కూడా సెలెక్ట్ కావ‌ని అంటుంది. రోహిణి మాట‌ల‌తో మాణిక్య భ‌య‌ప‌డ‌తాడు. రాజ‌మౌళి దృష్టిలో ప‌డాల‌ని వ‌చ్చాన‌ని, నెక్స్ట్ సీన్‌లో పిచ్చేక్కిస్తాన‌ని అంటాడు. సొంత తెలివితేట‌లు వాడ‌కుండా నేను చెప్పిన‌ట్లు విన‌మ‌ని, చుట్టూ సీసీ కెమెరాలు ఉన్నాయ‌ని, మ‌హేష్‌బాబు, రాజ‌మౌళి మ‌న యాక్టింగ్ చూస్తున్నార‌ని మాణిక్యాన్ని బెదిరిస్తుంది. ఆమె చెప్పింది నిజ‌మేన‌ని మాణిక్యం న‌మ్ముతాడు.

ప్ర‌భావ‌తి క‌ళ్లు….

ఉద‌యం ఇంటి ముందు ఉన్న అంద‌మైన ముగ్గు చూసి రోహిణి, ప్ర‌భావ‌తిల‌లో ఒక‌రు వేసి ఉంటార‌ని అనుకుంటుంది శృతి. మీనా వేసింద‌ని ర‌వి అంటాడు. మీనాను చూసి క‌ళ్లుకుంటుంది ప్ర‌భావ‌తి. నీకు ఒళ్లు వంచ‌డం చాత‌కాద‌ని ఒప్పుకో…లేదంటే మీనా బాగా వేసింద‌ని ఒప్పుకో…రెండు చేత‌కాక‌పోతే నోరుమూసుకోని ఉండ‌మ‌ని ప్ర‌భావ‌తికి క్లాస్ ఇస్తుంది.

బాలు గొడ‌వ‌…

బాలుది క‌ల్ల‌క‌ప‌టం లేని మ‌న‌స్త‌త్వ‌మ‌ని, అందుకే మీనా లాంటి మంచి మ‌న‌సుకున్న భార్య దొరికింద‌ని బాలును పొగుడుతుంది. బాలు అంటేనే నీకు ఇష్ట‌మ‌ని మ‌నోజ్ అంటాడు. మ‌నోజ్‌ను కూడా పొగ‌డ‌మ‌ని, టిప్‌టాప్‌గా ట‌క్కేసుకొని పార్కులో తిరిగేవాడా…ప‌ల్లీలు కొనుక్కొని తిరిగేవాడా అని బామ్మ నిన్ను పొగ‌డాలా అని మ‌నోజ్ అంటాడు. బాలు గొడ‌వ‌ను ఆపేస్తాడు స‌త్యం.

శృతికి గిఫ్ట్‌…

ఉగాదికి ర‌వి, శృతి కోసం బంగారు న‌గ‌లు గిఫ్ట్‌గా ఇస్తుంది సుశీల‌. మ‌లేషియా నుంచి రోహిణి మావ‌య్య తెచ్చిన వాటికంటే నువ్వు ఇచ్చిన న‌గ‌లే బ‌రువుగా ఉన్నాయ‌ని బాలు అంటాడు. అత‌డి మాట‌ల‌తో రోహిణి కోపం ప‌ట్ట‌లేక‌పోతుంది. ప్ర‌భావ‌తి అడ్డుకుంటుంది. మీ మావ‌య్య ముందు బాలుతో గొడ‌వ ప‌డితే బాగుండ‌ద‌ని రోహిణితో అంటుంది ప్ర‌భావ‌తి.

ఉగాది పండ‌గ సంబ‌రాల‌కు మాణిక్యాన్ని తీసుకుర‌మ్మ‌ని రోహిణితో అంటుంది ప్ర‌భావ‌తి. ఆ సెల‌బ్రేష‌న్స్‌లో మ‌ట‌న్ కొట్టు బాష వాడితే…నిన్ను బ‌స్ ఎక్కించి…ఆడిష‌న్‌లో రిజెక్ట్ అయ్యాడ‌ని రాజ‌మౌళితో చెబుతాన‌ని మాణిక్యానికి వార్నింగ్ ఇస్తుంది రోహిణి.

పండ‌గ రోజే గిరాకీ ఎక్కువ‌…

మ‌లేషియాలో పండుగ‌లు ఎలా చేసుకుంటార‌ని మాణిక్యాన్ని అడుగుతాడు స‌త్యం. ఉగాదికే క‌దా మాకు గిరాకీ ఎక్కువ అని మాణిక్యం నోరు జారుతాడు. ఈ రోజు మ‌లేషియాలో తెలుగు వాళ్లు అంద‌రూ కలుస్తారు అంటూ రోహిణి స‌ర్ధిచెబుతుంది. ఏ పాత్ర అయినా రిచ్‌గా ఉంటుంది. క్యారెక్ట‌ర్ ఆర్టిస్టులు త‌ల‌కు రంగులు వేస్తారు అంటూ మాణిక్యం పిచ్చిపిచ్చిగా మాట్లాడుతాడు. మా రోహిణి కూడా బాగా యాక్ట్ చేస్తుంది అని అంటాడు. నాకు అదే డౌట్ అని బాలు అంటాడు.

గుడికి నైవేథ్యం…

మాణిక్యం ఏం మాట్లాడుతున్నాడో అంతుప‌ట్ట‌క క‌న్ఫ్యూజ్ అవుతారు ప్ర‌భావ‌తి, స‌త్యం. ఉగాది రోజున కొత్త కోడ‌ళ్ల చేత నైవేథ్యాన్ని వండించుకొని గుడికి తీసుకెళ్లాల‌ని సుశీల అనుకుంటుంది. నైవేథ్యాన్ని క‌ట్టెల పొయ్యిపై వండించాల‌ని అనుకుంటుంది. కంటెల పొయ్యి వెలిగించ‌డానికి శృతి, రోహిణి ఇబ్బంది ప‌డ‌తారు. చివ‌ర‌కు మీనా పొయ్యిల‌ను వెలిగిస్తుంది. నైవేథ్యాల‌ను గుడి వ‌ర‌కు ఎత్తుకొమ్మ‌ని శృతి, రోహిణి, మీనాల‌కు చెబుతుంది సుశీల‌.

మా వ‌ల్ల కాద‌ని రోహిణి, శృతి అంటారు. కోడ‌ళ్ల‌కు ప్ర‌భావ‌తి స‌పోర్ట్ చేస్తుంది. నేను, మీనా నైవేథ్యాన్ని తీసుకెళ‌తామ‌ని అంటుంది. నువ్వేం కొత్త కోడ‌లివి కాద‌ని ప్ర‌భావ‌తికి పంచ్‌లు వేస్తుంది సుశీల‌. వాళ్ల కాపురం బాగుండాలంటే నైవేథ్య‌పు కుండ గుడి వ‌ర‌కుతీసుకెళ్లాల్సిందేన‌ని సుశీల అంటుంది. సుశీల మాట కాద‌న‌లేక కుండ‌ను నెత్తిపై పెట్టుకుంటారు.

గ్రూప్ ఫొటో…

ఉగాది రోజు స‌త్యం ఫ్యామిలీ అంద‌రూ గ్రూప్ ఫొటో దిగుతారు. వారికి కొత్త ఫోజు శృతి చెబుతుంది. ఆ ఫోజుఉ ప్ర‌కారం ప్ర‌భావ‌తి చేతిని ప‌ట్టుకొని బాలు ఫొటో దిగుతాడు. అక్క‌డితో నేటి గుండె నిండా గుడి గంట‌లు సీరియ‌ల్ ముగిసింది.

Nelki Naresh

TwittereMail
నెల్కి న‌రేష్ కుమార్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియ‌ర్ కంటెంట్ ప్రొడ్యూస‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. సినిమా, టీవీ రంగాల‌తో పాటు స్పోర్ట్స్‌కు సంబంధించిన రెగ్యుల‌ర్ అప్‌డేట్స్‌, రివ్యూల‌ను అందిస్తుంటారు. తెలంగాణ యూనివ‌ర్సిటీ లో మాస్ క‌మ్యూనికేష‌న్ అండ్ జ‌ర్న‌లిజంలో పీజీ చేశారు. గ‌తంలో న‌మ‌స్తే తెలంగాణ దిన‌ప‌త్రిక‌లో ప‌నిచేశారు. 2022 ఫిబ్ర‌వ‌రిలో హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024