




Best Web Hosting Provider In India 2024

Brahmamudi April 8th Episode: అపర్ణను గుర్తుపట్టని రాజ్ – రుద్రాణి ఫ్యూజులు ఔట్ – సీక్రెట్ చెప్పేసిన కావ్య
Brahmamudi: బ్రహ్మముడి ఏప్రిల్ 8 ఎపిసోడ్‌లో దుగ్గిరాల ఫ్యామిలీ పూజ చేయడానికి వచ్చిన గుడికే రాజ్, యామిని వస్తారు. రాజ్‌ను రుద్రాణి చూస్తుంది. అతడు బతికే ఉన్న విషయం కుటుంబసభ్యులందరికి చెబుతుంది. కానీ రాజ్ మాత్రం తన కుటుంబసభ్యులను గుర్తుపట్టడు. అసలు మీరు ఎవరో తెలియదని అంటాడు.

శ్రీరామ నవమికి సీతారాముల కళ్యాణం జరిపించాలని దుగ్గిరాల ఫ్యామిలీ అనుకుంటారు. కళ్యాణంలో జంటలుగా కూర్చోవాలని దుగ్గిరాల కుటుంబ సభ్యులకు పూజారి చెబుతాడు. రాజ్ ఫొటో తీసుకొచ్చి తన పక్కన పెట్టుకొని పీటలపై కూర్చోబోతుంది కావ్య. వాటే టాలెంట్..నీ ఐడియాకు నా ఫ్యూజులు ఎగిరిపోయాయని రుద్రాణి సెటైర్లు వేస్తుంది.
కావ్యను పీటలపై కూర్చోకుండా ఆపుతుంది. నీ పిచ్చితో వెర్రితో స్వామి వారిని అవమానిస్తే ఊరుకునేది లేదని కావ్యకు వార్నింగ్ ఇస్తుంది రుద్రాణి. దంపతులు కూర్చోవాలి కానీ ఇలా ఫొటోలు, ఫ్రేములను పక్కన పెట్టుకొని కూర్చుంటానంటే కుదరదని రుద్రాణి రచ్చ చేస్తుంది. ఈ మూర్ఖురాలికి మీరైనా బ్రెయిన్ వాష్ చేయండి అని పూజారితో అంటుంది రుద్రాణి.
ఒక్క రోజు పూజ చేయకుండా…
ఒక్కరోజు కూడా పూజ చేయని మీరు మన సంప్రదాయాల గురించి మాట్లాడుతుంటే విడ్డూరంగా ఉందని కావ్య రివర్స్ పంచ్ వేస్తుంది. నా భర్త అందుబాటులో లేడని, అతడి ఫొటో పక్కన పెట్టుకొని పూర్తిచేయాలని అనుకుంటున్నట్లు పంతులుతో చెబుతుంది. అలా పూజ చేయడానికి పురాణాల్లో ఉన్న ఆధారాలను చూపిస్తుంది కావ్య. ఆమె మాటలకు అందరూ సంతోషిస్తారు. కావ్య చెప్పినట్లుగానే ఫొటోతో పూజ చేయచ్చని పంతు అంటాడు.
కావ్య చేత అంక్షింతలు…
పూజారి గారు ఏం చెప్పారో అర్థమైందా…ఇంకా క్లారిటీ రాకపోతే మన గ్రంథాలు తెప్పించి చూపిస్తానని రుద్రాణితో అంటుంది కావ్య. ఇంకేం మాట్లాడుతుంది…ఇప్పుడు నిజంగానే ఆమె ప్యూజులు ఎగిరి ఉంటాయని అప్పు అంటుంది. కావ్య చేత అంక్షింతలు వేయించుకోనిది నీకు రోజు గడవదా అని రుద్రాణికి క్లాస్ ఇస్తుంది ఇందిరాదేవి. అందరూ తనపై ఎటాక్ చేయడంలో సైలెంట్‌గా అక్కడి నుంచి జారుకుంటుంది రుద్రాణి.
యామిని చిరాకు…
దుగ్గిరాల ఫ్యామిలీ పూజ చేస్తోన్న గుడికే రాజ్, యామిని వస్తారు. గుడికి రావడం ఆలస్యం కావడంతో రాజ్‌పై చిరాకుపడుతుంది యామిని. చిన్న విషయానికే ఎందుకు అంత గొడవ చేస్తావని యామినితో అంటాడు రాజ్. సెంటిమెంట్స్ మనకు బలాన్ని ఇచ్చేలా ఉండాలి కానీ బాధను కలిగించకూడదని చెబుతాడు.
సీతారాముల కళ్యాణంలో ముందు వరుసలోనే కూర్చోవాలని యామిని పట్టుపడుతుంది. దొరికిన దానితో సంతృప్తి పడాలని, నువ్వు కోరుకున్నది జరగాలని పట్టుపడితే నీకే నష్టమని యామినితో అంటాడు రాజ్. మనకు దక్కని దానికి గురించి ఆశపడటం, ఇంకొకరికి దక్కిందని బాధపడటం రెండు మంచివి కాదని యామినిపై సెటైర్లు వేస్తాడు రాజ్.
రాజ్ అబద్ధం…
పూజలో కూర్చోబోయే ముందు ఒక్కసారి కళావతితో మాట్లాడాలని రాజ్ అనుకుంటాడు. యామిని పక్కన ఉండటంతో ఆమెకు దూరంగా వెళ్లి ఫోన్ మాట్లాడాలని అనుకుంటాడు ఫ్రెండ్‌తో ఓ ఇంపార్టెంట్ విషయం చెప్పాలని అంటాడు. తాను క్రియేట్ చేసిన ఫ్రెండ్‌తో మాట్లాడుతున్నానని తనకే రాజ్ అబద్ధం చెబుతున్నాడని యామిని టెన్షన్ పడుతుంది.కళావతితో రాజ్ ఎక్కడ మాట్లాడుతాడోనని యామిని అనుమానపడుతుంది. ఇలా ప్రతిదానికి అనుమానిస్తే రాజ్ నీకు నిజంగానే దూరమవుతాడని కూతురికి క్లాస్ ఇస్తుంది వైదేహి.
కావ్య వెళ్లిపోవాలి…
రాజ్ ఎలాగైనా నా సొంతం కావాలి, మా పెళ్లి జరగాలి, రాజ్ జీవితంలో నుంచి కావ్య వెళ్లిపోవాలని దేవుడిని వేడుకుంటుంది యామిని. తన ఈ ఒక్క కోరిక తీర్చమని మొక్కుకుంటుంది.
ఫోన్ మాట్లాడటానికి గుడి బయటకు వచ్చిన రాజ్‌ను ప్రకాశం చూస్తాడు. అతడిని కలుసుకోవాలని అనుకోగా మిస్సవుతాడు. ఈ విషయం కుటుంబ సభ్యులకు చెప్పాలని స్పీడుగా వస్తూ ఓ వ్యక్తిని ఢీ కొడతాడు. అతడి చేతిలోని ప్రసాదం కిందపడటంతో ప్రకాషంతో ఆ వ్యక్తి గొడవపడతాడు. ఆ గొడవ కారణంగా రాజ్‌ను చూసిన విషయం మర్చిపోతాడు ప్రకాశం.
పండగ శుభాకాంక్షలు…
కావ్యకు కాల్ చేస్తాడు రాజ్.ఫోన్ లిఫ్ట్ చేసిన కావ్య తాను పూజలో కూర్చున్న విషయం రాజ్‌కు చెబుతుంది. నాకు పండగ శుభాకాంక్షలు చెప్పడానికే ఫోన్ చేశారా అని కావ్య అంటుంది. అందుకోసమే ఫోన్ చేశానని రాజ్ తడబడుతూ చెబుతాడు. కావ్య ఫోన్‌లో వినిపించిన సాంగ్…డైరెక్ట్‌గా తనకు వినిపించడంతో కావ్య కూడా అదే గుడిలో ఉందని రాజ్ అనుకుంటాడు. ఫోన్ కట్ చేసిన కావ్య వెనక్కి తిరిగి చూసేసరికి నిజంగానే రాజ్ కనిపిస్తాడు. భర్తను చూసి కావ్య షాకవుతుంది. రాజ్‌ను ఇంట్లో వాళ్లు ఎవరైనా చూస్తే…వెళ్లి రాజ్‌తో మాట్లాడుతారు…గతం గురించి అడిగితే తన నాటకం బయటపడుతుందని కంగారు పడుతుంది.
రుద్రాణి షాక్…
కావ్య ఊహించిందే జరుగుతుంది. రాజ్‌ను రుద్రాణి చూసి షాకవుతుంది. రాజ్ బతికే ఉన్నాడని కావ్య చెబుతుంది నిజమేనని అర్థం చేసుకుంటుంది. రాజ్ బతికే ఉంటే భర్తను కావ్య అందరి ముందుకు ఎందుకు తీసుకురాలేదని రుద్రాణి ఆలోచిస్తుంది. రాజ్ బతికిలేడని తాను అన్న మాటలను ఎందుకు భరిస్తుందని, ఇదే ఊళ్లో ఉంటూ రాజ్ ఎందుకు రావడం లేదని అనుకుంటుంది. కావ్య ఏదో సీక్రెట్ దాస్తుందని, అదేంటో ఈ రోజే తేల్చుకోవాలని ఫిక్సవుతుంది.
తరుణం రానే వచ్చింది….
పూజారి దగ్గరకు వచ్చి మైక్ తీసుకుంటుంది. నేను చెప్పే మాట వింటే అందరూ సంతోషిస్తారని, ఇన్ని రోజులు మన ఎదురుచూస్తున్న తరుణం రానే వచ్చిందని అంటుంది. రాముల వారు మనకు గొప్ప బహుమతి ఇవ్వబోతున్నాడని చెబుతుంది. రుద్రాణి ఏం మాట్లాడుతుందో ఎవరికి అంతుపట్టదు. నేను ఈ గుడిలో రాజ్‌ను చూశానని రుద్రాణి మైక్‌లో అంటుంది. ఆమె మాటలు విని యామిని షాకవుతుంది. రాజ్ బతికి ఉన్నాడని కావ్య చెప్పిందే నిజమని రుద్రాణి అంటుంది.
ఎక్కడ చూశారు…
రాజ్‌ను ఎప్పుడు, ఎక్కడ చూశారు రుద్రాణిని అడుగుతుంది కావ్య. ఈ గుడిలోనే నా కళ్లతోనే చూశానని రుద్రాణి బదులిస్తుంది. రాజ్‌ను కుటుంబసభ్యులందరికి చూపిస్తుంది రుద్రాణి. రాజ్‌ను చూడగానే అందరూ షాకవుతారు. రాజ్ బతికే ఉన్నాడనే సంతోషంలో అతడి దగ్గరొకస్తారు. రాజ్‌ను చూడగానే అపర్ణ ఎమోషనల్ అవుతుంది కన్నీళ్లు పెట్టుకుంటుంది. ఇన్ని రోజులు కావ్య చెప్పింది నిజమే…మన రాజ్ బతికే ఉన్నాడని స్వప్న అంటుంది.
ఎవరు మీరు…
అసలు నువ్వు మన ఇంటికి ఎందుకు రాలేదు…ఇక్కడ ఎందుకు ఉన్నావని రాజ్‌ను అడుగుతుంది అపర్ణ. నువ్వు ప్రాణాలతో లేవని తెలిసి మేము ఎంత కంగారు పడ్డామో తెలుసా, ప్రతి రోజు, ప్రతి క్షణం నీ గురించే ఆలోచిస్తూ జీవచ్ఛవంలా ఇన్ని రోజులు బతికామని అపర్ణ అంటుంది. మాకు ఎందుకు దూరంగా ఉన్నావని రాజ్‌ను నిలదీస్తుంది. ఇప్పటికైనా మా కళ్లముందుకొచ్చావని అపర్ణ అంటుంది.
ఎవరు మీరు అని అపర్ణను అడుగుతాడు రాజ్. మిమ్మల్ని ఇప్పుడే మొదటిసారి చూస్తున్నానని అంటాడు.
నా భర్త కాదని చెప్పలేను.,..
రాజ్ మాటలతో అపర్ణతో పాటు మిగిలిన కుటుంబసభ్యులు షాకవుతారు. తాను ఏదైతే ఇన్నాళ్లు జరగకూడదని అనుకున్నానో అదే జరిగిందని కావ్య బాధపడుతుంది. రాజ్‌కు గతం గుర్తులేదనే విషయం కుటుంబసభ్యులకు తెలియదు. అలాగని రాజ్ నా భర్త కాదని చెప్పలేను. తనకు ఏదో ఒక మార్గం చూపించమని దేవుడిని వేడుకుంటుంది కావ్య.
ఎవరో తెలియదు…
మీరు ఏం మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదని, మీరు ఎవరో తెలియదని అపర్ణతో రాజ్ అంటాడు. జోక్ చేయడానికి ఇది టైమ్ కాదని, నువ్వు తిరిగి రావాలన్న ఆశతోనే వదిన ఈ పూజ చేస్తుందని కళ్యాణ్ అంటాడు. రాజ్‌కు గతం గుర్తుచేసి అతడిని ఎక్కడ తీసుకెళ్లిపోతారోనని యామిని కంగారు పడుతుంది. ఆ ఛాన్స్ వాళ్లకు ఇవ్వకుండా రాజ్‌ను అక్కడి నుంచి వెంటనే తీసుకెళ్లిపోవాలని అనుకుంటుంది.
మేనత్త కొడుకు…
అసలు ఎవరు మీరంతా…మా బావతో మీ డిస్కషన్ ఏంటి యామిని దుగ్గిరాల ఫ్యామిలీ మెంబర్స్‌పై ఫైర్ అవుతుంది. మా బావకు పిచ్చి పట్టిందని అంటే సహించేది లేదని అంటుంది. మా రాజ్‌ను బావ అంటున్నావేంటి? అసలు నువ్వెవరు అని యామినిపై స్వప్న ఫైర్ అవుతుంది.
అతడు రాజ్ కాదని, రామ్ అని, తన మేనత్త కొడుకు అని యామిని అంటుంది. మీరంతా ఎవరిని చూసి ఎవరు అనుకుంటున్నారో నని బుకాయించబోతుంది. అప్పటివరకు మౌనంగా ఉన్న కావ్య…అతడు రామ్ కాదని, తన భర్త రాజ్ అనే నిజం చెబుతుంది. రాజ్ గతాన్ని మర్చిపోయాడనే సీక్రెట్ బయటపెడుతుంది.
రాజ్‌ను గుడిలో నుంచి తీసుకెళ్లాలని యామిని అనుకుంటుంది. అపర్ణ ఆపేస్తుంది. అందరూ గొడవపడతారు. అసలు ఏం జరుగుతుందో తెలియక రాజ్ కళ్లు తిరిగి పడిపోతాడు. అక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ ముగిసింది.
సంబంధిత కథనం