



Best Web Hosting Provider In India 2024
Shreyas Iyer Tears: ఛాంపియన్స్ ట్రోఫీ హీరో.. కానీ నెట్స్ లో ఏడ్చాడు.. ఆ భారత క్రికెటర్ కు ఏమైందంటే? తెలిస్తే షాకవుతారు
Shreyas Iyer Tears: ఛాంపియన్స్ ట్రోఫీలో ఆ భారత స్టార్ ఆటగాడు అదరగొట్టాడు. టీమిండియా తరపున టాప్ స్కోరర్ గా నిలిచి ట్రోఫీ గెలవడంలో కీ రోల్ ప్లే చేశాడు. కానీ ఈ టోర్నీకి ముందు నెట్స్ లో ఆ స్టార్ క్రికెటర్ ఏడ్చాడు. ఎందుకు? అసలేం జరిగిందో ఇక్కడ చూసేయండి.

ఛాంపియన్స్ ట్రోఫీలో భారత విక్టరీలో కీలక పాత్ర పోషించిన శ్రేయస్ అయ్యర్ షాకింగ్ విషయాన్ని బయటపెట్టాడు. ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు దుబాయ్ లో నెట్స్ లో ఏడ్చినట్లు వెల్లడించాడు. కన్నీళ్లు పెట్టుకున్నానని చెప్పాడు. దుబాయ్ లోని కండీషన్లు అలవాటు పడటంలో ఇబ్బందులు ఎదురవడంతో అతను ఏడుపు ఆపుకోలేకపోయాడు. ఈ విషయాన్ని క్యాండిడ్ విత్ కింగ్స్ ఎపిసోడ్ లో బయటపెట్టాడు.
ఎప్పుడు ఏడ్చారంటే?
క్యాండిడ్ విత్ కింగ్స్ ఎపిసోడ్ లో మాట్లాడుతూ, చివరిగా ఎప్పుడు ఏడ్చారని అడిగిన ప్రశ్నకు శ్రేయస్ అయ్యర్ సమాధానం ఇచ్చాడు. “చివరిగా నేను ఏడ్చింది ఛాంపియన్స్ ట్రోఫీలో. మొదటి ప్రాక్టీస్ సెషన్ లో నిజంగానే ఏడ్చాను. నేను నెట్స్ లో బ్యాటింగ్ చేశాను. కానీ అది వర్కౌట్ కాలేదు. నెట్స్ లో బంతిని కనెక్ట్ చేయలేకపోయా. నా మీద నాకు చాలా కోపం వచ్చింది. నేను ఏడ్వడం మొదలుపెట్టాను. నేనెప్పుడు అంత ఈజీగా కన్నీళ్లు పెట్టుకోను. కానీ ఆ రోజు ఏడ్చే సరికి షాకింగ్ గా అనిపించింది’’ అని శ్రేయస్ చెప్పాడు.
ఛాంపియన్స్ ట్రోఫీలో శ్రేయస్ అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శన చేశాడు. ఐదు ఇన్నింగ్స్ లో 48.60 సగటుతో 243 పరుగులు చేశాడు. టీమిండియా తరపున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. టోర్నీలో న్యూజిలాండ్ ఆటగాడు రచిన్ రవీంద్ర (263 పరుగులు) తర్వాత రెండవ అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా శ్రేయస్ నిలిచాడు.
ఇంగ్లాండ్ తో సిరీస్లో
ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు ఇంగ్లాండ్ తో హోమ్ సిరీస్ లో శ్రేయస్ అదరగొట్టాడు. మూడు మ్యాచ్ లలో 181 పరుగులు చేశాడు. దీంతో వన్డే టీమ్ లో మళ్లీ బ్యాటింగ్ ఆర్డర్లో నాలుగో స్థానాన్ని సొంతం చేసుకున్నాడు. ఇంగ్లాండ్ సిరీస్ లో సత్తాచాటినా.. ఛాంపయన్స్ ట్రోఫీకి ముందు నెట్స్ లో ఫెయిల్ అవడం శ్రేయస్ తట్టుకోలేకపోయాడు.
“నేను అదే రిథమ్ కొనసాగిస్తానని అనుకున్నా. కానీ అక్కడి (దుబాయ్) వికెట్లు వేరు. ఆ పరిస్థితులకు అలవాటు పడటం కష్టంగా మారింది. పైగా ఫస్ట్ రోజు ఛాలెంజ్ తప్పలేదు. నేను కాస్త ఎక్కువ ప్రాక్టీస్ చేయాలనుకున్నా. కానీ ఛాన్స్ దొరకకపోవడంతో కోపం వచ్చింది’’ అని శ్రేయస్ తెలిపాడు. పాకిస్థాన్ ఆతిథ్యమిచ్చిన ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో ఇండియా తన మ్యాచ్ లను దుబాయ్ లో ఆడిన సంగతి తెలిసిందే. ఫైనల్లో కివీస్ పై భారత్ గెలిచింది.
ఐపీఎల్ లోనూ
ఛాంపియన్స్ ట్రోఫీ ఊపును శ్రేయస్ ఐపీఎల్ లోనూ కొనసాగిస్తున్నాడు. పంజాబ్ కింగ్స్ కెప్టెన్ గా ఎంపికైన అతను బ్యాట్ తోనూ సత్తాచాటుతున్నాడు. మెగా వేలంలో పంజాబ్ అతణ్ని రూ.26.75 కోట్లకు కొనుగోలు చేసింది. ఆ రేట్ కు న్యాయం చేస్తూ శ్రేయస్ రాణిస్తున్నాడు. మూడు ఇన్నింగ్స్ లో 159 పరుగులు చేశాడు. రెండు హాఫ్ సెంచరీలు సాధించాడు. 206.49 స్ట్రైక్ రేటుతో పరుగులు చేశాడు. ఈ సీజన్ లో పంజాబ్ మూడు మ్యాచ్ ల్లో రెండు గెలిచింది.
సంబంధిత కథనం
Best Web Hosting Provider In India 2024
Source link