


Best Web Hosting Provider In India 2024
BRS Silver Jubilee : తెలుగుదేశం, బీఆర్ఎస్.. ఈ పార్టీలకే ఆ ఘనత దక్కింది : కేటీఆర్
BRS Silver Jubilee : బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ వేడుకలను ఆ పార్టీ ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది. చరిత్రలో నిలిచిపోయేలా సభ నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తోంది. తాజాగా సిల్వర్ జూబ్లీ సంబరాల నిర్వహణపై కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలుగునాట టీడీపీ, బీఆర్ఎస్ మాత్రమే 25 ఏళ్లు పూర్తి చేసుకున్నాయని చెప్పారు.
వరంగల్ సమీపంలోని ఎల్కతుర్తిలో ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా.. ప్రజలకు సమస్యలు రాని ప్రాంతంలో సభ నిర్వహణ జరుగుతుందని.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. 1200 ఎకరాల్లో పార్కింగ్‌తో పాటు సభ ఏర్పాట్లు అన్ని బాగా జరుగుతున్నాయని వివరించారు. జీహెచ్ఎంసీ పరిధిలోని ఎమ్మెల్యేలతో కేటీఆర్ భేటీ అయ్యారు. సిల్వర్ జూబ్లీ వేడుకల నిర్వహణపై కీలక వ్యాఖ్యలు చేశారు.
ఈ రెండు పార్టీలే..
‘తెలుగునాట విజయవంతంగా 25 ఏళ్లు పూర్తి చేసుకున్న రెండు పార్టీలు తెలుగుదేశం, బీఆర్ఎస్ మాత్రమే. అందుకే ఏడాదిపాటు సిల్వర్ జూబ్లీ ఉత్సవాలు నిర్వహిస్తాం. ఆర్టీసీ ద్వారా 3000 బస్సుల కోసం విజ్ఞప్తి చేశాను. ఆర్టీసీ సూత్రప్రాయంగా అంగీకరించింది. 27వ తేదీ ఆదివారం కావడం, విద్యార్థులకు సెలవులు ఉండటం వల్ల ఎవరికీ ఎలాంటి ఇబ్బందులు కలగవు’ అని కేటీఆర్ స్పష్టం చేశారు.
చరిత్రలో పెద్ద మీటింగ్..
‘మా పార్టీ చరిత్రలో ఈ సమావేశం ఒక పెద్ద మీటింగ్ అవుతుంది. బహిరంగ సభ తర్వాత విద్యార్థి , కార్యకర్తల సభ్యత్వ నమోదు చేస్తాం. సభ్యత్వ నమోదు పూర్తిగా డిజిటల్ పద్ధతిలో జరుగుతుంది. సభ్యత్వ నమోదు తర్వాత అధ్యక్ష ఎన్నిక జరుగుతుంది. రాష్ట్ర కమిటీలతో పాటు జిల్లా కమిటీలను, ఇతర కమిటీలను వేసుకుంటాం. ఆ తర్వాత జిల్లాల వారీగా కార్యకర్తల శిక్షణ సమావేశాలు ఉంటాయి’ అని కేటీఆర్ చెప్పారు.
నిరంతరం కార్యక్రమాలు..
‘ప్రతినెల ఒక్కొక్క కార్యక్రమాన్ని నిర్వహించేలా.. 12 నెలలపాటు కొనసాగేలా ప్రణాళికను సిద్ధం చేస్తున్నాం. ప్రభుత్వం గతంలో మా పార్టీ సమావేశాలకు అనుమతులు ఇవ్వకుండా ఇబ్బందులు పెట్టింది. ఈ బహిరంగ సభకు కూడా అనుమతులు ఇవ్వకుంటే.. కోర్టును ఆశ్రయించి అనుమతి పొందుతాం’ అని కేటీఆర్ స్పష్టం చేశారు.
అనుమతి.. అయోమయం..
కొద్దిరోజుల కిందటే బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు బహిరంగ సభ నిర్వహణకు అనుమతి కోసం కాజీపేట ఏసీపీ తిరుమల్‌కు వినతి పత్రం అందించారు. ఇంతవరకు దానికి సంబంధించిన అనుమతులు రాకపోవడం, ఇంతలోనే వరంగల్ కమిషనరేట్ పరిధిలో సిటీ పోలీస్ యాక్ట్ అమలు చేస్తూ.. సీపీ సన్ ప్రీత్ సింగ్ ఉత్తర్వులు జారీ చేయడంతో బీఆర్ఎస్ నేతల్లో అయోమయం మొదలైంది. దీంతోనే రజతోత్సవ సభ జరుగుతుందా.. లేదా అనే చర్చ జరుగుతోంది.
సంబంధిత కథనం
టాపిక్