



Best Web Hosting Provider In India 2024

Munaga water: మునగ నీటితో నెల రోజుల్లో జుట్టు పొడవుగా పెరిగేలా చేయొచ్చు, ఎలాగో తెలుసుకోండి
Munaga water: మునక్కాయలు, మునగ ఆకులు ఇప్పుడు సూపర్ ఫుడ్ గా మారిపోయాయి. అవి ఆరోగ్యానికే కాదు, జుట్టు పెరుగుదలకు సహకరిస్తాయి. మునగ నీటితో జుట్టును ఎలా పెంచాలో తెలుసుకోండి.

మునక్కాడలు, మునగ ఆకులు, మోరింగా… ఎలా పిలిచినా అవేంటో అర్థం అయిపోతుంది. ఇవి ఇప్పుడు సూపర్ ఫుడ్ గా మారుతున్నాయి. మునగ ఆకులను గురించి ఎంత చెప్పినా తక్కువే. అలాగే మునక్కాయలు కూడా మనకు ఎంతో మేలు చేస్తాయి. మనకు కావాల్సిన విటమిన్లు, ఖనిజాలు, అమైనో ఆమ్లాలు… మునగకాయలు, మునగ ఆకుల్లో నిండుగా ఉంటాయి.
మునగ ఆకుల నీటిని కషాయంగా తీసుకుంటే మీకు ఎన్నో అద్భుత ఫలితాలు వస్తాయి. ఇవి జుట్టు పెరుగుదలకు ఎంతో మేలు చేస్తాయి. జుట్టు పొడవుగా పెరగాలనుకునేవారు మునగ కాయలను ఎలా వినియోగించాలో తెలుసుకోండి.
మునగకాయల్లో విటమిన్ ఏ, విటమిన్ సి, విటమిన్ ఇ వంటి ముఖ్యమైన పోషకాలు నిండుగా ఉంటాయి. అలాగే బి విటమిన్లు కూడా సమృద్ధిగా దొరుకుతాయి. ఇవి మన తలకు కావలసిన పోషణను అందిస్తాయి. జుట్టు కుదుళ్లను బలంగా మార్చి అవి పెరిగేలా చేస్తాయి. జుట్టు మెరిసేలా చేయడంలో ఈ విటమిన్లు, ఖనిజాలు ముందుంటాయి.
మునగకాయల్లో ఆమ్లాలు నిండుగా ఉంటాయి. అమైనో ఆమ్లాలు జుట్టు పెరుగుదలకు, బలంగా ఎదగడానికి అవసరమైన ప్రోటీన్ ను కలిగి ఉంటాయి. కాబట్టి మునగకాయలను జుట్టు కోసం అప్పుడప్పుడు వాడాల్సిన అవసరం ఉంటుంది.
ఇక మరొక అత్యవసరమైన పోషకం యాంటీ ఆక్సిడెంట్లు. మునగ కాయలు, ఆకుల్లో శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇది నెత్తి మీద ఆక్సికరణ ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది. ఆరోగ్యకరమైన జుట్టు పెరుగుదలకు దారితీస్తుంది.
ఐరన్, జింక్
ఈ రెండూ కూడా మన జుట్టు పొడవుగా పెరిగేందుకు అత్యవసరమైనది. ఇవి తలకు రక్తప్రసరణను చక్కగా జరిగేలా చేస్తాయి. జుట్టు కుదుళ్లను ఆరోగ్యకరంగా ఉంచుతాయి. కాబట్టి మునగ ఆకులు, మునగ కాయల్లో పైన చెప్పిన పోషకాలు అన్నీ ఉంటాయి. కాబట్టి మునగ ఆకులు లేదా మునగకాయల నీటిని తాగడం ద్వారా జుట్టును పెంచుకోవచ్చు.
మునక్కాయల నీరు తయారీ
ముందుగా మునగ ఆకులు కొన్ని తీసుకోవాలి. అలాగే రెండు నుంచి మూడు కప్పుల నీటిని తీసుకోవాలి. మునగ ఆకులపై ఎలాంటి మురికి పురుగుమందుల అవశేషాలు లేకుండా శుభ్రంగా నీటితో కడగాలి. తర్వాత ఒక గిన్నెలో వేసి రెండు మూడు కప్పులు నీటిని పోసి స్టవ్ మీద పెట్టి బాగా మరిగించాలి. ఆ నీరు మరిగాక మునగ ఆకులను వడకట్టి తీసి బయట పడేయాలి. ఆ నీరు ఆకుపచ్చ రంగులోకి మారుతుంది. ఆ నీరు గది ఉష్ణోగ్రత వద్దకు వచ్చేవరకు వేచి ఉండండి. ఆ తరువాత ఆ నీటిని తాగేందుకు ప్రయత్నించండి. నెలరోజుల్లోనే మీకు జుట్టు పొడవుగా పెరగడం మొదలవుతుంది.
మునక్కాయల వాటర్
మునగ ఆకులతో చేసినట్టే మునక్కాయలతో కూడా నీటిని తయారు చేయవచ్చు. ఇందుకోసం మీరు మునక్కాడ ముక్కలను తీసుకోండి. వాటిని పరిశుభ్రంగా కడిగి ఒక గిన్నెలో వేసి రెండు మూడు కప్పుల నీటిని వేయండి. స్టవ్ మీద పెట్టి బాగా మరిగించండి. అలా మరిగించాక వడకట్టి ఆ నీటిని వేరు చేయండి. వాటిని గది ఉష్ణోగ్రత వద్దకు చల్లబరిచి తాగితే ఎంతో మేలు జరుగుతుంది.
మునక్కాయల నీరు ఎప్పుడు తాగాలి?
మునగ ఆకులు లేదా మునక్కాయలతో తయారు చేసిన నీటిని పరగడుపున ఖాళీ పొట్టతో తాగడం వల్ల ఎంతో మేలు జరుగుతుంది. మనకు ఆ నీటిలో ఉన్న పోషకాలను మన శరీరం సమర్థవంతంగా శోషించుకుంటుంది. అలాగే జుట్టు పెరుగుదల కూడా వేగంగా జరుగుతుంది. దానిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, ఖనిజాలు వంటివి మన తలకు పోషణం ఇస్తాయి జుట్టు కుదుళ్ళను పెరిగేలా ప్రోత్సహిస్తాయి.
ప్రతిరోజు ఒక్క కప్పు మునగ నీరు తాగితే ఎంతో మంచిది. ఈ అలవాటు మీకు ఎంతో మేలు చేస్తుంది. అయితే ప్రతిరోజు ఈ మునక్కాయల నీరు తాగాల్సిన అవసరం ఉంది. మీకు దాని రుచి నచ్చకపోతే తేనె లేదా నిమ్మరసం జోడించి తాగవచ్చు.
ఈ మునక్కాయలు లేదా మునగాకుల నీటితో జుట్టును పరిశుభ్రంగా వాష్ చేసుకుంటే ఇంకా మంచిది. ఇది నెత్తిపై ఉన్న చర్మ ఆరోగ్యానికి, జుట్టు మెరుపుదలకు ఎంతో మేలు చేస్తుంది. జుట్టు పొడవుగా పెరిగేలా చేస్తుంది.
ఈ మునగ నీటిని తాగడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. దీనిలో ఉండే విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు మన రోగనిరోధక వ్యవస్థను బలంగా మారుస్తాయి. అలాగే శరీరంలో ఉన్న టాక్సిన్లు బయటికి పంపిస్తాయి. ఇది జుట్టు పెరుగుదలపై స్థానికుల ప్రభావాన్ని చూపిస్తుంది.
(గమనిక: ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తి నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పడం లేదు. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణులు సలహా తీసుకోవడం మంచిది.)
సంబంధిత కథనం