




Best Web Hosting Provider In India 2024

AP Rain Alert : బంగాళాఖాతంలో బలపడిన అల్పపీడనం, రాగల 24 గంటల్లో ఉరుములతో కూడిన జల్లులు
AP Rain Alert : బంగాళాఖాతంలో అల్పపీడనం బలపడిందని వాతావరణ శాఖ తెలిపింది. అల్పపీడనం ప్రభావంతో రాగల 24 గంటల్లో ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తాలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.

AP Rain Alert : నైరుతిని, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో బలపడిన అల్పపీడనం అదే ప్రాంతంలో కొనసాగుతోందని ఏపీ విపత్తుల నిర్వహణ ఎండీ రోణంకి కూర్మనాథ్ వెల్లడించారు. అల్పపీడనం వచ్చే 24 గంటల్లో ఉత్తర వాయువ్యదిశగా, ఆ తర్వాత ఉత్తర-ఈశాన్య దిశగా వచ్చి ఆ తదుపరి 24 గంటల్లో మధ్య బంగాళాఖాతంలో క్రమంగా బలహీనపడనున్నట్లు తెలిపారు.
రేపు, ఎల్లుండి అకస్మాత్తుగా పిడుగులతో కూడిన వర్షాలకు అవకాశం ఉందన్నారు. శుక్రవారం (11వ తేదీ) ఉత్తరాంధ్ర జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, మిగిలిన జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. పిడుగులు పడే అవకాశం ఉండడంతో చెట్లు కింద నిలబడకూడదని సూచించారు.
అల్పపీడనం ప్రభావం
అల్పపీడనం ప్రభావంతో ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తాలో చాలా చోట్ల ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. రాగల 24 గంటల్లో ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తాలో చాలా చోట్ల ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉందని ప్రకటించింది. విశాఖలో ఉరుములతో కూడిన భారీ వర్షం పడే అవకాశం ఉందని వెల్లడించిది. కోస్తాంధ్రలోని పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
బుధ, గురువారాల్లో అకస్మాత్తుగా పిడుగులతో కూడిన వర్షాలకు అవకాశం ఉందని వాతావరణ కేంద్రం పేర్కొంది. ఏప్రిల్ 11న ఉత్తరాంధ్ర జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, మిగతా జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
రేపు 25 మండలాల్లో వడగాలులు
రేపు అల్లూరి జిల్లా రంపచోడవరం, ఏలూరు జిల్లా పోలవరం, వేలేరుపాడు మండలాల్లో తీవ్రవడగాలులు ప్రభావం చూపే అవకాశం ఉన్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ తెలిపారు.రేపు 25 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని చెప్పారు. మంగళవారం నంద్యాల జిల్లా దొర్నిపాడు, వైఎస్సార్ జిల్లా మద్దూరులో 41.5°C, కర్నూలు జిల్లా కామవరం 40.7 C, పల్నాడు జిల్లా రావిపాడులో 40.6°C, ప్రకాశం జిల్లా దరిమడుగలో 40.6°C చొప్పున అధిక ఉష్ణోగ్రతలు నమోదైందన్నారు. 25 ప్రాంతాల్లో 40°Cకు పైగా ఉష్ణోగ్రతలు రికార్డైనట్లు వెల్లడించారు.
సంబంధిత కథనం
టాపిక్