




Best Web Hosting Provider In India 2024

Siricilla Crime: సిరిసిల్లలో కత్తి పోట్లు కలకలం… మూడేళ్ళ బాలుడికి సీరియస్…
Siricilla Crime: రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో కత్తిపోట్లు కలకలం సృష్టించాయి. భూవివాదం నేపథ్యంలో ముగ్గురు పై ప్రత్యర్థులు కత్తులతో దాడి చేశారు. భార్య భర్తతో పాటు మూడేళ్ల బాలుడు కత్తిపొట్లకు గురయ్యారు. బాలుడి పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్ కు తరలించారు.

Siricilla Crime: రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో కత్తిపోట్లు కలకలం సృష్టించాయి. భూవివాదం నేపథ్యంలో ముగ్గురు పై ప్రత్యర్థులు కత్తులతో దాడి చేశారు. భార్య భర్తతో పాటు మూడేళ్ల బాలుడు కత్తిపొట్లకు గురయ్యారు. బాలుడి పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్ కు తరలించారు.
సిరిసిల్ల లోని శాంతినగర్ కు చెందిన కళికోట వెంకటేష్ కు సోదరుడితో గత కొంత కాలంగా భూ వివాదం ఉంది. భూ వివాదం నేపథ్యంలో వెంకటేష్ పై అతని భార్య ఏంజెల్, కొడుకు శివనేత్ర (3) ముగ్గురిపై ప్రత్యర్థులు కత్తులతో దాడి చేశారు. విశిక్షణా రహితంగా కత్తులతో దాడి చేయడంతో వెంకటేష్ భార్య కొడుకుకు తీవ్ర గాయాలయ్యాయి. కత్తితో
మూడేళ్ళ బాలుడు శివనేత్రను పొడవడంతో ప్రేగులు బయటకి వచ్చాయి. తీవ్ర గాయాలపాలైన వెంకటేష్ ద్విచక్ర వాహనంపై బాబును ఆసుపత్రికి తరలించారు. శివనేత్ర పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్ కు తరలించారు. ప్రెగ్నెన్సీ అయిన వెంకటేష్ భార్య ఏంజెల్ కు తీవ్ర గాయాలుకాగ సిరిసిల్ల ప్రభుత్వ ఆసుపత్రిలో 7 గురు డాక్టర్ల పర్యవేక్షణలో వైద్యం అందిస్తున్నారు.
కత్తులతో దాడి చేసింది పృథ్వితో పాటు నలుగురు…
భూ వివాదం నేపథ్యంలో తమ సోదరుడి కొడుకు పృథ్వి మరో వ్యక్తి సాయి, గుర్తు తెలియని మరో ఇద్దరు వ్యక్తుల సహాయంతో కత్తులతో దాడి చేశారని వెంకటేష్ తెలిపారు. బాబు అని చూడకుండా శివనేత్ర పొత్తికడుపులో ప్రేగులు బయటకి వచ్చేలా కత్తితో దాడి చేసింది పృథ్వి అని ఆరోపించారు. పృథ్వీ పై పోలీసు ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదని మీడియా ముందు గోడు వెంకటేష్ బోరున విలపిస్తూ తెలిపారు.
పోలీసులు పట్టించుకుంటే ఇలాంటి ఘటన జరిగేది కాదని స్పష్టం చేశారు. ప్రాణభయం ఉందని పోలీసులకు చెప్పిన వినిపించుకోలేదని కన్నీటి పర్యంతమయ్యారు. ఇప్పటికైనా పృథ్వి తో పాటు అతని సహకరించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
కేసు నమోదు చేసిన పోలీసులు
కత్తిపొట్ల ఘటన సీరియస్ గా మారడంతో పోలీసులు కేసు నమోదు చేసే దర్యాప్తు చేపట్టారు. వెంకటేష్ ఫిర్యాదు మేరకు పృథ్వి తోపాటు నలుగురు పై కేసు నమోదు చేశారు. భూవివాదం నేపథ్యంలో ఇదివరకు పలుమార్లు పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చామని సమస్యను పెద్ద మనుషుల సమక్షంలో పరిష్కరించుకుంటామని చెప్పడంతో కేసు నమోదు చేయలేదని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం జరిగిన ఘటనపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
(రిపోర్టింగ్ కె వి రెడ్డి ఉమ్మడి కరీంనగర్ జిల్లా కరస్పాండెంట్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగు)
సంబంధిత కథనం
టాపిక్