


Best Web Hosting Provider In India 2024
Oil Refinery In AP : ఏపీకి కేంద్రం మరో గుడ్ న్యూస్, త్వరలో రూ.80 వేల కోట్లతో ఆయిల్ రిఫైనరీ ఏర్పాటు
Oil Refinery In AP : ఏపీలో రూ.80 వేల కోట్లతో ఆయిల్ రిఫైనరీ ఏర్పాటుచేయబోతున్నట్లు కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి తెలిపారు. పెట్రోలియం రంగంలో పెట్టుబడులు అందిపుచ్చుకోవడంలో ఏపీ, గుజరాత్, ఒడిశా ముందంజలో ఉన్నాయన్నారు.

Oil Refinery In AP : ఏపీకి కేంద్రం మరో గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో రూ.80 వేల కోట్లతో రిఫైనరీ ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి తెలిపారు. పెట్రోలియం రంగంలో అనేక రాష్ట్రాల్లో పెట్టుబడులు వస్తున్నాయని, ఈ అవకాశాలను అందిపుచ్చుకోవడంలో ఏపీ, గుజరాత్, ఒడిశా ముందంజలో ఉన్నాయని తెలిపారు. ఒడిశా పారాదీప్ వద్ద ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ రిఫైనరీ ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు ఐఓసీఎల్, ఒడిశా ప్రభుత్వం మధ్య ఒప్పందం జరిగింది. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పురి పాల్గొన్నారు.
ఏపీలో రూ.80 వేల కోట్ల రిఫైనరీ
ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పురి మాట్లాడుతూ…గతంలో 27 దేశాల నుంచి క్రూడ్ ఆయిల్ దిగుమతి అయ్యేదని, ఇప్పుడు 40 దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నామన్నారు. ముడి చమురు ధరలు తగ్గినప్పుడు కొనుగోలు చేసి, ఎక్కువ నిల్వ చేస్తామన్నారు. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్ లో ఒక్కో బ్యారల్ ముడి చమురు 60 డాలర్ల వరకు ఉందని కేంద్రమంత్రి తెలిపారు.
ఏపీకి సంబంధించి త్వరలోనే భారీ పెట్టుబడులు వస్తున్నాయని, ఏకంగా రూ.80 వేల కోట్ల విలువైన ఆయిల్ రిఫైనరీ రాబోతోందని కేంద్రమంత్రి ప్రకటించారు. అయితే ఇది గతంలో ప్రకటించిన బీపీసీఎల్ రిఫైనరీ లేదా కొత్తగా మరో రిఫైనరీ వస్తుందా? అనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. బీపీసీఎల్ రిఫైనరీ అయితే నెల్లూరు జిల్లాలో ఏర్పాటు చేయనున్న విషయం తెలిసిందే.
ఏపీలో బీపీసీఎల్ రిఫైనరీ
భారత్ పెట్రోలియం కార్పొరేషన్ (బీపీసీఎల్) దేశంలోనే అత్యంత ఖరీదైన ఆయిల్ రిఫైనరీ, పెట్రో కెమికల్ కాంప్లెక్స్‌ను ఏపీలో ఏర్పాటు చేయాలని ఇటీవల నిర్ణయించింది. నిర్మాణానికి సుమారు రూ.95 వేల కోట్ల వ్యయం అవసరమని అంచనా వేస్తున్నారు. ఏపీలో తొమ్మిది మిలియన్ టన్నుల సామర్థ్యం గల ఆయిల్ రిఫైనరీ కమ్ పెట్రో కెమికల్ కాంప్లెక్స్ ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు బీపీసీఎల్ అధికారులు తెలిపారు. దేశంలోని ఆయిల్, పెట్రో కెమికల్ రిఫైనరీల్లో ఇదే అత్యంత ఖరీదైన ప్రాజెక్టుగా నిలుస్తుందని పేర్కొన్నారు. ఏపీలో ఏర్పాటుచేసే ఆయిల్ రిఫైనరీ, పెట్రో కెమికల్ కాంప్లెక్స్ కోసం భూసేకరణ, సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్), ఫీడ్ బ్యాక్ అధ్యయనాల కోసం ప్రీ ప్రాజెక్టు కార్యక్రమాల కింద రూ.6,100 కోట్లు ఖర్చు చేయడానికి బీపీసీఎల్ బోర్డు ఆమోదం తెలిపింది.
అమరావతికి నిధులు
ఏపీ రాజధాని అమరావతికి కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. రాజధాని నిర్మాణానికి రూ.4285 కోట్ల నిధులు విడుదల చేసింది. రాజధాని నిర్మాణ పనుల కోసం ప్రపంచ బ్యాంకు, ఏడీబీ నిధులు 25 శాతం విడుదల చేసింది. ఈ నిధులకు కేంద్రం వాటా రూ.750 కోట్లు కలిపి మొత్తం రూ.4285 కోట్లు ఇచ్చింది. అమరావతిలో పనులు ప్రారంభం అవుతున్న నేపథ్యంలో 25 శాతం నిధులు అడ్వాన్స్‌గా ఇవ్వాలని సీఆర్డీఏ కేంద్రాన్ని కోరింది. ఈ నేపథ్యంలో కేంద్రం తాజాగా నిధులను విడుదల చేసింది.
సంబంధిత కథనం
Best Web Hosting Provider In India 2024
Source link