Correct Way To Eat Mango: మామిడిపండు ప్రియులారా..! దీన్ని తినడానికి సరైన పద్ధతేంటో తెలుసుకోండి!

Best Web Hosting Provider In India 2024

Correct Way To Eat Mango: మామిడిపండు ప్రియులారా..! దీన్ని తినడానికి సరైన పద్ధతేంటో తెలుసుకోండి!

Ramya Sri Marka HT Telugu
Published Apr 09, 2025 08:00 AM IST

Correct Way To Eat Mango: వేసవి వచ్చిందంటే చాలా మంది మామిడిపండ్లను తెగ తినేస్తుంటారు. ఆరోగ్యానికి మంచివే అయినప్పటికీ వీటిని తినడానికి కొన్ని నియమాలు ఉన్నాయట. సరైన పరిమాణం, పద్దతిలో తినకపోతే లాభం కన్నా ఎక్కువ నష్టమే జరుగుతుందట. మామిడి పండు తినడానికి సరైన పద్ధతేంటో తెలుసుకుందాం రండి.

మామిడిపండును ఎలా తినాలి, ఎంత తినాలి తెలుసుకోండి
మామిడిపండును ఎలా తినాలి, ఎంత తినాలి తెలుసుకోండి

వేసవిలో రుచికరమైన, చల్లని మామిడిపండు తింటుంటే కలిగే కిక్కే వేరు. దీన్ని ఆస్వాదించడానికి చాలా మంది సమ్మర్ ఎప్పుడొస్తుందా అని ఎదురు చూస్తుంటారు కూడా. ఎంతో మంది ఇష్టంగా తినే మామిడిపండు రుచిలో మాత్రమే కాదు, ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తాయి. మామిడిపండులో రోగనిరోధక శక్తిని పెంచే విటమిన్ C, చర్మం, కళ్ల ఆరోగ్యానికి సహాయపడే విటమిన్ A, బీటా-కారోటిన్ కలిగి ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరచి, హృదయ ఆరోగ్యానికి పోటాషియం, ఎముకల బలానికి విటమిన్ K అందిస్తుంది.శక్తిని పునరుద్ధరించడం, రక్తహీనతను నివారించడం, మానసిక స్థితిని మెరుగుపరచడంలో కూడా సహాయపడుతుంది. మామిడి ఆరోగ్యానికి మేలు చేసేదే అయినప్పటికీ దీన్ని సరైన పరిమాణంలో, సరైన విధానంలో తినకపోతే ఆరోగ్యానికి హాని కలుగుతుందట. మామిడి పండు తినడానికి సరైన పద్ధతేంటో తెలుసుకుండాం రండి.

మామిడిపండు తినడానికి ముందు..

చాలా మంది మామిడి పండ్లను తెచ్చుకోగానే ఫ్రిజ్‌లో పెట్టుకుంటారు. అవి పాడవకుండా ఎక్కువ కాలం తాజాగా ఉండేందుకు ఇలా చేస్తుంటారు. తినే ముందు బయటికి తీసి కడుక్కుని తింటారు. నిజానికి ఇది సరైన విధానం కాదట. మామిడి పండ్లను మార్కెట్ నుంచి తెచ్చిన వెంటనే శుభ్రంగా కడగాలట.వెంటనే తినాలనుకుంటే వీటిని ఒక పాత్రలో లేదా టబ్బు వంటి వెడల్పాటి గిన్నెలో నీరు పోసి దాంట్లో వేసి 25 నుంచి 30 నిమిషాల పాటు నానబెట్టాలి. ఆ తర్వాత దీన్ని కడుక్కుని తినాలి. పండు చల్లగా తియ్యాగా ఉండాలంటే చల్లటి నీటిలో వీటిని నానబెట్టచ్చు.

మామిడి పండును నిల్వ చేయడం ఎలా..

  • పూర్తిగా పండని మామిడిపండ్లను ఇంటికి తెచ్చుకుంటే వాటిని ఫ్రిజ్ లో ఉంచకండి. గది ఉష్ణోగ్రతలలో ఉండటం వల్ల 5 నుంచి 7 రోజుల్లో అవి పక్వానికి చేరుకుంటాయి.
  • పండ్ల మీద పేపర్ కప్పడం వల్ల పండ్లు త్వరగా పండుతాయి. నేరుగా వెలుతురు తగిలే చోట పండ్లను ఉంచడం వల్ల అవి పాడవుతాయి.
  • మామిడి పండ్లను నిల్వ చేయాలనుకుంటే వాటిని ఇతర పండ్లతో కలిపి ఉంచకండి. ఎందుకంటే ఇతర పండ్ల విడుదల చేసే ఎథైలిన్ గ్యాస్ ఈ పండు త్వరగా పాడైపోయేలా చేస్తుంది.
  • నిల్వ చేయాలనుకుంటే కడిగిన మామిడి పండ్లను ఫ్రిజ్ లో పెట్టి తినడానికి అరగంట ముందు బయటికి తీసి చల్లదనం తగ్గిన తర్వాత కట్ చేసుకుని తినాలి.

మామిడిపండు తిన్న తర్వాత..

మామిడిపండు తిన్న తర్వాత కొన్ని ఆహారను దూరంగా ఉండాలనీ కొన్ని రకాల పనులు చేయడకూడదని నిపుణులు చెబుతున్నారు. అవేంటంటే..

1. చల్లటి నీరు తాగకండి: మామిడిపండు తిన్న తర్వాత చల్లటి నీరు తాగడం జీర్ణక్రియను దెబ్బతీయవచ్చు.

2. పాల ఉత్పత్తులను తినకండి: మామిడిపండు, పాల కలయిక జీర్ణ సమస్యలు, మలబద్ధకం లేదా కడుపు అసౌకర్యం కలగించవచ్చు. కాబట్టి మామిడి పండు తిన్న తర్వాత పాలు తాగకండి.

3. పొగ త్రాగడం లేదా మద్యం సేవించకండి: మామిడిపండు తిన్న తర్వాత పొగ త్రాగడం లేదా మద్యం త్రాగడం జీర్ణక్రియపై ప్రతికూల ప్రభావం చూపిస్తుంది.

4. వేడి వేడి ఆహారాలు తినకండి: మామిడిపండు తిన్న తర్వాత వేడిగా ఉండే లేదా మసాలా ఆహారం తినడం మంచిది కాదు. ఇది కడుపులో అసౌకర్యాన్ని కలిగిస్తుంది.

5. ఇతర పండ్లు తినకండి: మామిడిపండు తిన్న తర్వాత ఇతర పళ్ళు తినడం జీర్ణ సమస్యలు, గ్యాస్ లేదా అజీర్ణం కలిగించవచ్చు.

6. నిద్రపోకండి: మామిడిపండు తిన్న వెంటనే నిద్రపోవడం వల్ల జీర్ణక్రియలో ఇబ్బందులు ఏర్పడవచ్చు. తిన్న తర్వాత కనీసం అరగంట సమయం తీసుకోండి.

7. మామిడిపండు తిన్న తర్వాత 30 నిమిషాల నుండి 1 గంట వరకు బరువులు ఎత్తడం, శారీరక వ్యాయామాలు వంటివి చేయకండి. ఇది జీర్ణక్రియను దెబ్బతీసే ప్రమాదముంది.

ఒక రోజులో ఎన్ని మామిడి పండ్లు తినాలి?

చాలామంది మామిడి పండ్లను చాలా ఇష్టపడతారు, ఒకేసారి రెండు మూడు మామిడి పండ్లు తింటుంటారు. ఇలా రోజు మొత్తంలో 5 నుండి 6 మామిడి పండ్లు తినే వారు చాలా మంది ఉంటారు. ఇది చాలా తప్పు. ఇలా చేస్తే పండు వల్ల లాభాలకు బదులుగా నష్టాలు జరుగుతాయి. జీర్ణక్రియ సమస్యలు పెరుగుతాయి. నిపుణుల సలహా మేరకు.. రోజుకు 1-2 కప్పులు, అంటే 150 నుండి 330 గ్రాముల మామిడి పండ్లు తినమని సూచిస్తున్నారు. అంటే రోజుకు ఒక మీడియం సైజు మామిడి పండును తినచ్చు. డయాబెటిస్ పేషెంట్లు రోజుకు 100 గ్రాములకు మించి తినకపోవడం మంచిది.

గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల అభిప్రాలయను క్రోడీకరించి మాత్రమే ఈ సూచనలు అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

Ramya Sri Marka

eMail
మార్క రమ్యశ్రీ హిందుస్తాన్ టైమ్స్‌ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ లైఫ్‌స్టైల్, ఆస్ట్రాలజీ వార్తలు రాస్తున్నారు. గతంలో ఈనాడు, టీన్యూస్, ఈటీవీ భారత్ వంటి సంస్థల్లో కంటెంట్ రైటర్‌గా పనిచేశారు.జర్నలిజంలో ఎనిమిదేశ్లకు పైగా అనుభవం ఉంది. కాకతీయ యూనివర్సిటీలో మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం పీజీ చేశారు. 2024 నవంబరులో హెచ్.టి తెలుగులో చేరారు.

సంబంధిత కథనం

Source / Credits

Best Web Hosting Provider In India 2024