




Best Web Hosting Provider In India 2024

Court Movie OTT: ఓటీటీలోకి వచ్చాక నేషనల్ రేంజ్‍లో కోర్ట్ సినిమా పాపులర్ అవుతుందా?
Court Movie OTT Streaming: కోర్ట్ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్‍కు సిద్ధమవుతోంది. ఐదు భాషల్లో ఈ శుక్రవారమే స్ట్రీమింగ్‍కు రానుంది. అయితే, ఈ లీగల్ డ్రామా మూవీ నేషనల్ వైడ్‍లోనూ పాపులర్ అవుతుందా అనేది ఆసక్తికరంగా మారింది. ఆ వివరాలు ఇవే..

తెలుగు లీగల్ డ్రామా మూవీ ‘కోర్ట్: స్టేట్ వర్సెస్ నో బడీ’ సినిమా కమర్షియల్‍గా సూపర్ హిట్ అవటంతో పాటు చాలా ప్రశంసలను దక్కించుకుంది. పోక్సో కేసు లాంటి సెన్సిటివ్ అంశంపై తెరకెక్కిన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. చట్టాల గురించి తెలిపే ఇలాంటి సినిమాలు రావాల్సిన అవసరం ఉందంటూ అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.
ప్రియదర్శి, హర్ష్ రోహణ్, శ్రీదేవి ప్రధాన పాత్రలు పోషించిన కోర్ట్ బాక్సాఫీస్ వద్ద బ్లాక్‍బస్టర్ అయింది. మంచి సినిమాగానూ గుర్తింపు దక్కించుకుంది. ఈ చిత్రానికి రామ్ జగదీశ్ దర్శకత్వం వహించారు. ఓటీటీలోకి కోర్ట్ సినిమా ఐదు భాషల్లోకి వస్తోంది. దీంతో మంచి పాయింట్‍తో వచ్చిన ఈ చిత్రం నేషనల్ వైడ్‍గా ఎలాంటి రెస్పాన్స్ దక్కించుకుంటుందోననే ఆసక్తి ఉంది.
నేషనల్ వైడ్ పాపులర్ అవుతుందా!
కోర్ట్ సినిమా మరో రెండు రోజుల్లో ఏప్రిల్ 11వ తేదీన నెట్‍ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లోకి రానుంది. తెలుగుతో పాటు హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో అడుగుపెట్టనుంది. థియేటర్లలో తెలుగులో ఒక్కటే రిలీజై ప్రశంసలు పొందిన ఈ మూవీ నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలోకి ఐదు భాషల్లోకి వస్తోంది.
పోక్సో కేసు చుట్టూ గ్రిప్పింగ్‍గా, ఆసక్తికరమైన నరేషన్‍తో కోర్ట్ సినిమా సాగుతుంది. పక్కా లీగల్ డ్రామాగా వచ్చింది. కొన్ని సందర్భాల్లో పోక్సో చట్టం ఎలా దుర్వినియోగం అవుతుందోనని దర్శకుడు ఈ చిత్రంలో చూపించారు. ఈ సినిమాలో కోర్టులో వాదనలు కూడా ఇంట్రెస్టింగ్‍గా సాగుతాయి. ఏ దశలోనూ సాగదీసినట్టు అనిపించదు. నటీనటుల పర్ఫార్మెన్స్ కూడా మెప్పిస్తుంది. అలాగే లీగల్ డ్రామా సినిమాలకు గ్లోబల్ అప్పీల్ ఉంటుంది. దీంతో నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్‍కు వచ్చాక కోర్ట్ సినిమా నేషనల్ వైడ్‍గా పాపులర్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
కోర్ట్ చిత్రంపై ఇతర భాషల్లోనూ ఇప్పటికే కాస్త బజ్ ఉంది. ఈ సినిమాపై సోషల్ మీడియాలో జరిగిన చర్చలు కూడా ఇందుకు కారణమయ్యాయి. అందులోనూ ఐదు భాషల్లో ఈ చిత్రం ఓటీటీలోకి వస్తోంది. దీంతో ఈ సినిమా ఓటీటీలో అదరగొట్టే ఛాన్స్ అధికంగా ఉంది. మరి నేషనల్ వైడ్‍గా ప్రేక్షకుల నుంచి ఈ చిత్రానికి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి.
బాక్సాఫీస్ సక్సెస్
కోర్ట్ సినిమా బాక్సాఫీస్ వద్ద అంచనాలకు మించి సక్సెస్ సాధించింది. దాదాపు రూ.10కోట్ల బడ్జెట్‍తో రూపొందిన ఈ మూవీ.. రూ.57కోట్ల గ్రాస్ కలెక్షన్లను దాటి బ్లాక్‍బస్టర్ కొట్టింది. లీగల్ డ్రామాగా వచ్చి అదరగొట్టింది. వాల్ పోస్టర్ సినిమా పతాకంపై నేచురల్ స్టార్ నాని ఈ చిత్రాన్ని సమర్పించారు.
కోర్ట్ చిత్రాన్ని లీగల్ డ్రామాగా కనెక్ట్ అయ్యేలా తెరకెక్కించారు డైరెక్టర్ రామ్ జగదీశ్. కమర్షియల్ హంగుల జోలికి వెళ్లకుండా కథకే కట్టుబడి ప్రశంసలు పొందారు. ఈ చిత్రంలో సినిమాలో న్యాయవాదిగా ప్రియదర్శి నటించారు. ప్రేమికుల పాత్రల్లో హర్ష్ రోహణ్, శ్రీదేవి మెప్పించారు. శివాజీ, హర్షవర్దన్,, సురభి పార్వతి, సాయికుమార్, రోహిణి ఈ సినిమాలో కీరోల్స్ చేశారు. ఈ సినిమాకు విజయ్ బుల్గానిన్ మ్యూజిక్ ఇచ్చారు.
సంబంధిత కథనం