




Best Web Hosting Provider In India 2024

Weekend OTT: ఓటీటీల్లో ఈ వీకెండ్ మిస్ కాకుండా చూడాల్సిన నాలుగు లేటెస్ట్ స్ట్రీమింగ్ సినిమాలు! ఓ సిరీస్ కూడా..
OTT Weekend: ఈవారం కూడా చాలా సినిమాలు ఓటీటీలోకి వస్తున్నాయి. అయితే, మిస్ కాకుండా చూడాల్సినవి వాటిలో కొన్ని ఉన్నాయి. నాలుగు చిత్రాలు ఆసక్తిని రేపుతున్నాయి. ఓ సిరీస్ 6వ సీజన్ కూడా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఆ వివరాలు ఇవే..

ఈ వీకెండ్లో ఓటీటీల్లో కొత్త కంటెంట్ చూడాలని ప్లాన్ చేసుకుంటున్నారా.. అయితే ఈవారం అదిరిపోయే సినిమాలు కొన్ని ఎంట్రీ ఇవ్వనున్నాయి. ఈ వారంలోనూ చాలా చిత్రాలు, సిరీస్‌లు ఓటీటీల్లోకి వస్తుండగా.. నాలుగు సినిమాలు, ఓ సిరీస్ తప్పక చూడాల్సినవి అనిపిస్తున్నాయి. ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. అవేవో ఇక్కడ తెలుసుకోండి. ఈ వీకెండ్ చూసేందుకు సిద్ధమవండి.
ఛావా.. (నెట్‌ఫ్లిక్స్)
మరాఠా యోధుడు, ఛత్రవతి సంభాజీ మహరాజ్ జీవితం ఆధారంగా ఛావా చిత్రం రూపొందింది. ఈ మూవీలో సంభాజీ పాత్ర పోషించారు విక్కీ కౌశల్. ఫిబ్రవరి 14వ తేదీన విడుదలైన ఈ హిస్టారికల్ యాక్షన్ మూవీ భారీ బ్లాక్‌బస్టర్ సాధించింది. రూ.780కోట్ల కలెక్షన్లను దాటింది. ఈ ఛావా సినిమా ఈ శుక్రవారం ఏప్రిల్ 11వ తేదీన నెట్‌ఫ్లిక్స్ స్ట్రీమింగ్కు రానుంది. ఈ మూవీకి లక్ష్మణ్ ఉతేకర్ దర్శకత్వం వహించారు. ఈ వీకెండ్ ఓటీటీలో సినిమా చూడాలనుకుంటే ఛావా బెస్ట్ ఆప్షన్‌గా ఉంటుంది. థియేటర్లలో చూసిన వారు కూడా రీవాచ్ చేసేందుకు ఇది సూటయ్యే చిత్రం. ఈ మూవీలో విక్కీతో పాటు రష్మిక మందన్నా కూడా లీడ్ రోల్ చేశారు.
ది లెజెండ్ ఆఫ్ హనుమాన్ సీజన్ 6 (జియో హాట్‌స్టార్)
ది లెజెండ్ ఆఫ్ హనుమాన్ వెబ్ సిరీస్‌లో 6వ సీజన్ ఏప్రిల్ 11వ తేదీన జియో హాట్‌స్టార్ ఓటీటీలోకి రానుంది. ఈ సిరీస్ చూసే వారు ఈ కొత్త సీజన్‌ను కూడా మిస్ కాకూడదు. సంజీవని మొక్కను తెచ్చి లక్ష్మణుడిని హనుమంతుడు రక్షించడం చుట్టూ ఈ సీజన్ 6 ఉంటుంది. రామాయణంలోని హనుమంతుడి ఆధారంగా ది లెజెండ్ ఆఫ్ హనుమాన్ యానిమేటెడ్ సిరీస్‌ను క్రియేట్ చేశారు శరత్ దేవరాజన్, జీవన్, చారూవి అగర్వాల్. ఐదు సీజన్లకు మంచి రెస్పాన్స్ వచ్చింది.
కోర్ట్ (నెట్‌ఫ్లిక్స్)
కోర్ట్ సినిమా ఉత్కంఠభరితంగా సాగే లీగల్ డ్రామా చిత్రం. ఈ తెలుగు చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ బ్లాక్‌బస్టర్ సాధించింది. లవ్ స్టోరీ, పోక్సో కేసు చుట్టూ ఈ చిత్రం గ్రిప్పింగ్‌గా ఉంటుంది. ప్రియదర్శి ప్రధాన పాత్ర పోషించిన కోర్ట్ చిత్రం నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో ఏప్రిల్ 11నే స్ట్రీమింగ్కు రానుంది. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీలోనూ స్ట్రీమింగ్కు రానుంది. మార్చి 14న థియేటర్లలో విడుదలై సూపర్ హిట్ సాధించిన ఈ మూవీ నెలలోని ఓటీటీలోకి వస్తోంది. రామ్ జగదీశ్ కోర్ట్ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ వీకెండ్లో ఓటీటీలో చూసేందుకు కోర్ట్ మంచి చిత్రంగా ఉంటుంది. ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు.
చోరీ 2 (అమెజాన్ ప్రైమ్ వీడియో)
చోరీ 2 చిత్రం ఏప్రిల్ 11వ తేదీన అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో స్ట్రీమింగ్కు వస్తోంది. హారర్ థ్రిల్లర్ చిత్రాలంటే ఇష్టపడే వారు ఈ సినిమాను తప్పక చూడొచ్చు. విశాల్ ఫురియా దర్శకత్వంలో నుష్రత్ బరూచా ప్రధాన పాత్ర పోషించిన ఈ మూవీ థియేటర్లలో కాకుండా నేరుగా ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్కు వస్తోంది. అతీత శక్తుల నుంచి తన కూతురిని ఓ తల్లి రక్షించుకునేందుకు చేసే ప్రయత్నాలతో చోరీ 2 ఉండనుంది. 2021లో వచ్చిన చోరీకి సీక్వెల్‌గా ఈ చిత్రం వస్తోంది.
ప్రావింకూడు షప్పు (సోనీ లివ్)
థియేటర్లలో విడుదలైన సుమారు మూడు నెలలకు ఓటీటీలోకి వస్తోంది ప్రావింకూడు షప్పు సినిమా. శ్రీరాజ్ శ్రీనివాసన్ దర్శకత్వం వహించిన ఈ మలయాళ డార్క్ కామెడీ క్రైమ్ థ్రిల్లర్ చిత్రం సూపర్ హిట్ అయింది. ఈ శుక్రవారం ఏప్రిల్ 11వ తేదీన సోనీలివ్ ఓటీటీ ప్లాట్ఫామ్లో ఈ మూవీ స్ట్రీమింగ్కు రానుంది. సౌహిబ్ షాహిర్, బాసిల్ జోసెఫ్, చెంబన్ వినోద్ జోస్ లీడ్ రోల్స్ చేసిన ఈ సినిమా మలయాళం, తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో సోనీ లివ్‌లోకి అడుగుపెడుతోంది. ఓటీటీలో ఈ వీకెండ్ సినిమా చూడాలనుకునే వారికి ప్రావింకూడు షప్పు మంచి ఆప్షన్.
సంబంధిత కథనం