


Best Web Hosting Provider In India 2024

Telugu Serials: ఐదు తెలుగు సీరియల్స్‌కు శుభం కార్డు.. అన్నీ ఈ నెలలోనే.. అందులో 1550 ఎపిసోడ్ల సీరియల్ కూడా..
Telugu Serials: ఒక్క ఏప్రిల్ నెలలోనే ఐదు తెలుగు టీవీ సీరియల్స్ కు శుభం కార్డు పడనుంది. వీటిలో స్టార్ మా, జీ తెలుగు, ఈటీవీ ఛానెల్స్ కు చెందిన సీరియల్స్ ఉన్నాయి. అంతేకాదు 1550 ఎపిసోడ్ల సుదీర్ఘ సీరియల్ కు కూడా ఫుల్ స్టాప్ పడనుంది.

Telugu Serials: ప్రముఖ తెలుగు టీవీ ఛానెల్స్ అయిన స్టార్ మా, జీ తెలుగు, ఈటీవీలాంటి వాటిలో ఎప్పటికప్పుడు కొత్త కొత్త సీరియల్స్ వస్తూనే ఉన్నాయి. అలాగే సుదీర్ఘ కాలంగా వందల ఎపిసోడ్లుగా సాగుతున్న మరికొన్ని సీరియల్స్ కూడా ముగింపుకు వచ్చేస్తున్నాయి. అలా ఈ ఒక్క ఏప్రిల్ నెలలోనే ఐదు సీరియల్స్ ముగియబోతున్నాయి.
శుభం కార్డు పడే సీరియల్స్ ఇవే
ఏప్రిల్ నెలలోనే శుభం కార్డు పడనున్న సీరియల్స్ లో స్టార్ మా, జీ తెలుగు, ఈటీవీకి చెందిన సీరియల్స్ ఉన్నాయి. వీటిలో ఒక్క ఈటీవీ ఛానెల్లోనే మూడు సీరియల్స్ ప్రేక్షకులకు గుడ్ బై చెప్పనున్నాయి. ఈ ఛానెల్లో మధ్యాహ్నం ఒకటిన్నరకు వచ్చే వసంత కోకిల సీరియల్ ఈ నెలలోనే ముగియనుంది. ఏప్రిల్ 19 లేదా ఆ తర్వాతి వారం ఈ సీరియల్ కు శుభం కార్డు పడనున్నట్లు తెలుస్తోంది.
ఇక ఇదే ఛానెల్లో వచ్చే మరో సీరియల్ నేను శైలజ కూడా చివరికి వచ్చేసింది. గతంలో లాక్డౌన్ సమయంలో 268 ఎపిసోడ్లపాటు కొనసాగించి ఈ సీరియల్ ను ఆపేశారు. ఇప్పుడు కూడా అన్నే ఎపిసోడ్ల పాటు ఈ సీరియల్ రానుంది. ఈటీవీలోనే వచ్చే మరో సీరియల్ తులసి. దీనికి సంబంధించిన క్లైమ్యాక్స్ ఎపిసోడ్ కూడా రెండు వారాల కిందటే పూర్తయింది. త్వరలోనే శుభం కార్డు వేయబోతున్నారు.
స్టార్ మా, జీ తెలుగు సీరియల్స్ ఇవే
ఈటీవీనే కాదు ఈ నెలలో ముగిసే సీరియల్స్ లో స్టార్ మా, జీ తెలుగుకు చెందిన సీరియల్స్ కూడా ఉన్నాయి. స్టార్ మాలో వచ్చే ఎటో వెళ్లిపోయింది మనసు ఇందులో ఒకటి. ఈ సీరియల్ చివరి ఎపిసోడ్ షూటింగ్ ఈ మధ్యే జరిగింది. ప్రతి రోజూ మధ్యాహ్నం 3.30 గంటలకుకు వచ్చే ఈ సీరియల్.. ఏప్రిల్ 19 లేదా 26న ముగుస్తుందని భావిస్తున్నారు.
అటు జీ తెలుగులో సుదీర్ఘకాలంగా సాగుతున్న సీరియల్ ప్రేమ ఎంత మధురం. ఇప్పటికే 1500కుపైగా ఎపిసోడ్లు పూర్తి చేసుకుంది. మొత్తానికి ఈ నెలలోనే ఈ సీరియల్ ప్రేక్షకులకు గుడ్ బై చెప్పబోతోంది. ఏప్రిల్ 25న 1550వ ఎపిసోడ్ తో ప్రేమ ఎంత మధురం ముగియనుంది. ఇలా ఒకే నెలలో ఐదు సీరియల్స్ తెలుగు ప్రేక్షకుల దగ్గర వీడ్కోలు తీసుకుంటున్నాయి. మరి వీటి స్థానంలో ఏ సీరియల్స్ వస్తాయో చూడాలి.
సంబంధిత కథనం