




Best Web Hosting Provider In India 2024

TG Inter Project SERVE : తెలంగాణ ఇంటర్ విద్యార్థులకు స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, ప్రాజెక్ట్ సర్వ్ ప్రారంభం
TG Inter Project SERVE : ఇంటర్మీడియట్ విద్యాశాఖ… కమ్యూనికేషన్, ఇంటర్వ్యూ స్కిల్స్ పై ‘ప్రాజెక్ట్ సర్వ్’ (Project SERVE) తొలి ఆన్లైన్ సెషన్ ప్రారంభించింది. 21 రోజులపాటు నిర్వహించే స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

TG Inter Project SERVE : ఇంటర్మీడియట్ విద్యాశాఖ ప్రాజెక్ట్ సర్వ్ పేరిట కమ్యూనికేషన్, ఇంటర్వ్యూ స్కిల్స్ పై తొలి ఆన్లైన్ సెషన్ ను ప్రారంభించింది. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ లోని రెండు ప్రభుత్వ జూనియర్ కాలేజీలకు చెందిన విద్యార్థులతో పైలట్ ప్రాజెక్టుగా ఇంటర్ బోర్డు ప్రారంభించింది.
ఏక్ స్టెప్ ఫౌండేషన్ భాగస్వామ్యంగా నిర్వహించబడిన ప్రాజెక్ట్ SERVE లో అన్ని ప్రభుత్వ జూనియర్, వృత్తి విద్యా కాలేజీలలో విద్యా నాణ్యతను ఆన్లైన్ ప్లాట్ ఫామ్ ద్వారా మెరుగుపర్చడానికి ఉద్దేశించిన ఒక కొత్త ఆలోచన. ఈ కార్యక్రమానికి నేతృత్వం వహిస్తున్న ప్రాజెక్ట్ SERVE కోఆర్డినేటర్ గోపాల బాల సుబ్రహ్మణ్యంతో పాటు, ఇంటర్మీడియట్ విద్యాశాఖ డైరెక్టర్ శ్రీ కృష్ణ ఆదిత్య, కమ్యూనికేషన్ స్కిల్ నిపుణుడు వరప్రసాద్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
డిజిటల్ ఎడ్యుకేషన్
ఈ సందర్భంగా ఇంటర్మీడియట్ విద్యాశాఖ డైరెక్టర్ కృష్ణ ఆదిత్య మాట్లాడుతూ… ఏక్ స్టెప్ ఫౌండేషన్ ద్వారా దశల వారీగా అమలు చేసే ఈ డిజిటల్ విద్యా కార్యక్రమం ద్వారా అధ్యాపకుల కొరత, నైపుణ్యాలలో లోపాలు, డ్రాప్ అవుట్ రేట్లు వంటి ప్రధాన సవాళ్లను పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. ప్రోగ్రామ్ మొదటి దశలో పైలట్ కార్యక్రమంగా నాంపల్లి గవర్నమెంట్ వొకేషనల్ జూనియర్ కాలేజీ, చంచలగూడ గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో డిజిటల్ క్లాసులను ప్రారంభించామన్నారు. ఇది విద్యార్థులకు మంచి విద్యా అవకాశాలను అందించేందుకు తోడ్పడుతుందన్నారు.
విద్యార్థులకు నిరంతర విద్యా అవకాశాలను అందించేందుకు, పరిమిత విద్యా సిబ్బంది ఉన్న కాలేజీలకు డిజిటల్ ప్లాట్ ఫామ్ ద్వారా పాఠాలు ప్రసారం చేస్తామన్నారు. దీంతో విద్యార్థులు డిజిటల్ క్లాసుల రూపంలో అవాంతరం లేకుండా బోధన పొందడానికి సహాయపడుతుందన్నారు.
21 రోజుల పాటు స్కిల్ ప్రోగ్రామ్
కమ్యూనికేషన్ స్కిల్ నిపుణుడు వరప్రసాద్ .. “సమర్థవంతమైన కమ్యూనికేషన్, ఇంటర్వ్యూ స్కిల్స్” పై విద్యార్థులకు విలువైన పాఠాలను అందించారు. విజయానికి కావలసిన లక్షణాలు- ప్రేరణ, క్రమశిక్షణ ఆత్మవిశ్వాసం, నిబద్దత, పట్టుదలతో అభ్యాసం, శాంతి, బాడీ లాంగ్వేజ్, విజయ సాధనలో ఆత్మవిశ్వాసం గురించి వివరించారు. 21 రోజులపాటు నిర్వహించే స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాల ద్వారా క్రమశిక్షణ, ఏకాగ్రత వంటి విజయ మార్గాలు జీవితంలో అలవర్చుకునేలా తోడ్పడతాయన్నారు. ప్రాజెక్ట్ SERVE గవర్నమెంట్ జూనియర్ కాలేజీలలో విద్యాపరివర్తన కోసం ప్రేరేపించే ఇటువంటి మార్పులను తీసుకురావడానికి ఉద్దేశించిందని పేర్కొన్నారు.
సంబంధిత కథనం
టాపిక్