




Best Web Hosting Provider In India 2024

Kannappa New Release Date: కన్నప్ప సినిమా రిలీజ్‍కు కొత్త డేట్ ఫిక్స్.. సీఎంను ఫేవరెట్ హీరో అంటూ పోస్ట్ చేసిన విష్ణు
Kannappa New Release Date: కన్నప్ప చిత్రానికి కొత్త విడుదల తేదీ ఖరారైంది. ఉత్తర ప్రదేశ్ సీఎం ఆదిత్యనాథ్.. కొత్త డేట్‍తో ఉన్న ఈ సినిమా పోస్టర్ ఆవిష్కరించారు. ఆయనను మంచు విష్ణు, మోహన్ బాబు కలిశారు.

మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటించిన కన్నప్ప చిత్రంపై మంచి అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాను విష్ణు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. శివుడి పరమ భక్తుడు కన్నప్ప పాత్రను ఈ మైథలాజికల్ మూవీలో ఆయన పోషించారు. ఏప్రిల్ 25న విడుదల కావాల్సిన ఈ చిత్రం వాయిదా పడింది. దీంతో విడుదల ఎప్పుడు అనే ఆసక్తి నెలకొంది. ఈ తరుణంలో కన్నప్ప రిలీజ్‍కు డేట్ ఖరారైంది. ఈ విషయాన్ని మంచు విష్ణు నేడు (ఏప్రిల్ 9) వెల్లడించారు.
కొత్త డేట్ ఇదే.. పోస్టర్ ఆవిష్కరించిన యూపీ సీఎం
కన్నప్ప సినిమాను జూన్ 27వ తేదీన విడుదల చేస్తామని మంచు విష్ణు నేడు ప్రకటించారు. కొత్త విడుదల తేదీ ఉన్న ఈ చిత్రం పోస్టర్‌ను ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆవిష్కరించారు. ఆయనను మంచు విష్ణు, మంచు మోహన్ బాబు కలిశారు.
ఫేవరెట్ హీరో అంటూ..
యూపీ సీఎంను తాము కలిసి ఫొటోలను నేడు సోషల్ మీడియాలో షేర్ చేశారు మంచు విష్ణు. “నా ఫేవరెట్ హీరోల్లో ఒకరైన యోగి ఆదిత్యనాథ్‍ను కలిశా. కన్నప్ప డేట్ అనౌన్స్‌మెంట్ పోస్టర్‌ను ఆయన లాంచ్ చేశారు. రమేశ్ గొరిజాల పెయిటింగ్‍ను ఆయనకు బహుమతిగా అందజేశా. ఆయనకు చాలా శక్తివంతమైన ఆరా ఉంది” అని మంచు విష్ణు ట్వీట్ చేశారు.
కన్నప్ప షూటింగ్ ఇప్పటికే పూర్తయింది. అయితే, వీఎఫ్ఎక్స్ పనులు ఆలస్యమవటంతో వాయిదా వేసినట్టు సమాచారం బయటికి వచ్చింది. ఎట్టకేలకు జూన్ 27న ఈ మూవీని రిలీజ్ చేయనున్నట్టు అధికారిక ప్రకటన వచ్చేసింది. తెలుగుతో పాటు హిందీ, తమిళం, మలయాళం, కన్నడలో ఈ మూవీ రిలీజ్ చేసేందుకు టీమ్ ప్లాన్ చేసింది. ఈ సినిమాకు ముకేశ్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించారు.
కన్నప్ప సినిమాలో పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ కూడా ఓ పాత్ర పోషించారు. రుద్ర అనే క్యారెక్టర్ చేశారు. ఇప్పటికే వచ్చిన ప్రభాస్ ఫస్ట్ లుక్ ఆకట్టుకుంది. ఈ మూవీలో మలయాళ సీనియర్ స్టార్ హీరో మోహన్‍లాల్ కూడా ఓ ముఖ్యమైన పాత్ర చేశారు. శివుడిగా బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్, పార్వతి దేవిగా కాజల్ అగర్వాల్ నటించారు. మంచు మోహన్ బాబు, శరత్ కుమార్ కూడా కీరోల్స్ చేశారు. ముకేశ్ రుషి, మధు, రఘుబాబు కూడా కీలకపాత్రల్లో కనిపించనున్నారు.
కన్నప్ప సినిమాకు స్టీవెన్ దేవసీ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం నుంచి వచ్చిన ఫస్ట్ సాంగ్ “శివా శివా శంకర” బాగా పాపులర్ అయింది. పాజిటివ్ రెస్పాన్స్ దక్కించుకుంది. ఈ చిత్రాన్ని 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ, ఏవీఏ ఎంటర్‌టైన్‍మెంట్ పతాకాలపై మంచు మోహన్ బాబు ప్రొడ్యూజ్ చేశారు. ఈ చిత్రానికి రూ.100కోట్లకు పైగా బడ్జెట్ అయినట్టు అంచనా.
కన్నప్ప సినిమా షూటింగ్ ఎక్కువ భాగం న్యూజిలాండ్‍లోనే జరిగింది. ఈ మూవీలో విజువల్స్ అద్భుతంగా ఉంటాయంటూ కొంతకాలంగా మంచు విష్ణు చెబుతూ వస్తున్నారు. తొలి టీజర్ వచ్చినప్పుడు వీఎఫ్‍ఎక్స్ విషయంలో నెగెటివిటీ రావటంతో.. ఆ దిశగా మూవీ టీమ్ ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. వీఎఫ్‍ఎక్స్ మరింత మెరుగ్గా ఉండేలా చర్యలు తీసుకుంటోందని, అందుకే ఆలస్యమైందని తెలుస్తోంది.
సంబంధిత కథనం