




Best Web Hosting Provider In India 2024

OTT Horror Movie: ఉల్లిగడ్డల కోసం వేధించే దెయ్యం.. 3 ఓటీటీల్లో హారర్ థ్రిల్లర్ మూవీ.. రెండింట్లో ఫ్రీగా స్ట్రీమింగ్!
A Tale Of Onion Witch OTT Streaming: ఓటీటీలో డిఫరెంట్ హారర్ కామెడీ థ్రిల్లర్ మూవీ ఏ టేల్ ఆఫ్ ఆనియన్ విచ్ స్ట్రీమింగ్ అవుతోంది. అది కూడా మూడు ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లలో ఏ టేల్ ఆఫ్ ఆనియన్ విచ్ మూవీ రిలీజ్ అయింది. ఉల్లిగడ్డల కోసం వేధించే ఓ దెయ్యం కథతో తెరకెక్కిన ఈ సినిమా రెండింట్లో ఫ్రీగా చూసేయొచ్చు.

A Tale Of Onion Witch OTT Release: ఓటీటీలో డిఫరెంట్ కంటెంట్ సినిమాలకు ఎలాంటి కొదవ లేదు. ప్రస్తుతం ఎన్నో వైవిధ్యభరితమైన సినిమాలు ఓటీటీ స్ట్రీమింగ్కు వస్తున్నాయి. అంతేకాకుండా డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీస్ ఓటీటీలో ఇదివరకే డిజిటల్ స్ట్రీమింగ్ అవుతున్నాయి.
హారర్ కామెడీ జోనర్లో
ఇక హారర్ థ్రిల్లర్ జోనర్ మూవీస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎంత కొత్తగా, విభిన్నంగా వీటిని తెరకెక్కిస్తే వాటికి అంత ఆదరణ లభిస్తుంది. రన్ టైమ్ వంటివి పట్టించుకోకుండా చూస్తున్నంతసేపు ఎంగేజ్ చేస్తే చాలు అనుకుంటారు ఓటీటీ ఆడియెన్స్. ఇక ఈ హారర్ జోనర్‌కు కాస్తా కామెడీ యాడ్ చేసి తెరకెక్కిన సినిమాలు ఎన్నో సూపర్ హిట్ సాధించాయి.
ఇదిలా ఉంటే, హారర్ కామెడీ థ్రిల్లర్ జోనర్లో ఎవరు తెరకెక్కించని డిఫరెంట్ కాన్సెప్ట్‌తో ఓ సినిమా వచ్చింది. అది కూడా 2019లోనే. ఆ సినిమా పేరే ఏ టేల్ ఆఫ్ ఆనియన్ విచ్. టైటిల్‌కు తగినట్లుగానే ఈ సినిమాలో ఉల్లిగడ్డల కోసం ఓ దెయ్యం వేధిస్తుంటుంది. దాని నుంచి ఇద్దరు అబ్బాయిలు ఎలా తప్పించుకున్నారనేదే ఈ ఏ టేల్ ఆఫ్ ఆనియన్ మూవీ కథ.
ఏ టేల్ ఆఫ్ ఆనియన్ విచ్ ఓటీటీ రిలీజ్
ఏకంగా మూడు ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లలో ఏ టేల్ ఆఫ్ ఆనియన్ డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోంది. అమెజాన్ ప్రైమ్, యూట్యూబ్, ఏయిర్టెల్ ఎక్స్‌ట్రీమ్‌లలో ఏ టేల్ ఆఫ్ ఆనియన్ విచ్ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. అమెజాన్ ప్రైమ్‌లో సబ్స్క్రిప్షన్ ఉంటేనే ఈ సినిమాను చూడగలం. కానీ, యూట్యూబ్, ఏయిర్టెల్ ఎక్స్‌ట్రీమ్‌లలో మాత్రం ఎలాంటి సబ్స్క్రిప్షన్, రెంటల్ ఛార్జెస్ లేకుండా ఏ టేల్ ఆఫ్ ఆనియన్ విచ్ మూవీని చూడొచ్చు.
అంటే, యూట్యూబ్, ఏయిర్టెల్ ఎక్స్‌ట్రీమ్‌లలో ఫ్రీగా ఏ టేల్ ఆఫ్ ఆనియన్ విచ్ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. ఇలా రెండింట్లో ఉచితంగా, ఒకదాంట్లో సబ్‌స్క్రిప్షన్‌తో ఏ టేల్ ఆఫ్ ఆనియన్ విచ్ ఓటీటీ రిలీజ్ అయింది. కాగా ఈ సినిమాకు పియూష్ శ్రీవాత్సవ్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో కేవలం నలుగురు మాత్రమే యాక్ట్ చేయడం విశేషం.
ఐఎమ్‌డీబీ రేటింగ్
ఏ టేల్ ఆఫ్ ఆనియన్ విచ్ సినిమాలో క్రిణగా అమిత కులకర్ణి, మంగ్లగా అర్చన్ మిటల్, రోహిత్‌గా ప్రఖర్ తోష్నివాల్, దినేష్‌గా సౌరభ్ ముఖిజ ప్రధాన ప్రాత్రల్లో నటించి అలరించారు. ఇక హిందీ భాషలో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోన్ ఏ టేల్ ఆఫ్ ఆనియన్ విచ్ సినిమా ఐఎమ్‌డీబీ నుంచి 10కి 6.7 రేటింగ్ సొంతం చేసుకుంది.
ఏ టేల్ ఆఫ్ ఆనియన్ విచ్ మూవీ కథలోకి వెళితే.. ఓ ఫ్లాట్‌లోకి కొత్తగా ఇద్దరు బ్యాచిలర్స్ రెంట్ కోసం వస్తారు. వారికి రూమ్ చూపించిన ఓనర్‌తో రెంట్ కాస్తా తక్కువ చేయమని దినేష్, రోహిత్ అడుగుతారు. దానికి వెంటనే ఇంటావిడ ఒప్పుకుంటుంది. కానీ, ఒక కండిషన్ కూడా పెడుతుంది.
ఇదే కథ
ఆ కండిషన్ ఏంటీ, దానికి బ్యాచిలర్స్ ఇద్దరు ఎందుకు ఒప్పుకున్నారు, ఆ తర్వాత ఆ ఇంట్లో జరిగిందేంటీ అనేదే మిగతా ఏ టేల్ ఆఫ్ ఆనియన్ విచ్ సినిమా కథ. కామెడీతోపాటు హారర్ ఫీల్ ఇచ్చే సినిమా చూడాలనుకునే వారు ఏ టేల్ ఆఫ్ ఆనియన్ విచ్ మూవీని ఎంచక్కా ఓటీటీలో చూసి ఆనందించొచ్చు.
సంబంధిత కథనం
టాపిక్