




Best Web Hosting Provider In India 2024

AP Icet 2025: ఏపీ ఐసెట్ 2025కు 35వేల దరఖాస్తులు, నేటి నుంచి దరఖాస్తులకు ఆలస్య రుసుము వసూలు
AP Icet 2025: ఆంధ్రప్రదేశ్‌లో ఎంబిఏ, ఎంసిఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ 2025 దరఖాస్తుల స్వీకరణ గడువు ముగిసే సమయానికి 35వేల మంది దరఖాస్తు చేసుకున్నారు. నేటి నుంచి ఏప్రిల్ 28వ తేదీ వరకు ఆలస్య రుసుముతో దరఖాస్తు చేయొచ్చు.

AP Icet 2025: ఎంబిఏ, ఎంసిఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఐసెట్ నోటిఫికేషన్ గత నెలల విడుదలైంది. 2025-26 విద్యా సంవత్సరంలో ప్రవేశాల కోసం ఈ ఏడాది ప్రవేశపరీక్షను ఆంధ్రా యూనివర్శిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తారు.
రాష్ట్రవ్యాప్తంగా ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి నిర్వహించే ఏపీ ఐసెట్-2025కు దరఖాస్తు గడువు బుధవారంతో ముగిసిందని కన్వీనర్ ప్రొఫెసర్ ఎం.శశి తెలిపారు. గడువు ముగిసే సమయానికి 35 వేల దరఖాస్తులు వచ్చినట్టు తెలిపారు. రూ.1000 అపరాధ రుసుముతో ఈ నెల 14వరకు, రూ.2 వేలతో 19 వరకు, రూ.4 వేలతో 24 వరకు, రూ.10 వేల అపరాధ రుసుముతో 28 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. మే రెండో తేదీ నుంచి హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చునని, మే ఏడో తేదీన రాష్ట్రవ్యాప్తంగా పరీక్ష జరుగుతుందని వెల్లడించారు.
ఏపీ ఐసెట్ నోటిఫికేషన్(AP ICET Notification) మార్చిలో విడుదలైంది. రాష్ట్రంలోని ఎంబీఏ, ఎంసీఏ ప్రవేశాలకు ఏపీ ఉన్నత విద్య మండలి తరపున ఆంధ్రా యూనివర్సిటీ నోటిఫికేషన్ విడుదల చేసింది.
మార్చి 13 వ తేదీ నుంచి ఏపీ ఐ సెట్ దరఖాస్తుల విక్రయం ప్రారంభం అవుతుంది. ఏప్రిల్ 9వ తేదీ వరకు అప్లికేషన్లు స్వీకరించనున్నారు. మే 7 తేదీన ఐసెట్ పరీక్ష నిర్వహించనున్నారు. ఓసీ అభ్యర్థులు రూ.650, బీసీలు రూ.600, ఎస్సీ, ఎస్టీలు రూ.550 ఫీజులు చెల్లించాల్సి ఉంటుంది. పరీక్ష ఫీజును పేమెంట్ గేట్ వే, క్రెడిట్, డెబిట్ కార్డులు, నెట్ బ్యాంకింగ్ ద్వారా కట్టొచ్చు.
మార్చి 13 నుంచి అప్లికేషన్లు
ఎంబీఏ, ఎంసీఏ ప్రవేశాల కోసం ఐ సెట్ (AP ICET 2025) అధికారిక వెబ్‌సైట్ https://cets.apsche.ap.gov.in లో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు ప్రక్రియ మార్చి 13వ తేదీ నుంచి ప్రారంభం అవుతుంది. విశాఖపట్నం ఆంధ్రా యూనివర్శిటీ ఈ ఏడాది ప్రవేశ పరీక్ష, అడ్మిషన్లను నిర్వహిస్తుంది.
అర్హులైన అభ్యర్థులు కంప్యూటర్ ఆధారిత పరీక్ష కోసం ఆన్‌లైన్ ఫారమ్‌ను సమర్పించాలి. ఎంట్రన్స్ పరీక్షలో మూడు వేర్వేరు విభాగాల నుంచి మొత్తం 200 ప్రశ్నలు అడుగుతారు. ప్రతి ప్రశ్నకు 1 మార్కు ఉంటుంది. నెటిగివ్ మార్కుల నిబంధన లేదు. మే 7వ తేదీన ఉదయం 9 గంటల నుంచి 11.30వరకు ఓ సెషన్, మధ్యాహ్నం రెండు నుంచి నాలుగున్నర వరకు మరో సెషన్‌లో పరీక్షలు జరుగుతాయి.
ఐసెట్ 2025 ముఖ్యమైన తేదీలు..
ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభ తేదీ మార్చి 13
ఆలస్య రుసుము లేకుండా దరఖాస్తుల స్వీకరణ ఏప్రిల్ 9
రూ.1000 ఆలస్య రుసుముతో ఏప్రిల్ 10 నుంచి 14 వరకు
రూ.2వేల ఆలస్య రుసుముతో ఏప్రిల్ 15 నుంచి 19 వరకు
రూ.4వేల ఆలస్య రుసుముతో ఏప్రిల్ 20 నుంచి 24 వరకు
రూ.10వేల ఆలస్య రుసుముతో ఏప్రిల్ 25 నుంచి 28 వరకు స్వీకరిస్తారు.
దరఖాస్తుల్లో సవరణలు, కరెక్షన్స్ చేయడానికి ఏప్రిల్ 29, 30 తేదీలు
హాల్ టిక్కెట్స్ మే 2 నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు
ప్రవేశ పరీక్షను మే 7వ తేదీన నిర్వహిస్తారు.
ప్రిలిమినరీ కీ మే 10న విడుదల చేస్తారు.
అభ్యంతరాలను మే 12 వరకు స్వీకరిస్తారు.
ఐసెట్ 2025 ఫలితాలను మే 21న విడుదల చేస్తారు.
నోటిఫికేఫన్ కోసం ఈ లింకును అనుసరించండి…
https://cets.apsche.ap.gov.in/ICET24/ICETHomePages/ImportantDates.aspx
సంబంధిత కథనం
టాపిక్