భారత్‌కు ముంబయి ఉగ్రదాడిలో కీలక వ్యక్తి తహవూర్ రాణా.. అప్పట్లో టార్గెట్‌లో ఇవి కూడా

Best Web Hosting Provider In India 2024


భారత్‌కు ముంబయి ఉగ్రదాడిలో కీలక వ్యక్తి తహవూర్ రాణా.. అప్పట్లో టార్గెట్‌లో ఇవి కూడా

Anand Sai HT Telugu Published Apr 10, 2025 08:34 AM IST
Anand Sai HT Telugu
Published Apr 10, 2025 08:34 AM IST

Tahawwur Hussain Rana : ముంబయి చరిత్రలో 26/11 ఉగ్రదాడి గురించి ఆలోచిస్తే ఇప్పటికీ భయపడుతుంటారు. ఉగ్రవాదులు సృష్టించిన ఈ బీభత్సంలో చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడిలో కీలక పాత్ర పోషించిన తహవూర్ హుస్సేన్ రాణాను భారత్ తీసుకొస్తున్నారు.

తహవూర్ హుస్సేన్ రాణా
తహవూర్ హుస్సేన్ రాణా

ముంబయి 26/11 ఉగ్రదాడిలో కీలక వ్యక్తి తహవూర్ హుస్సేన్ రాణా. అతడికి అమెరికాలో చర్టపరంగా అన్ని దారులు మూసుకుపోయాయి. ఇప్పుడు అమెరికా అధికారులు భారత్‌కు అప్పగించారు. ప్రత్యేక విమానంలో అతడిని భారత్‌కు తీసుకొస్తున్నట్టుగా తెలుస్తోంది. గురువారం మధ్యాహ్నం విమానం దిల్లీకి చేరుకోగానే.. అతడిని ఎన్ఐఏ, RAW సంయుక్త బృందం అదుపులోకి తీసుకునే అవకాశం ఉంది.

తీహార్ జైలుకు!

మెుదట దిల్లీలో కోర్టులో హాజరుపరుస్తారని తెలుస్తోంది. తర్వాత తీహార్ జైలులోని హై సెక్యూరిటీ వార్డులో ఉంచే ఛాన్స్ ఉంది. నేరపూరిత కుట్ర, భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం, హత్య, ఫోర్జరీతోపాటుగా మరికొన్ని అభియోగాలు తహవూర్ రాణాపై నమోదు అయ్యాయి.

టార్గెట్‌లో ఇవి కూడా

ఇదిలా ఉండగా ఒక డాక్యుమెంట్ బయటకు వచ్చింది. అందులో తహవూర్ రాణా తప్పులు బహిర్గతమయ్యాయి. దాడికి ముందు భారత్‌లో పర్యటించిన సమయంలో పాక్-అమెరికన్ ఉగ్రవాది డేవిడ్ కోల్ మన్ హెడ్లీతో రాణా సన్నిహితంగా మెలిగినట్లు సమాచారం. ఇవేకాకుండా ఇండియా గేట్ సహా పలు ముఖ్యమైన ప్రదేశాలు అతడి టార్గెట్‌లో ఉన్నాయి.

రాణా, హెడ్లీ ప్లాన్

రాణా, హెడ్లీతో సహా కొందరు ఉగ్రవాదులు మరిన్ని ప్రాంతాలను లక్ష్యంగా చేసుకోవడానికి కుట్ర పన్నినట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా పేర్కొంది. వీటిలో నేషనల్ డిఫెన్స్ కాలేజ్, ఢిల్లీలోని ఇండియా గేట్, అనేక ఇతర ప్రాంతాలు ఉన్నాయి. రాణా, హెడ్లీలతో పాటు హఫీజ్ సయీద్, జకీవుర్ రెహ్మాన్ లఖ్వీ, ఇలియాస్ కశ్మీరీ, సాజిద్ మీర్, మేజర్ ఇక్బాల్ తదితరులు ఈ దాడికి కుట్ర పన్నినట్లు ఎన్ఐఏ (జాతీయ దర్యాప్తు సంస్థ) చార్జిషీట్‌లో పేర్కొంది.

రాణా మిషన్

26 /11 దాడికి ముందు హెడ్లీతో రానా 231 సార్లు మాట్లాడినట్లు నివేదిక పేర్కొంది. దాడికి ముందు చివరిసారిగా భారత్ లో పర్యటించినప్పుడు అత్యధికంగా 66 చర్చలు జరిగాయి. హెడ్లీని భారత్ కు తీసుకురావడానికి రాణా కంపెనీ ఫస్ట్ వరల్డ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్‌ను ఉపయోగించుకున్నట్లు భారత్, అమెరికా దర్యాప్తులో వెల్లడైంది. అమెరికాలో జరిగిన ఈ భేటీలో హెడ్లీ, రాణా భవిష్యత్తుపై చర్చించినట్లు సమాచారం. భారత్‌లో ఉన్నప్పుడు రాణా మొత్తం 8 గూఢచర్య మిషన్లు నిర్వహించాడు.

అమెరికా నుంచి భారత్‌కు తీసుకువచ్చిన తర్వాత రాణాను తీహార్ జైలులోని హై సెక్యూరిటీ వార్డులో ఉంచే అవకాశం ఉంది. ఈ విషయాన్ని జైలు వర్గాలు బుధవారం పీటీఐకి తెలిపాయి. రాణాను జైల్లో ఉంచేందుకు అవసరమైన ఏర్పాట్లు చేశామని, కోర్టు ఆదేశాల కోసం జైలు అధికారులు వేచి చూస్తున్నారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.

Anand Sai

eMail

సంబంధిత కథనం

జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.

Best Web Hosting Provider In India 2024


Source link