




Best Web Hosting Provider In India 2024

TDP Vs Ysrcp: మాజీ సీఎం సతీమణిపై అసభ్య వ్యాఖ్యలు.. ఐటీడీపీ కార్యకర్తపై కేసు నమోదు, నిందితుడి చేబ్రోలు కిరణ్ అరెస్ట్
TDP Vs Ysrcp: మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి సతీమణిపై అసభ్య వ్యాఖ్యలు చేసిన ఐటీడీపీ కార్యకర్త చేబ్రోలు కిరణ్‌పై ఏపీ పోలీసులు కేసు నమోదు చేశారు. యూ ట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వైఎస్ జగన్ సతీమణిపై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేయడంపై టీడీపీ అధిష్టానం ఆగ్రహం వ్యక్తం చేసింది.

TDP Vs Ysrcp: వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి సతీమణిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఐటీడీపీ కార్యకర్త చేబ్రోలు కిరణ్ కుమార్‌పై ఏపీ పోలీసులు కేసు నమోదు చేశారు. రాప్తాడులో జగన్మోహన్ రెడ్డి పోలీసులను హెచ్చరిస్తూ చేసిన వ్యాఖ్యలపై ఓ యూ ట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో టీడీపీ కార్యకర్త అసభ్యకరంగా వ్యాఖ్యలు చేశాడు. జగన్ సతీమణిపై అనుచిత వ్యాఖ్యలు చేవాడు. దీనిపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం అయ్యాయి.
మహిళల్ని కించపరిచేలా కామెంట్లు చేసిన ఐటీడీపీ కార్యకర్తపై చర్యలు తీసుకోవాలని వైసీపీ కార్యకర్తలు డిమాండ్ చేశారు. దీనిపై స్పందించిన టీడీపీ అధిష్టానం అతడిని పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. చేబ్రోలు కిరణ్‌కుమార్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని టీడీపీ నాయకత్వం ఆదేశించడంతో అతడిని అదుపులోకి తీసుకుని నల్లపాడు పోలీస్ స్టేషన్‌కు తరలించారు. నిందితుడిని విచారించిన తర్వాత కోర్టులో హాజరు పరచనున్నారు.
సామాజిక మాధ్యమాల్లో మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసే వారిని ఊపేక్షించేది లేదని ఇప్పటికే టీడీపీ అధిష్టానం ప్రకటించింది. కూటమి పార్టీలకు చెందిన కార్యకర్తలు ఎవరు రాజకీయ ప్రత్యర్థుల ఇళ్లలోని మహిళల జోలికి వెళ్లొద్దని ప్రకటించారు. అలాంటి వారిపై చర్యలు తప్పవని ముఖ్యమంత్రి చంద్రబాబు గతంలో ప్రకటించారు. కొందరు నేతలు అత్యుత్సాహంతో శృతి మించి అసభ్యకరమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. మాజీ ముఖ్యమంత్రి సతీమణిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన యూట్యూబ్ ఛానల్ వైసీపీ సానుభూతిపరులకు చెందినదిగా ప్రచారం జరుగుతోంది.
సంబంధిత కథనం
టాపిక్