Agniveer Recruitment 2025 Last Date : ఇండియన్ ఆర్మీ అగ్నివీర్ నియామకానికి దరఖాస్తు తేదీ పొడిగింపు.. కొత్త తేదీ ఇదే

Best Web Hosting Provider In India 2024


Agniveer Recruitment 2025 Last Date : ఇండియన్ ఆర్మీ అగ్నివీర్ నియామకానికి దరఖాస్తు తేదీ పొడిగింపు.. కొత్త తేదీ ఇదే

Anand Sai HT Telugu Published Apr 10, 2025 10:04 AM IST
Anand Sai HT Telugu
Published Apr 10, 2025 10:04 AM IST

Agniveer Recruitment 2025 Last Date : ఇండియన్ ఆర్మీ అగ్నివీర్ ర్యాలీకి దరఖాస్తు చేసుకోవడానికి మరో అవకాశం అందుబాటులో ఉంది. అగ్నివీర్ ర్యాలీ 2025 కోసం నమోదు చేసుకోవడానికి చివరి తేదీని పొడిగించారు.

అగ్నివీర్‌ల రిక్రూట్‌మెంట్ ర్యాలీ
అగ్నివీర్‌ల రిక్రూట్‌మెంట్ ర్యాలీ

దేశానికి సేవ చేయాలని కలలు కంటున్న యువతకు ఒక గుడ్‌న్యూస్ ఉంది. ఇండియన్ ఆర్మీ అగ్నివీర్ రిక్రూట్‌మెంట్ 2025 కోసం దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీని పొడిగించారు. గతంలో ఏదో కారణం చేత దరఖాస్తు చేసుకోలేకపోయిన అభ్యర్థులకు ఇప్పుడు మరో అవకాశం లభించింది. ఇండియన్ ఆర్మీ అగ్నివీర్ రిక్రూట్‌మెంట్ 2025 కోసం దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీని ఇప్పుడు పొడిగించారు. ఆసక్తిగల అభ్యర్థులు ఏప్రిల్ 25 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

కొత్త తేదీ ప్రకారం ఆసక్తిగల అభ్యర్థులు 25 ఏప్రిల్ 2025 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అధికారిక వెబ్‌సైట్ joinindianarmy.nic.in ని సందర్శించడం ద్వారా దరఖాస్తును ఆన్‌లైన్‌లో పూరించవచ్చు . ఈ నియామకానికి గతంలో చివరి తేదీని ఏప్రిల్ 10, 2025గా నిర్ణయించారు. కానీ సౌలభ్యాన్ని దృష్టిలో ఉంచుకుని దానిని మరికొన్ని రోజులు పొడిగించారు.

ఆసక్తి గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకునే ముందు అధికారిక నోటిఫికేషన్‌ను పూర్తిగా చదవాలి. దరఖాస్తులో ఏదైనా తప్పు కనిపిస్తే, ఫారమ్‌ను రద్దు చేయవచ్చు. సమాచారాన్ని జాగ్రత్తగా నింపాలి.

అర్హతలు

అగ్నివీర్ జనరల్ డ్యూటీ కోసం : అభ్యర్థి ప్రతి సబ్జెక్టులో కనీసం 45 శాతం మార్కులు, కనీసం 33 శాతం మార్కులతో 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. లైట్ మోటార్ వెహికల్ (LMV) కోసం చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుంది.

అగ్నివీర్ టెక్నికల్ కోసం : అభ్యర్థి 12వ సైన్స్ బ్యాక్‌గ్రౌండ్‌లో ఉత్తీర్ణులై ఉండాలి.

అగ్నివీర్ ట్రేడ్స్‌మెన్ కోసం : ప్రతి సబ్జెక్టులో కనీసం 33 శాతం మార్కులతో 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.

వయోపరిమితి

ఈ నియామకానికి అభ్యర్థి వయస్సు 17.5 సంవత్సరాల నుండి 21 సంవత్సరాల మధ్య ఉండాలి. మరిన్ని వివరాలకు అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ వెళ్లండి

పరీక్ష ఎప్పుడు జరుగుతుంది?

అగ్నివీర్ రిక్రూట్‌మెంట్ కింద రాత పరీక్ష జూన్ 2025లో నిర్వహించే అవకాశం ఉంది. అయితే కచ్చితమైన తేదీ, షెడ్యూల్‌ను అధికారిక వెబ్‌సైట్‌లో త్వరలో ప్రకటిస్తారు.

రిక్రూట్‌మెంట్‌లో మార్పులు

ఈసారి అగ్నివీర్ నియామకంలో అనేక మార్పులు చేశారు. అగ్నివీర్ రాత పరీక్ష 13 భాషల్లో ఉంటుంది. ఇందులో హిందీ నుండి ఇంగ్లీష్, మలయాళం, కన్నడ, తమిళం, తెలుగు, పంజాబీ, ఒరియా, బెంగాలీ, ఉర్దూ, గుజరాతీ, మరాఠీ, అస్సామీ భాషలు ఉన్నాయి. అభ్యర్థులు ఒకేసారి రెండు పోస్టులకు దరఖాస్తు చేసుకోగలరు. ఈ ఎంపికను సీఈఈ ఫారమ్‌లోనే నింపాలి. దీనితో పాటు ర్యాలీలో అభ్యర్థుల కళ్ళు, వేళ్ల ధృవీకరణ కూడా అవసరం.

Anand Sai

eMail

సంబంధిత కథనం


Best Web Hosting Provider In India 2024


Source link