Jangaon Accident : జనగామ జిల్లాలో ప్రాణం తీసిన మట్టి దందా, తలపై ట్రాక్టర్ బోల్తా పడి యువకుడు దుర్మరణం

Best Web Hosting Provider In India 2024

Jangaon Accident : జనగామ జిల్లాలో ప్రాణం తీసిన మట్టి దందా, తలపై ట్రాక్టర్ బోల్తా పడి యువకుడు దుర్మరణం

HT Telugu Desk HT Telugu Published Apr 12, 2025 08:26 PM IST
  • Share on Whatsappమమ్మల్ని ఫాలో అవ్వండి
  • Share on Facebook
HT Telugu Desk HT Telugu
Published Apr 12, 2025 08:26 PM IST

Jangaon Accident : జనగామ జిల్లాలో అక్రమ మట్టి దందా నిండు ప్రాణాన్ని తీసింది. రేగటి మట్టి లోడ్ తో వచ్చిన ట్రాక్టర్ అక్కడున్న యువకుడిపై బోల్తా పడింది. ఈ ప్రమాదంలో యువకుడు అక్కడికక్కడే దుర్మరణం చెందాడు.

 జనగామ జిల్లాలో ప్రాణం తీసిన మట్టి దందా, తలపై ట్రాక్టర్ బోల్తా పడి యువకుడు దుర్మరణం
జనగామ జిల్లాలో ప్రాణం తీసిన మట్టి దందా, తలపై ట్రాక్టర్ బోల్తా పడి యువకుడు దుర్మరణం
మమ్మల్ని ఫాలో అవ్వండిShare on Whatsapp
  • Share on Facebook

Jangaon Accident : జనగామ జిల్లాలో అక్రమ మట్టి దందా ఓ యువకుడి ప్రాణం తీసింది. ఇటుక బట్టీ పనుల కోసం రేగడి మట్టి లోడ్ తో వచ్చిన ట్రాక్టర్ అక్కడున్న యువకుడి తలపై బోల్తా పడటంతో అతడు అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. దీంతో గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. స్థానికులు తెలిపిన ప్రకారం పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

జనగామ జిల్లా కొడకండ్ల మండలంలోని మొండ్రాయి గ్రామ శివారులోని గిర్ని తండా సమీపంలోని పెట్రోల్ బంక్ వద్ద ఇటుక బట్టీ పనులు నడుస్తున్నాయి. ఇటుకల తయారీ కోసం బోడోనికుంట నుంచి గిర్నితండాకు ట్రాక్టర్ తో రేగడి మట్టి చేరవేస్తుండగా… మొండ్రాయి గ్రామానికి చెందిన విఘ్నేష్(18) అనే యువకుడు లోడింగ్ లిస్ట్ రాస్తున్నాడు. ఒక్కో ట్రాక్టర్, ఎన్ని ట్రిప్పులు వస్తోందో లెక్కలు వేస్తున్నాడు. ఈ క్రమంలో శనివారం ఉదయం ఓ ట్రాక్టర్ మట్టిని అన్ లోడ్ చేసేందుకు ఇటుక బట్టీ ప్రదేశానికి రాగా విఘ్నేష్ దాని వద్దకు వెళ్లాడు. వివరాలు రాసుకుంటున్న క్రమంలో ట్రాక్టర్ డ్రైవర్ మట్టిని లోడ్ చేసేందుకు డబ్బా జాకీ లేపాడు. డబ్బా పైకి లేచిన అనంతరం ఒకవైపు ఒరగగా, అక్కడే ఉన్న విఘ్నేష్ తలపై పడింది.

దీంతో విఘ్నేష్ అక్కడే కుప్పకూలగా, అతని తలపై ట్రాక్టర్ డబ్బా పడటంతో తల మొత్తం నుజ్జునుజ్జయ్యింది. ఘటనా స్థలంలోనే విఘ్నేష్ ప్రాణాలు కోల్పోగా.. విషయం తెలుసుకున్న మొండ్రాయి గ్రామస్థులు అక్కడికి చేరుకున్నారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించడంతో వారు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించే పనిలో పడ్డారు.

అక్రమంగా మట్టి తవ్వకాలు

గిర్నితండాలో ఏర్పాటు చేస్తున్న ఇటుక బట్టీకి స్థానిక బోడోని కుంట నుంచి మట్టిని అక్రమంగా తరలిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఎలాంటి పర్మిషన్ లేకుండా నిర్వాహకులు మట్టి దందా సాగిస్తున్నట్లు స్థానికులు పేర్కొంటున్నారు. గతంలో కూడా ఇక్కడి మట్టి దందా జరుగుతోందని తెలిసినా.. అధికారులు పట్టించుకోకుండా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తున్నారు. అక్రమంగా సాగుతున్న ఈ దందాపై విచారణ జరిపించి, తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

నెల కిందట ధర్మసాగర్ లో

దాదాపు నెల రోజుల కిందట ధర్మసాగర్ మండలంలో కూడా అక్రమ మట్టి దందా స్తానిక యువకుడిని బలిగొంది. ధర్మసాగర్ మండల పరిధిలోని ఎల్కుర్తి సమీపంలో ఓ ప్రైవేటు వెంచర్ ఏర్పాటు అవుతుండగా.. దానికి ధర్మసాగర్ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి మట్టిని తరలిస్తున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా ఇష్టారీతిన తవ్వడం, రాత్రికి రాత్రి టిప్పర్ లారీలతో వెంచర్ కు తరలించే పనులు చేస్తున్నారు. ఈ క్రమంలో మార్చి 8వ తేదీ రాత్రి అక్రమంగా మట్టి తరలించే పనులు నడిపించడం మొదలు పెట్టారు. మడికొండ గ్రామానికి చెందిన అనిల్(32) అనే డ్రైవర్ టిప్పర్ నడుపుతూ మట్టి చేర వేస్తున్నాడు. ఈ క్రమంలో తెల్లవారుజామున లోడ్ మట్టిని వెంచర్ వద్ద అన్ లోడ్ చేసి, తిరిగి వెళ్తున్న క్రమంలో వెంచర్ వద్ద ఏర్పాటు చేసిన ఆర్చీ ఒక్కసారిగా టిప్పర్ పై కూలింది.

క్యాబిన్ పైనే ఆర్చీ కూలి పడటంతో అనిల్ అందులోనే ఇరుక్కుపోయి తీవ్రంగా గాయపడ్డారు. తీవ్ర రక్త స్రావం జరిగి టిప్పర్ క్యాబిన్ లోనే ప్రాణాలు కోల్పోయాడు. కాగా ఇక్కడ మట్టి దందాకు కూడా స్థానిక అధికారులు వంత పాడుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కాగా అక్రమ మట్టి దందా ప్రాణాలు తీస్తుండగా, ఇకనైనా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి.

(రిపోర్టింగ్: హిందుస్తాన్ టైమ్స్ తెలుగు, ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి)

HT Telugu Desk

సంబంధిత కథనం

టాపిక్

Telangana NewsTrending TelanganaTelugu NewsRoad Accident
మరిన్ని తెలంగాణ తాజా వార్తలు, క్రైమ్ వార్తలు, ట్రెండింగ్ వార్తలు, హైదరాబాద్ వార్తలు, పొలిటికల్ వార్తలు చూడండి.
Source / Credits

Best Web Hosting Provider In India 2024