Girlfriend in suitcase: గర్ల్ ఫ్రెండ్ ను సూట్ కేసులో కుక్కి, తన హాస్టల్ కు తీసుకెళ్తూ దొరికిపోయిన విద్యార్థి

Best Web Hosting Provider In India 2024


Girlfriend in suitcase: గర్ల్ ఫ్రెండ్ ను సూట్ కేసులో కుక్కి, తన హాస్టల్ కు తీసుకెళ్తూ దొరికిపోయిన విద్యార్థి

Sudarshan V HT Telugu
Published Apr 12, 2025 02:29 PM IST

Girlfriend in suitcase: గర్ల్ ఫ్రెండ్ ను తన హాస్టల్ రూమ్ కు తీసుకెళ్లడం కోసం ఒక విద్యార్థి వింత సాహసం చేశాడు. ఆ యువతిని ఒక పెద్ద సూట్ కేసులో కుక్కి, తన రూమ్ కు తీసుకు వెళ్లే ప్రయత్నం చేశాడు. కానీ, హాస్టల్ సెక్యూరిటీకి దొరికిపోయాడు. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

 ‘‘గర్ల్ ఫ్రెండ్ ను సూట్ కేసులో కుక్కి.. తన హాస్టల్ కు తీసుకెళ్తూ’’
‘‘గర్ల్ ఫ్రెండ్ ను సూట్ కేసులో కుక్కి.. తన హాస్టల్ కు తీసుకెళ్తూ’’

Girlfriend in suitcase: సోనిపట్ లోని ఓపీ జిందాల్ గ్లోబల్ యూనివర్శిటీకి చెందిన ఓ విద్యార్థి తన గర్ల్ ఫ్రెండ్ ను పెద్ద సూట్ కేస్ లో దాచి బాలుర హాస్టల్ లోకి అక్రమంగా తీసుకువెళ్లేందుకు యత్నించిన ఘటన సంచలనంగా మారింది. హాస్టల్ లో తోటి విద్యార్థి రికార్డు చేసిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఆన్ లైన్ లో వైరల్ గా మారింది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు కామెంట్లు, ఎమోజీలతో పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు. దాంతో పాటు హాస్టల్ ఆంక్షలు, విద్యార్థుల చేష్టలపై చర్చ ప్రారంభమైంది.

అసలేం జరిగింది..

నిపట్ లోని ఓపీ జిందాల్ గ్లోబల్ యూనివర్శిటీకి చెందిన ఓ విద్యార్థి తన గర్ల్ ఫ్రెండ్ ను తన హాస్టల్ రూమ్ కు తీసుకువెళ్లాలనుకున్నాడు. అందుకు నిబంధనలు అంగీకరించవు కనుక, రహస్యంగా ఆమెను తన రూమ్ కు తీసుకెళ్లాలనుకున్నాడు. ఒక పెద్ద సూట్ కేసులో ఆ యువతిని కుక్కి, జిప్ వేసి హాస్టల్ వరకు సక్సెస్ ఫుల్ గానే తీసుకువెళ్లగలిగాడు. కానీ, హాస్టల్ లోకి ప్రవేశిస్తున్న సమయంలో ఆ పెద్ద సూట్ కేసును చూసిన సెక్యూరిటీ సిబ్బందికి అనుమానం వచ్చింది. ఆ సూట్ కేసును ఓపెన్ చేసి, చూసి షాక్ అయ్యారు. అనంతరం హాస్టల్ అధికారులకు సమాచారమిచ్చారు. అయితే, హాస్టల్ లోపలికి తీసుకువస్తుండగా, సూట్ కేసు లోపల నుంచి శబ్దాలు రావడంతో సెక్యూరిటీకి అనుమానం వచ్చిందని అక్కడి విద్యార్థులు తెలిపారు. వీల్స్ ఉన్న ఆ సూట్ కేసును స్టెప్స్ పై నుంచి తీసుకు వస్తున్న సమయంలో లోపల ఉన్న యువతికి ఇబ్బంది కలిగి అరిచి ఉండొచ్చని చెప్పారు.

వీడియో వైరల్

అయితే, ఈ ఘటనను హాస్టల్ లోని మరో విద్యార్థి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అది ఎక్స్, ఇన్ స్టాగ్రామ్ సహా పలు సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ల్లో వైరల్ గా మారింది. ఆ యువతి ఓపీ జిందాల్ లో విద్యార్థినినా లేక బయటి వ్యక్తా? అనేది ఇంకా తెలియరాలేదు. అయితే ఈ విషయంపై యూనివర్సిటీ ఇప్పటి వరకు అధికారిక ప్రకటన చేయలేదు. అయితే, వీడియో ఈ క్లిప్ ఇన్స్టాగ్రామ్, ఎక్స్ వంటి ప్లాట్ఫామ్ లలో వ్యాపించడంతో, నెటిజన్లు ఇందులోని సృజనాత్మకతపై వ్యంగ్య ప్రశంసలు, కామెంట్లతో ప్రతిస్పందించారు. కాలేజ్ లో ప్రేమ అంటే ఇలానే ఉంటుందని ఒక యూజర్ వ్యాఖ్యానించారు. కొంతమంది వినియోగదారులు ఈ క్షణాన్ని “పీక్ హాస్టల్ బిహేవియర్” గా అభివర్ణించగా, మరికొందరు “జిందాల్ నిజంగా దాని పేరులోని ‘ఓపి’కి అనుగుణంగా జీవిస్తోంది” అని వ్యాఖ్యానించారు.

Sudarshan V

eMail
వీ సుదర్శన్ గత 3 సంవత్సరాల నుండి హిందూస్తాన్ టైమ్స్ డిజిటల్ మీడియాతో అనుబంధం కలిగి ఉన్నారు. గతంలో, ఆయన ఈనాడు, సాక్షి వంటి ప్రముఖ తెలుగు దినపత్రికలతో వివిధ సంపాదకీయ పదవులలో పనిచేశారు. తనకు జాతీయంగా, అంతర్జాతీయంగా చోటు చేసుకునే వివిధ రాజకీయ, ఆర్థిక, సామాజిక, ఆటోమోటివ్, సాంకేతిక పరిణామాలపై ఆసక్తి ఉంది.

సంబంధిత కథనం

జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.

Best Web Hosting Provider In India 2024


Source link