





Best Web Hosting Provider In India 2024

వేసవిలో జీన్స్ వేసుకోవడం ఎంత ప్రమాదమో తెలిస్తే షాక్ అవుతారు!
డెనిమ్ ఆన్ డెనిమ్ ఫ్యాషన్ ప్రస్తుతం బాగా ట్రెండ్ అవుతుంది. అందంగా కనిపించడం కోసం మీరు రోజూ ధరించే ఈ జీన్స్ వేసవిలో మీ చర్మానికి హానికరమని మీకు తెలుసా? సమ్మర్లో రోజూ జీన్స్ వేసుకోవడం వల్ల వచ్చే సమస్యలేంటో తెలుసుకోండి.

బట్టలు ధరించే సమయంలో చాలా ఈజీగా కనిపించే ఆప్షన్ జీన్స్. అది టాప్ అయినా, ప్యాంట్‌గా అయినా ధరించడానికి చాలా ఈజీగా ఉంటుంది. అంతేకాకుండా మ్యాచింగ్‌కు కూడా పెద్దగా ఇబ్బందిపడాల్సిన అవసరం లేదు. కాకపోతే వేసవికాలం కాస్త కంఫర్ట్ తక్కువగా ఉండొచ్చు. వాస్తవానికి కంఫర్ట్‌యే కాదు, జీన్స్ ధరించడం ఆరోగ్యానికి హానికరం కూడా. ఈ విషయాలు తెలుసుకోకుండా స్టైలిష్‌గా, ఫ్యాషనబుల్‌గా ఉంటుందని జీన్స్ వాడుతున్న వాళ్లకు కొన్ని ప్రమాదాలు పొంచి ఉన్నాయట. అవేంటో తెలుసుకుందామా..
ప్రైవేట్ పార్ట్‌కు నష్టం
జీన్స్ వేసుకోవడం వల్ల చర్మం లోపలికి గాలి ప్రసారం ఇబ్బందిగా మారుతుంది. ఫలితంగా ప్రైవేట్ పార్ట్స్ ప్రాంతంలో వేడిగా అనిపించి ఉక్కబోతకు గురవుతారు. దీంతో చెమటపట్టి దురద కలుగుతుంది. వేసవికాలం ఈ ఇబ్బంది ఎక్కువగా ఉండొచ్చు. మగవారిలో ఈ పరిస్థితి స్పెర్మ్ తక్కువ కావడానికి కూడా దారి తీయొచ్చు. అంతేకాకుండా యోని భాగంలో pH స్థాయిలపై కూడా ప్రభావం చూపిస్తుంది.
యోని ఇన్ఫెక్షన్ ముప్పు
మహిళలు టైట్ జీన్స్ ధరించడం వల్ల యోని ఇన్ఫెక్షన్ ముప్పు పెరిగిపోతుంది. పైగా వేసవి కాలం టైట్ జీన్స్ ధరించడం వల్ల యోని ప్రాంతంలో గాలి ప్రసరణ సరిగా ఉండదు. తేమ చేరుకుని ఇరిటేషన్ కలుగజేస్తుంది. దీని వల్ల బ్యాక్టీరియా పెరగడంతో పాటు శిలీంధ్రాలు ఏర్పడటానికి దారి తీస్తుంది. దీని వల్ల దురద సమస్య కలిగి అందరిలో ఇబ్బందికరంగా మారుతుంది.
శిలీంధ్ర ఇన్ఫెక్షన్ సమస్య
జీన్స్ వల్ల చర్మంపై గాలి ప్రసరణ సరిగా ఉండదు. ఈ కారణంగా చర్మంపై, జాయింట్ ప్రదేశాల్లో చెమట ఎక్కువగా పట్టి బ్యాక్టీరియా, శిలీంధ్రాలు ఏర్పడటానికి దారి తీస్తుంది. ఇవి పుండ్లు, దద్దుర్లు వంటి సమస్యలను కలిగిస్తాయి.
జీన్స్‌లో పరిశుభ్రత లోపం
చాలా మందికి జీన్స్‌ను సరిగా ఉతకడం రాకపోవచ్చు. లేదా జీన్స్ త్వరగా మురికిగా కనిపించడం వల్ల ఎక్కువసార్లు ధరిస్తూ ఉంటారు. ఇది చర్మానికి ప్రమాదకరమైన విషయం. ఎందుకంటే, దీని వల్ల జీన్స్‌లో పరిశుభ్రతా లోపం ఇబ్బంది తెచ్చి పెడుతుంది. జీన్స్ ధరించడం వల్ల కలిగిన చెమట బ్యాక్టీరియా, శిలీంధ్రాలు పెరిగేందుకు దారి తీస్తుంది. వీటిని మళ్ళీ మళ్లీ ధరించడం వల్ల చర్మానికి హాని కలిగించే కారకాలు పెరిగిపోతాయి.
అనేక గంటల పాటు టైట్ జీన్స్ ధరిస్తున్నారా..
వేసవి కాలం టైట్ జీన్స్ ధరించడం మానుకోవడమే మంచిది. చాలా మంది చర్మాన్ని అర్థం చేసుకోకుండా స్టైల్ లేదా ఫ్యాషన్ గా ఉండటం కోసం జీన్స్ వేసుకుంటూ ఉంటారు. ఒకవేళ అలా జీన్స్ ధరించాల్సి వస్తే, గంటల పాటు జీన్స్ ధరించకూడదు. చర్మాన్ని నిర్లక్ష్యపెట్టి టైట్ జీన్స్ ను గంటల తరబడి ధరించడం వల్ల తొడలు, ప్రైవేట్ పార్ట్‌లో ఇన్ఫెక్షన్ ముప్పు ఎక్కువగా ఉంటుంది.
జీన్స్ ధరించడం వల్ల అలసట:
లాంగ్ డ్రైవ్స్ కి వెళ్లేటప్పుడు టైట్ గా ఉండే జీన్స్ వేసుకోవడం వల్ల కాళ్లు అలసిపోయినట్టుగా అనిపిస్తుంది. అలర్జీలు, దురదలతో పాటు కాళ్లు చెమటతో తడిచిపోయి ఇబ్బందికరంగా అనిపిస్తుంది. జీన్స్ వస్త్రానికి ఉండే గుణం కారణంగా చెమటతో తడిచినా, మరేదైనా నీరు పడి క్లాత్ తడిచిపోయినా ఇన్ఫెక్షన్ పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
సంబంధిత కథనం