గిల్టు నగలు ఎక్కువ కాలం కోత్తవిగా ఉండాలంటే ఈ 8 టిప్స్ పాటించండి!

Best Web Hosting Provider In India 2024

గిల్టు నగలు ఎక్కువ కాలం కోత్తవిగా ఉండాలంటే ఈ 8 టిప్స్ పాటించండి!

Ramya Sri Marka HT Telugu
Published Apr 13, 2025 07:00 PM IST

సాంప్రదాయ శైలి కావొచ్చు, ఆధునిక డిజైన్ కావొచ్చు ఒక్కసారిగా గ్లామర్‌ను డబుల్ చేసే శక్తి గిల్టు నగలకు ఉంటుంది. భద్రతా భయం లేకుండా చీర, గౌను, ట్రెండీ డ్రెస్ ఇలా అన్నింటి మీద వీటిని వేసుకోవచ్చు. ఇప్పుడు ప్రతి యువతి వార్డ్రోబ్‌లో తప్పనిసరిగా ఉండే ఈ నగలు ఎక్కువ కాలం కొత్తవిగా ఉండాలంటే ఈ టిప్స్ పాటించండి.

వన్ గ్రామ్ గోల్డ్ లేదా నకీలీ ఆభరణాల మన్నిక తగ్గకుండా కాపాడుకోెవడం ఎలా
వన్ గ్రామ్ గోల్డ్ లేదా నకీలీ ఆభరణాల మన్నిక తగ్గకుండా కాపాడుకోెవడం ఎలా (shutterstock)

ఆభరణాలు అంటే మహిళలకు ప్రత్యేకమైన మమకారం. అయితే రోజురోజుకూ పెరిగిపోతున్న బంగారం ధరలతో పాటు భద్రతా భయాలు కూడా ఎక్కువగానే ఉన్నాయి. ఇలాంటి సమయంలో గిల్టు నగలు మంచి ప్రత్యామ్నాయంగా నిలుస్తున్నాయి. ఇవి బంగారానికి చాలా దగ్గరగా కనిపించేలా ఉండి, తక్కువ ఖర్చులో ఎక్కువ డిజైన్లలో అందుబాటులో ఉంటున్నాయి. అంతేకాదు ఫ్యాషన్ రోజురోజుకూ మారిపోతుండతో ప్రతి మహిళ కూడా ట్రెండ్‌కు తగ్గట్టుగా తనను ఆమెగా మలుచుకోవాలనుకుంటోంది. ఇవి ప్రతి వయసు మహిళకు, ప్రతీ స్టైల్‌కి అద్దం పడుతున్నాయి.అందుకే వీటికి ఆడవాళ్లంతా ఫిదా అయిపోతున్నారు.

గతంలో ఇవి కేవలం చిరుద్యోగులు అంటే బంగారం కొనలేని వారికి మాత్రమే పరిమితంగా ఉండేవి. కానీ ఇప్పుడు ఫ్యాషన్ రంగం మారిపోవడంతో, సెలబ్రిటీల దగ్గర నుంచి సామాన్యురాలివరకు గిల్టు నగలే ధరిస్తున్నారు. ఇవి అందాన్ని పెంచడమే కాకుండా, కాలానికి తగ్గ ట్రెండ్‌ను కూడా ప్రదర్శించగలుగుతాయి. అందుకే వీటి వాడకం విపరీంతగా పెరిగింది.

గిల్టు నగలతో కలిగే మరిన్ని లాభాలు?

తక్కువ ధర – ఎక్కువ లుక్:

గోల్డ్ రేట్లు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. అందువల్ల ప్రతి ఒక్కరూ నిజమైన బంగారం కొనగలిగే స్థితిలో లేరు. అందుకే గిల్టు నగలకు ప్రాధాన్యత పెరుగుతుంది. ఇవి తక్కువ ఖర్చులో లభిస్తాయి.

ఫ్యాషన్ ఫ్రెండ్లీ డిజైన్లు:

ఇప్పుడు ట్రెండ్ ఫాలో కావాలంటే ఫ్యాషన్ మారుతూ ఉంటుంది. గిల్టు నగలు వేరువేరు డిజైన్లలో, స్టైలిష్‌గా, ట్రెడిషనల్‌గా వచ్చేవి కావడంతో ఫ్యాషన్-ఫ్రెండ్లీగా ఉన్నాయి.ప్రతి అవుట్‌ఫిట్‌కు, ప్రతి ఈవెంట్‌కి సరిపోయే విభిన్న డిజైన్లు ఇందులో ఉంటాయి.

సందర్భానికి తగిన డిజైన్లు:

పార్టీలు, పెళ్లిళ్లు, ఫంక్షన్లు, ఆఫీస్ వేర్ ఇలా ప్రతి సందర్భానికి తగిన డిజైన్లలో తక్కువ ఖర్చుతో మ్యాచ్ అయ్యే గిల్టు నగలు మార్కెట్లో పుష్కలంగా దొరుకుతాయి.

భద్రతా సమస్యలు ఉండవు:

బంగారం ధరించి బయటికి వెళ్లాలంటే దొంగల భయం. కానీ గిల్టు నగలు ధరించడం వల్ల అలాంటి భయం ఉండదు. వీటిని ట్రావెల్‌లో కూడా సేఫ్‌గా తీసుకెళ్లవచ్చు.

తేలికగా ఉంటాయి:

లైట్ వెయిట్ & కంఫర్టబుల్ గా ఉంటాయి. అసలైన బంగారం కంటే ఇవి చాలా తేలికగా ఉంటాయి. ఎక్కువసేపు వేసుకున్నా అసౌకర్యం అనిపించదు.

ట్రెండ్‌కు సరిపడేలా:

ట్రెండీగా ఉండాలనుకునే వారందరికీ ఇవి సరైన ఎంపిక. కొత్త కొత్త లుక్స్, కలర్ కాంబినేషన్స్ ట్రై చేయాలంటే గిల్టు నగలే బెస్ట్. భయపడకుండా ప్రతి స్టైల్‌ను టెస్ట్ చేయవచ్చు

ఫిల్మ్, ఫ్యాషన్ & ఫోటోషూట్లలో కూడా:

ఇప్పుడు సినీ పరిశ్రమ, మోడలింగ్, ఫోటోషూట్లు వంటి రంగాల్లో గిల్టు నగలు ఎక్కువగా వాడుతున్నారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ గ్లామర్ ఇచ్చే వీటి వల్లే.

గిల్టు నగలు ఎక్కువ రోజులు మెరవాలంటే చేయాల్సినవి

1. నీటికి దూరంగా ఉంచాలి :

గిల్టు నగలు నీటిలో తడిస్తే రంగు తొలగిపోతుంది. కాబట్టి స్నానం చేసేటప్పుడు, చేతులు కడుక్కునేటప్పుడు వీటిని ఉంచుకోకూడదు.

2. రసాయనాలకు దూరంగా ఉంచాలి:

చర్మంపై మేకప్, మాయిశ్చరైజర్, పర్ఫ్యూమ్‌లు, లోషన్లు, డియోడరెంట్లు వాడే ముందు గిల్టు నగలను తీసేయాలి. ఈ ఉత్పత్తుల్లో ఉండే కెమికల్స్ వల్ల ప్లేటింగ్ త్వరగా పోతుంది.వీటిని రాసుకుని పూర్తిగా డ్రై అయిన తర్వాతే తిరిగి నగలు ధరించాలి.

3. చెమట నుండి దూరంగా ఉంచాలి

ఎక్కువగా చెమట పట్టే సమయంలో ఈ నగలు వేసుకోవద్దు. చెమట కారణంగా కూడా నగర ప్లేటింగ్ మెల్లగా నశిస్తుంది.

4. దుస్తులు ధరించిన తర్వాతే నగలు వేసుకోవాలి

డ్రెస్ వేసే టైంలో నగాలు గీసుకుని విరిగిపోవచ్చు, బట్టలకు చిక్కకుని తెగిపోవచ్చు. కొన్నిసార్లు పూసలకు గీసుకుని రంగు కూడా పోవచ్చు. అందుకే బట్టలు వేసుకున్న తర్వాత చివర్లో నగలు ధరించాలి.

5. ఉపయోగించనప్పుడు సరిగ్గా నిల్వ ఉంచాలి

గిల్టు నగలను ఎప్పుడూ ఎయిర్‌టైట్ పౌచ్ లేదా వెళుతురు తగలని చోట బాక్స్‌లో దాచి ఉంచాలి. మినరల్ ఫ్రీ కాటన్ క్లాత్‌లో చుట్టి పెడితే మన్నిక పెరుగుతుంది.

6. తరచూ శుభ్రం చేయాలి

ఆయిల్, చెమట, ధూళి వంటివి అంటినప్పుడు ఈ నగలను మృదువైన ముస్లిన్ లేదా మైక్రోఫైబర్ క్లాత్‌తో నెమ్మదిగా తుడవాలి.లేదంటే ఇవి నల్లగా కనిపిస్తాయి.

7. ఓవర్‌లాపింగ్ వద్దు

వేర్వేరు గిల్టు జ్యూవెలరీలను ఒకదానిపై ఒకటి వేసి ఉంచితే అవి ఒకదానికి ఓకటి తగిలి స్క్రాచులు వస్తాయి. గీతలు పడి అసహ్యంగ కనిపిస్తాయి. వీలైనంత వరకూ వీటిని ఒక్కొక్కటిగా విడిగా ధరించాలి.

8. ఆభరణాలను సరిగ్గా నిల్వ చేయండి

నకలీ ఆభరణాలను ఎప్పుడైనా ఏదైనా గాలి చొరబడని పెట్టె లేదా సంచిలో ఉంచండి. అన్ని ఆభరణాలను వేరువేరుగా ఉంచండి. ఒకదానితో ఒకటి తగిలితే పాడైపోతాయి.

Ramya Sri Marka

eMail
మార్క రమ్యశ్రీ హిందుస్తాన్ టైమ్స్‌ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ లైఫ్‌స్టైల్, ఆస్ట్రాలజీ వార్తలు రాస్తున్నారు. గతంలో ఈనాడు, టీన్యూస్, ఈటీవీ భారత్ వంటి సంస్థల్లో కంటెంట్ రైటర్‌గా పనిచేశారు.జర్నలిజంలో ఎనిమిదేశ్లకు పైగా అనుభవం ఉంది. కాకతీయ యూనివర్సిటీలో మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం పీజీ చేశారు. 2024 నవంబరులో హెచ్.టి తెలుగులో చేరారు.

సంబంధిత కథనం

Source / Credits

Best Web Hosting Provider In India 2024