





Best Web Hosting Provider In India 2024

క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకుంటున్న వారిని ఎలా ఊరడించాలి? మనస్సుకు దగ్గరై ఎలా ఓదార్చాలి?
క్యాన్సర్ చికిత్స తీసుకుంటున్న వ్యక్తికి మీరు చెప్పే మాటలు, ప్రవర్తించే తీరు, ఎమోషనల్ సపోర్ట్ అవసరం ఉంటాయి. పనులు, అపాయింట్‌మెంట్‌లు, ఇంటి పనులలో నిర్దిష్ట సహాయం అందించండి. అదే సమయంలో వారి భావాలను వినడానికి, ట్రీట్మెంట్ గురించి తెలుసుకుంటూ ఉండండి.

క్యాన్సర్ ప్రాణాంతక వ్యాధే. కానీ, అన్ని సార్లు ఇప్పటికే చాలా మంది క్యాన్సర్‌తో పోరాడి విజయం సాధించారు. చాలా మందికి క్యూర్ అవుతుందని తెలిసినా, క్యాన్సర్ వచ్చిందని తెలియగానే డీలా పడిపోతుంటారు. అటువంటి సమయంలో వారికి స్వాంతన కావాలి. ఏ చిన్న ఓదార్పు దొరికినా కొండంత ఊరటగా అనిపిస్తుంది. మీ బంధువులు, స్నేహితులు, సన్నిహితులు ఎవరైనా క్యాన్సర్ బారిన పడితే జాలిపడుతూ కూర్చోకండి. మీ వంతు సాయంగా మనోధైర్యాన్నిచ్చే విధంగా ఇలా ప్రవర్తించండి.
క్యాన్సర్ చికిత్స తీసుకుంటున్న వారికి అండగా నిలవడం ఎలా?
1. అందుబాటులో ఉండటం కాదు, ఉనికిని తెలియజేయండి
అందుబాటులో ఉంటే సరిపోతుందని అనుకోవద్దు. ఎందుకంటే, అందుబాటులో ఉండటం కంటే పక్కనే ఉండి సాంత్వన ఇచ్చేలా ప్రవర్తించడం వేరేలా ఉంటుంది. వాళ్లతో కూర్చొనండి, మౌనంగా ఉన్నా పరవాలేదు. మీ శాంతంగా ఉన్నప్పటికీ ఒక తోడు ఉన్నారనే నమ్మకం వారిలో కలుగుతుంది.
2. అభిప్రాయం చెప్పకుండా వినడానికి ప్రయత్నించండి
వాళ్ల అభిప్రాయాలను మీతో పంచుకోనివ్వండి. మాట్లాడేందుకు ఎక్కువ అవకాశం ఇవ్వండి. వారి భావోద్వేగాలను అర్థం చేసుకునేందుకు ప్రయత్నించండి. “ఏం చెప్పాలో తెలియడం లేదు, కానీ నేను నీతో ఉంటాను” అనే మాట చాలాసార్లు గొప్ప మందులా పనిచేస్తుంది.
3. పోల్చడం మానుకోండి:
క్యాన్సర్‌తో ప్రతి ఒక్కరి అనుభవం ప్రత్యేకమైనది, కాబట్టి వారి పరిస్థితిని ఇతరులతో పోల్చకుండా ఉండండి.
4. ప్రత్యేకంగా కాదు, స్పష్టంగా సహాయం చేయండి
సాధారణంగా చెప్పే “ఏదైనా కావాలంటే చెప్పు” అనే మాటకంటే… “ఈ వారం నీకు భోజనం తేవొచ్చా?”, “ఆసుపత్రికి నేను డ్రైవ్ చేసి తీసుకెళ్తానూ” లాంటి స్పష్టమైన సహాయం ఎంతో ఊరటనిస్తుంది. ఉపయోగపడుతుంది.
5. భోజనం సిద్ధం చేయండి:
చికిత్స సమయంలో చాలా మందికి ఆకలి తగ్గుతుంది లేదా రుచిలో మార్పులు వస్తాయి, కాబట్టి వంట చేయడానికి లేదా భోజనం వండడానికి ముందుకొస్తే చాలా సహాయపడుతుంది.
6. వాళ్లను “వాళ్ల”లా ఫీలయ్యేలా చేయండి
వాళ్లకు ఇష్టమైన సినిమాలు చూసేలా, పాత జ్ఞాపకాల గురించి మాట్లాడేలా, సాధ్యమైనంత సాధారణ జీవితాన్ని అనుభవించేలా చేయండి. క్యాన్సర్‌కి వాళ్ల జీవితాన్ని పూర్తిగా ఆక్రమించనివ్వకండి.
7. వారి నిర్ణయాలను గౌరవించండి
ట్రీట్మెంట్‌పై, జీవనశైలిపై మాట్లాడాలా లేక మౌనంగా ఉండాలా అనే విషయాల్లో నిర్ణయం మీరు తీసుకోకూడదు. మీరు పక్కనే ఉన్నాం అన్న భరోసా కల్పించండి. దిశ నిర్దేశించాలనే ప్రయత్నం చేయకండి.
8. భాషతో జాగ్రత్తగా ఉండండి
“ధైర్యంగా ఉండు”, “పాజిటివ్‌గానే ఉండాలి” అనే మాటలు కొన్నిసార్లు ఒత్తిడిగా అనిపించవచ్చు. బదులుగా “ఇది ఎంత కష్టం అనిపిస్తుందో అర్థం అవుతుంది”, “నీతో మేం ఉంటాం, ఎప్పుడైనా” అని చెప్పడం మానసికంగా గొప్ప ఊరట కలిగిస్తుంది.
9. మీ శ్రేయస్సు గురించి జాగ్రత్త
వాళ్లకు తోడుగా ఉండే క్రమంలో మీరు కూడా శారీరకంగా, మానసికంగా బలంగా ఉండాలి. అవసరమైతే మిమ్మల్ని మీరు పునరుత్సాహపరచుకోండి, ఒక నమ్మదగిన వ్యక్తితో మాట్లాడండి.
10. మైలురాళ్లను సెలబ్రేట్ చేయండి:
క్యాన్సర్ ప్రయాణంలో ప్రతి దశను, రోగ నిర్ధారణ నుండి చికిత్స వరకు, కోలుకునే వరకు ప్రతి చిన్న విజయాన్ని సెలబ్రేట్ చేయండి. అది వారిలో పాజిటివిటీని పెంచుతుంది.
11. ఎదుర్కొంటున్న చికిత్స గురించి తెలుసుకోండి
వాళ్లు అనుభవించే కీమో, రేడియేషన్ వంటి చికిత్సల గురించి కొంత తెలుసుకుంటే, మీరు వారిని మెరుగ్గా అర్థం చేసుకోగలుగుతారు. కానీ అనవసరంగా అవగాహనా లోపంతో వైద్య సలహాలు ఇవ్వకండి. అవసరమైతే వాళ్లే అడుగుతారు.
12. వారి సరిహద్దులను గౌరవించండి:
వారు ఇష్టపడకపోతే వారిని మాట్లాడమని బలవంతం చేయకండి. వారి ప్రైవసీని గౌరవించండి.
13. వాళ్ల శక్తిని, భావాలను గౌరవించండి
చికిత్స సమయంలో ఒత్తిడి, అలసట, మానసిక ఆందోళనలు సహజం. కొన్ని రోజులు మాట్లాడాలనిపిస్తుంది. కొన్ని రోజులు మౌనంగా ఉండాలనిపిస్తుంది. రెండూ సరైనవే. వీటిని గౌరవిస్తూ మీరు సహనంతో ఉండాలి.
సంబంధిత కథనం