




Best Web Hosting Provider In India 2024

Nani on HIT 3: ఇదేమీ వయోలెంట్ మూవీ కాదు.. మన బుద్ధి బాగుండాలి.. ఆ సినిమాలతో పోల్చొద్దు: నాని కామెంట్స్
Nani on HIT 3: హిట్ 3 మూవీ ట్రైలర్లో మితిమీరిన హింస ఉండటంపై నాని స్పందించాడు. ఇదేమీ వయోలెంట్ మూవీ కాదని, దీనిని యానిమల్, మార్కోలాంటి సినిమాలతో పోల్చొద్దని అతడు చెప్పడం విశేషం. ఈ సినిమా గురించి అతడు ఇంకా ఏమన్నాడో చూడండి.

Nani on HIT 3: ఈ మధ్య సినిమాల్లో వయోలెన్స్ మరీ ఎక్కువైపోతోంది. యానిమల్, మార్కోలాంటి మూవీస్ ఎలా ఉన్నాయో మనం చూశాం. తాజాగా నాని నటించిన హిట్ 3 మూవీ ట్రైలర్ సోమవారం (ఏప్రిల్ 14) రిలీజ్ కాగా.. ఇందులోనూ మితిమీరిన హింస ఉన్నట్లుగా అనిపించింది. అయితే దీనిపై నాని స్పందించాడు. మన బుద్ధి బాగుండాలని, ఇంతకంటే వయోలెంట్ మూవీస్ తీసిన దేశాల్లో క్రైమ్ రేట్ తక్కువగా ఉందని అతడు చెప్పడం విశేషం.
హిట్ 3 మూవీపై నాని ఏమన్నాడంటే?
హిట్ 3 మూవీ మే 1న థియేటర్లలో విడుదల కానున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మూవీ థియేట్రికల్ ట్రైలర్ ను సోమవారం (ఏప్రిల్ 14) వైజాగ్ లో లాంచ్ చేశారు. ఆ తర్వాత హైదరాబాద్ లో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఇందులో నాని మాట్లాడాడు. “ట్రైలర్ రిలీజ్ అయినప్పటి నుంచి నా ఫోన్ మెసేజ్ లతో ఫుల్ అయింది. ట్రైలర్ కి వచ్చిన అద్భుతమైన రెస్పాన్స్ ఇది.
చాలా ఆనందాన్నిచ్చింది. గత కొన్ని రోజులుగా మా టీమ్ అంతా చాలా కష్టపడ్డారు. ఈ మధ్యకాలంలో లాస్ట్ మినిట్ లో ట్రైలర్స్ ఇస్తున్నారు. ఇంతకుముందు 20 రోజులు ముందు ట్రైలర్ వచ్చేది. ఆ నోస్టాల్జియా ఫీలింగ్ మళ్లీ ఇద్దామని ట్రైలర్ ని ముందుగానే రిలీజ్ చేసాము. ట్రైలర్ కోసం టీం అంత డే అండ్ నైట్ పనిచేసింది. ఈరోజు ట్రైలర్ కి వస్తున్న రెస్పాన్స్ కారణం శైలేష్ అండ్ టీం. వారందరికీ థాంక్యూ” అని నాని అన్నాడు.
మన బుద్ధి బాగుండాలి
ఈ సందర్భంగా ట్రైలర్లో హింస ఎక్కువైందన్న ప్రశ్న అడిగినప్పుడు నాని స్పందించిన తీరు భిన్నంగా ఉంది. ఈ హింస ప్రేక్షకులపై చూపించే ప్రభావం గురించి అడిగినప్పుడు అతడు ఇలా స్పందించాడు. “మనకంటే పదింతలు వయోలెన్స్ సినిమాలు తీసే దేశాల్లో మన కంటే క్రైమ్ రేట్ తక్కువగా వుంది. మన బుద్ధి సరిగ్గా వుండాలి. సినిమా అనేది బాధ్యత. మేము ఎంత బాధ్యతగా తీశామో సినిమా చూస్తే మీకే అర్ధమవుతుంది” అని నాని అన్నాడు.
ఇక ట్రైలర్లో చాగంటి ప్రవచనాలు కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన విషయం తెలిసిందే. దీనిపైనా నాని స్పందించాడు. “కథలో చాలా ముఖ్యమైన కనెక్షన్ వుంది. శైలేష్ ఈ కథ ఐడియా చాగంటి గారికి చెప్పారు. ఆయనకి చాలా నచ్చింది. చాగంటి గారు సినిమా కోసం ప్రత్యేకంగా చెప్పారు” అని నాని అన్నాడు. హిట్ 3 ఓ రేసీ థ్రిల్లర్ సినిమా అని, యాక్షన్ లవర్స్ కు ఇది ఫుల్ మీల్స్ లాంటిదని అతడు చెప్పాడు. ఇదొక డిఫరెంట్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ అందిస్తుందని, అది తప్పనిపిస్తే మళ్లీ నానిని నమ్మకండి అంటూ అతడు నవ్వుతూ అన్నాడు.
సంబంధిత కథనం