






Best Web Hosting Provider In India 2024

SS Rajamouli: రాజమౌళి హీరోగా నటించిన మూవీ ఇదే – విజయేంద్రప్రసాద్ ప్రొడ్యూసర్ – షూటింగ్ పూర్తయినా రిలీజ్ కాలేదు!
Rajamouli: డైరెక్టర్‌గా ఎంట్రీ ఇవ్వడానికి ముందు హీరోగా రాజమౌళి ఓ సినిమా చేశాడు. పిల్లన గ్రోవి పేరుతో తెరకెక్కిన బాలల సినిమాలో లీడ్ యాక్టర్‌గా కనిపించారు. రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ నిర్మించిన ఈ మూవీ షూటింగ్ చివరి దశలో ఆగిపోయింది.

తెలుగు సినిమా ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయిలో చాటిచెప్పారు రాజమౌళి. ఆయన దర్శకత్వం వహించిన ఆర్ఆర్ఆర్ మూవీ ఆస్కార్ అవార్డును దక్కించుకున్నది. ఈ ఘనతను సాధించిన ఫస్ట్ తెలుగు మూవీగా ఆర్ఆర్ఆర్ రికార్డును క్రియేట్ చేసింది. ఆర్ఆర్ఆర్ తో పాటు రాజమౌళి దర్శకత్వం వహించిన బాహుబలి, బాహుబలి 2 కూడా భారతీయ సినీ హిస్టరీలోనే అత్యధిక వసూళ్లను రాబట్టిన సినిమాలుగా నిలిచాయి.
హాలీవుడ్ యాక్టర్స్ సైతం…
ఈ సినిమాలతో రాజమౌళి క్రేజ్ పాన్ ఇండియన్ స్థాయిని దాటేసింది. రాజమౌళితో సినిమాలు చేసేందుకు బాలీవుడ్, కోలీవుడ్‌తో మాత్రమే హాలీవుడ్ యాక్టర్స్ సైతం ఆసక్తిని ప్రదర్శిస్తున్నారంటే అతిశయోక్తి కాదు.
స్క్రీన్‌పై…
డైరెక్టర్‌గానే కాకుండా అడపాదడపా స్క్రీన్‌పై కనిపించి అభిమానులను ఆకట్టుకున్నాడు రాజమౌళి. తాను దర్శకత్వం వహించిన బాహుబలి, మగధీర, ఆర్ఆర్ఆర్ సినిమాల్లో గెస్ట్‌రోల్స్‌లో కనిపించాడు. ప్రభాస్ కల్కి మూవీతో పాటు ఇతర దర్శకుల సినిమాల్లో అతిథి పాత్రల్లో కనిపించి ఆడియెన్స్‌ను సర్‌ప్రైజ్ చేశాడు.
హీరోగా…
సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వడానికి ముందు చైల్డ్ యాక్టర్‌గా రాజమౌలి ఓ సినిమా చేశాడు. ఈ సినిమాలో అతడే లీడ్ రోల్‌లో న టించడం గమనార్హం. పిల్లన గ్రోవి పేరుతో రూపొందిన ఈ సినిమాకు రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ ప్రొడ్యూసర్. కీరవాణి తండ్రి శివశక్తి దత్తా దర్శకత్వం వహించారు.
ఈ బాలల సినిమాలో బాలకృష్ణుడి పాత్రలో రాజమౌళి నటించారు. పిల్లన గ్రోవిలో రాజమౌళితో పాటు ఆయన సోదరి ఎమ్ఎమ్ శ్రీలేఖ ఓ చిన్న పాత్రలో కనిపించింది. జేవీ సోమయాజులు, నిర్మలమ్మ, మిక్కిలినేనితో అప్పటి సీనియర్ ఆర్టిస్టులను ఇతర ప్రధాన పాత్రల కోసం తీసుకున్నారు. ఈ సినిమాకు టెక్నీషియన్లు అందరూ రాజమౌళి ఫ్యామిలీ మెంబర్స్ కావడం గమనార్హం.
కీరవాణి మ్యూజిక్…
సంప్రదాయాలు, ఆచారాలకు ప్రాధాన్యమిచ్చే ఓ బ్రహ్మాణ కుటుంబం నేపథ్యంలో పిల్లనగ్రోవి మూవీ కథను తయారు చేసుకున్నారు శివశక్తి దత్తా. ఈ సినిమాకు కీరవాణి మ్యూజిక్ అందించారు.
లిమిటెడ్ బడ్జెట్‌లో ఈ సినిమా చేయాలని విజయేంద్రప్రసాద్ అనుకున్నారు. షూటింగ్ చివరి దశలో ఉండగా ఆర్థిక ఇబ్బందులు తలెత్తడంతో ఈ సినిమా ఆగిపోయింది. డబ్బు సర్ధుబాటు అయ్యాక మిగిలిన షూటింగ్‌ను పూర్తిచేసి పిల్లనగ్రోవి సినిమాను రిలీజ్ చేయాలని అనుకున్నారు. కానీ అప్పటికే రాజమౌళి, శ్రీలేఖ పెద్దవారు కావడం, కొందరు ఆర్టిస్టులు కన్నుమూయడంతో పిల్లనగ్రోవి సినిమాను ఆపేశారు.అలా రాజమౌళి లీడ్ యాక్టర్‌గా నటించిన ఒకే ఒక మూవీ రిలీజ్‌కు నోచుకోలేదు.
ప్రస్తుతం మహేష్‌బాబుతో రాజమౌళి సినిమా చేస్తోన్నాడు. దాదాపు వెయ్యి కోట్ల బడ్జెట్‌తో యాక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్‌గా ఈ మూవీ తెరకెక్కుతోంది.
సంబంధిత కథనం