






Best Web Hosting Provider In India 2024

Star Maa Serial: బ్రహ్మముడి మేకర్స్ నుంచి కొత్త సీరియల్ వచ్చేస్తోంది -టైటిల్ ఇదే-గుప్పెడంత మనసు సీక్వెల్ కాదంట!
Serial: స్టార్ మా ప్రేక్షకుల ముందుకు త్వరలోనే మరో కొత్త సీరియల్ రాబోతుంది. నిండు మనసులు అనే టైటిల్‌తో తెరకెక్కుతోన్న ఈ సీరియల్‌లో నువ్వు నేను ప్రేమ ఫేమ్ పవిత్రా బీ నాయక్ లీడ్ రోల్‌లో కనిపించబోతున్నది. బ్రహ్మముడి డైరెక్టర్ కుమార్ పంతం ఈ సీరియల్‌కు దర్శకత్వం వహిస్తున్నాడు.

Star Maa Serial: మరో కొత్త సీరియల్‌తో స్టార్ మా అభిమానులను సర్‌ప్రైజ్ చేసేందుకు బ్రహ్మముడి మేకర్స్ సిద్ధమయ్యారు. ఈ కొత్త సీరియల్ టైటిల్‌తో పాటు లీడ్ యాక్టర్స్ ఎవరన్నది రివీలైంది. ఈ సీరియల్‌కు నిండు మనసులు అనే టైటిల్ కన్ఫామ్ చేశారు.
బ్రహ్మముడి డైరెక్టర్….
బ్రహ్మముడి డైరెక్టర్ కుమార్ పంతం….నిండు మనసులు సీరియల్‌కు దర్శకత్వం వహిస్తున్నాడు. బ్రహ్మముడితో పాటు గుప్పెడంత మనసు సీరియల్స్‌ను ప్రొడ్యూస్ చేసిన భూమి ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ నిండు మనసులును నిర్మిస్తోంది.
పవిత్రా బీ నాయక్….
నువ్వునేను ప్రేమ సీరియల్ ఫేమ్ పవిత్రా బీ నాయక్ నిండు మనుసులు సీరియల్‌లో లీడ్ రోల్‌లో కనిపించబోతున్నది. నువ్వు నేను ప్రేమలో పద్మావతి పాత్ర ద్వారా తెలుగు సీరియల్ లవర్స్‌ను మెప్పించింది పవిత్రా బీ నాయక్. అమాయకత్వం, ధైర్యం కలబోసిన గృహిణి పాత్రలో నాచురల్ యాక్టింగ్‌తో మెప్పించింది.
గుప్పెడంత మనసు దేవయాని…
నిండు మనుసులు సీరియల్‌లో ఇంద్రనీల్, నీప, సంగీత కొండెపూడి కీలక పాత్రలు పోషించారు. సంగీత కొండెపూడి గుప్పెడంత మనసులో దేవయానిగా నటించగా….నీప బ్రహ్మముడి సీరియల్‌లో కనకం పాత్ర పోషిస్తోంది. ఈ సీరియల్ ప్రోమోను స్టార్ మా రిలీజ్ చేసింది. తల్లీకూతుళ్ల అనుబంధం నేపథ్యంలో నిండు మనుసులు సీరియల్ తెరకెక్కబోతున్నట్లు ప్రోమోలో చూపించారు.
సీక్వెల్ కాదు…
నిండు మనుసులు సీరియల్….గుప్పెడంత మనసుకు సీక్వెల్ అంటూ ప్రచారం జరిగింది. గుప్పెడంత మనసులో రిషి, వసుధారలుగా నటించిన ముఖేష్ గౌడ, రక్షా గౌడ….నిండు మనుసులు సీరియల్‌లో హీరోహీరోయిన్లుగా నటించనున్నారని వార్తలు వచ్చాయి. కానీ ప్రోమో ద్వారా సీక్వెల్ కాదంటూ మేకర్స్ క్లారిటీ ఇచ్చారు. నిండు మనసులు సీరియల్ మే నెలలో లాంఛ్ కానున్నట్లు సమాచారం. త్వరలోనే టెలికాస్ట్ డేట్‌తో పాటు టైమింగ్స్‌ను రివీల్ చేయనున్నట్లు సమాచారం.
సెకండ్ సీరియల్ ఇదే…
నువ్వు నేను ప్రేమ తర్వాత స్టార్ మాలో పవిత్రా బీ నాయక్ చేస్తోన్న సెకండ్ సీరియల్ ఇది. నువ్వు నేను ప్రేమ గత ఏడాది నవంబర్‌లో ముగిసింది. ఒకప్పుడు టీఆర్‌పీ రేటింగ్‌లో టాప్‌లో నిలిచింది. టైమ్ ఛేంజ్ తర్వాత సీరియల్ క్రేజ్ పడిపోతూ వచ్చింది. నువ్వు నేను ప్రేమ సీరియల్‌లో స్వామి నాథన్ అనంతరామన్ కీలక పాత్ర పోషించాడు.
సంబంధిత కథనం