




Best Web Hosting Provider In India 2024
OpenAI : ఓపెన్ఏఐలో ఉద్యోగాలు- స్వయంగా ప్రకటించిన సామ్ ఆల్ట్‌మన్.. అర్హత ఎంటో తెలుసా?
OpenAI hiring : ఓపెన్ఏఐలో హైరింగ్‌ని ప్రకటించారు సంస్థ సీఈఓ సామ్ ఆల్ట్‌మన్. కొన్ని అర్హత ప్రమాణాలను కూడా వివరిస్తూ ట్వీట్ చేశారు. ‘మీ అవసరం చాలా ఉంది’ అని రాసుకొచ్చారు. పూర్తి వివరాల్లోకి వెళితే..

చాట్‌జీపీటీ అనే విప్లవంతో ఆర్టిఫీషియెల్ ఇంటెలిజెన్స్ ప్రపంచాన్ని ముందుండి నడిపిస్తున్న ఓపెన్ఏఐ సీఈఓ సామ్ ఆల్ట్‌మన్.. సంస్థను విస్తరించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే సోషల్ మీడియా వేదికగా ‘హైరింగ్’ని ప్రకటించారు. మౌలిక సదుపాయాలు, భారీ స్థాయి కంప్యూటింగ్ వ్యవస్థలపై ఆసక్తి ఉన్నవారి కోసం వెతుకుతున్నట్టు వెల్లడించారు.
ఓపెన్ఏఐ హైరింగ్- అర్హత ఏంటంటే..
“ప్రస్తుతం OpenAIలో భారీ స్థాయిలో, మతిపోయే విధంగా పనులు జరుగుతున్నాయి. మా ముందు చాలా కఠినమైన / ఆసక్తికరమైన సవాళ్లు ఉన్నాయి,” అని ఆల్ట్‌మన్ ఎక్స్‌లో ఒక పోస్ట్‌లో రాసుకొచ్చారు. “మాతో చేరడాన్ని పరిగణించండి! మేము మీ సహాయాన్ని ఉపయోగించుకుంటాము,” అని సామ్ ఆల్ట్‌మన్ అన్నారు.
సిస్టెమ్ని ఉపయోగించుకుని హై పర్ఫార్మెన్స్ని ఇవ్వగలిగే సామర్థ్యం ఉన్నవారి కోసం ఓపెన్ఏఐ చూస్తోందని సీఈఓ సామ్ ఆల్ట్‌మన్ చెప్పుకొచ్చారు. అలాంటి వారితో మాట్లాడేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్టు వివరించారు.
“కంపైలర్ డిజైన్ లేదా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ డిజైన్‌లో మీకు నేపథ్యం ఉంటే, మా సంస్థలో మీకు గొప్ప అవకాశాలు లభిస్తాయి,” అని ఆల్ట్‌మన్ చెప్పుకొచ్చారు.
ఫైండ్ రైజింగ్ తర్వాతే ఉద్యోగాల ప్రకటన..
కొత్త సాధనాలను అభివృద్ధి చేయడానికి, చివరికి ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ (ఏజీఐ) వైపు మార్గం సుగమం చేయడానికి సాఫ్ట్‌బ్యాంక్ గ్రూప్ కార్ప్, ఇతర పెట్టుబడిదారుల నుంచి ఓపెన్ఏఐ 40 బిలియన్ డాలర్ల ఫండింగ్ రౌండ్‌ని ఖరారు చేసిన రెండు వారాల తరువాతే సామ్ ఆల్ట్‌మన్ ఉద్యోగాల ప్రకటన చేయడం విశేషం.
అంతకు ముందు, ఆల్ట్‌మన్, సాఫ్ట్‌బ్యాంక్‌కి చెందిన మసయోషి సన్, ఒరాకిల్కి చెందిన లారీ ఎల్లిసన్.. జనవరి 21, వైట్‌హౌస్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో కలిసి స్టార్గేట్ ప్రాజెక్టును ప్రకటించారు.
ఓపెన్ఏఐ ఆధ్వర్యంలో అమెరికాలో ఏఐకి మద్దతిచ్చే విధంగా కీలకమైన మౌలికవసతులను రూపొందించేందుకు, డేటా సెంటర్ల వ్యవస్థను నిర్మించడం ఈ స్టార్గేట్ ప్రాజెక్ట్ ఉద్దేశం.
అయితే మస్క్ కూడా తన ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని పెంచుకునేందుకు ఎక్స్ఏఐ అనే స్టార్టప్‌ని ప్రవేశపెట్టారు. ఇది టెన్నెస్సెలో ప్రపంచంలోనే అతిపెద్ద సూపర్‌కంప్యూటర్ ఫెసిలిటీని నిర్మిస్తోంది. దీనికి స్టార్గేట్ ప్రత్యక్ష పోటీగా నిలుస్తోంది.
చాట్‌జీపీటీ వినియోగదారుల సంఖ్య ఒక వారంలో రెట్టింపు అయిన తరువాత ఏఐ ప్రపంచంలో పోటీ మరింత పెరిగింది. ఏఐ చాట్ బాట్, ఇమేజ్ జనరేటర్ ఇప్పుడు ఒక బిలియన్ వినియోగదారులను కలిగి ఉంటాయని అంచనాలు ఉన్నాయి. ప్రత్యేకించి జపనీస్ యానిమేషన్ స్టూడియో అయిన స్టూడియో గిబ్లి స్టైల్లో వినియోగదారులు ఏఐ-జనరేటెడ్ చిత్రాలను సృష్టించే ట్రెండ్ వైరల్ అవ్వడం ఇందుకు ప్రధాన కారణం.
సంబంధిత కథనం
Best Web Hosting Provider In India 2024
Source link