Sathyaraj: యంగ్ హీరోల‌తో పోటీప‌డుతోన్న క‌ట్ట‌ప్ప – గ్రిప్పింగ్ థ్రిల్ల‌ర్‌గా త్రిబాణ‌ధారి బార్బ‌రిక్‌

Best Web Hosting Provider In India 2024

Sathyaraj: యంగ్ హీరోల‌తో పోటీప‌డుతోన్న క‌ట్ట‌ప్ప – గ్రిప్పింగ్ థ్రిల్ల‌ర్‌గా త్రిబాణ‌ధారి బార్బ‌రిక్‌

Nelki Naresh HT Telugu
Published Apr 15, 2025 01:12 PM IST

Sathyaraj: త్రిబాణ‌ధారి బార్బ‌రిక్ మూవీలో అన‌గా అన‌గా క‌థ‌లా సాంగ్ యూట్యూబ్‌లో ట్రెండ్ అవుతోంది. ఈ మెలోడీ పాట‌ను కార్తీక్ ఆల‌పించారు. పురాణాల నేప‌థ్యంలో ల‌వ్ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కుతోన్న ఈ మూవీలో స‌త్య‌రాజ్‌, వ‌శిష్ట ఎన్ సింహా, ఉద‌య‌భాను కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు.

స‌త్య‌రాజ్‌
స‌త్య‌రాజ్‌

బాహుబలి మూవీలో కట్టప్ప పాత్ర స‌త్య‌రాజ్‌కు పాన్ ఇండియ‌న్ లెవెల్‌లో గుర్తింపును తెచ్చిపెట్టింది. అత‌డి సెకండ్ ఇన్నింగ్స్‌కు బ‌ల‌మైన పునాది వేసింది. బాహుబ‌లి త‌ర్వాత కోలీవుడ్‌, టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్‌లో డిఫ‌రెంట్ క్యారెక్ట‌ర్స్ స‌త్య‌రాజ్‌ను వ‌రిస్తున్నాయి.

వ‌రుస సినిమాల‌తో యంగ్ హీరోల‌తో ఆఫ‌ర్ల‌లోనే కాదు ప్ర‌మోష‌న్స్‌లో పోటీప‌డుతోన్నాడు. తాను ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తోన్న త్రిబాణధారి బార్బ‌రిక్ మూవీ కోసం కుర్ర హీరోల స్థాయిలో ప్ర‌మోష‌న్స్ చేస్తోన్నారు.

మారుతి స‌మ‌ర్ప‌ణ‌లో

సత్యరాజ్ ప్రముఖ పాత్రలో నటించిన చిత్రం ‘త్రిబాణధారి బార్బరిక్’. డైరెక్టర్ మారుతి సమర్పణలో విజయ్‌పాల్ రెడ్డి అడిదాల ఈ సినిమాను నిర్మించారు. మోహన్ శ్రీవత్స దర్శకత్వం వహించారు.

ఈ సినిమాకు సంబంధించి ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జ‌రుగుతోన్నాయి. ఇప్ప‌టివ‌ర‌కు రిలీజ్ చేసిన పాటలు, టీజర్, గ్లింప్స్ ఇలా ప్రతీ ఒక్కటీ ఆడియెన్స్‌లో సినిమా పట్ల ఆసక్తిని పెంచాయి. టీజ‌ర్‌కు యూట్యూబ్‌లో రెండున్న‌ర మిలియ‌న్ల వ్యూస్ వ‌చ్చాయి.

అన‌గా అన‌గా క‌థ‌లా సాంగ్‌…

ఇటీవ‌ల త్రిబాణ‌ధారి బార్బ‌రిక్ నుంచి ‘అనగా అనగా కథలా’ అనే పాటను మేక‌ర్స్ ఇటీవ‌ల రిలీజ్ చేశారు. తాత, మనవరాలి మధ్య ఉండే బాండింగ్‌ను చూపించేలా ఈ పాటను చిత్రీకరించారు. ఈ పాట ప్రమోషన్స్‌లో భాగంగా సత్యరాజ్ రీల్స్ చేశారు.

ప్రస్తుతం సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా హీరో హీరోయిన్లంతా కూడా రీల్స్ చేస్తుండగా.. సత్యరాజ్ సైతం ఈ ట్రెండ్‌లో పాల్గొన్నారు. స‌త్య‌రాజ్ చేసిన రీల్ వీడియోస్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోన్నాయి.

అన‌గా అన‌గా క‌థ‌లా పాట యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో ఉంది. మెలోడీ ప్ర‌ధానంగా సాగిన ఈ పాట‌ను కార్తీక్ ఆల‌పించాడు. ఇన్ఫ్యూజ‌న్ బ్యాండ్ మ్యూజిక్ అందించింది.

పురాణాలు కూడా…

ల‌వ్‌స్టోరీకి థ్రిల్ల‌ర్ ఎలిమెంట్స్ జోడించి ద‌ర్శ‌కుడు త్రిబాణ‌ధారి బార్బ‌రిక్ మూవీకి తెర‌కెక్కిస్తున్నారు. అంత‌ర్లీనంగా పురాణాల‌కు సంబంధించిన ఓ ఎలిమెంట్ ఉంటుంద‌ని స‌మాచారం. త్రిబాణ‌ధారి బార్బ‌రిక్ మూవీలో సత్యరాజ్, సత్యం రాజేష్, వశిష్ట ఎన్ సింహ, సాంచి రాయ్, ఉదయ భాను కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. త్వ‌ర‌లోనే ఈ మూవీ ప్రేక్ష‌కుల ముందుకు రాబోతుంది. ఈ సినిమాతోనే లాంగ్ గ్యాప్ త‌ర్వాత ఉద‌య‌భాను సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తోంది.

Nelki Naresh

TwittereMail
నెల్కి న‌రేష్ కుమార్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియ‌ర్ కంటెంట్ ప్రొడ్యూస‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. సినిమా, టీవీ రంగాల‌తో పాటు స్పోర్ట్స్‌కు సంబంధించిన రెగ్యుల‌ర్ అప్‌డేట్స్‌, రివ్యూల‌ను అందిస్తుంటారు. తెలంగాణ యూనివ‌ర్సిటీ లో మాస్ క‌మ్యూనికేష‌న్ అండ్ జ‌ర్న‌లిజంలో పీజీ చేశారు. గ‌తంలో న‌మ‌స్తే తెలంగాణ దిన‌ప‌త్రిక‌లో ప‌నిచేశారు. 2022 ఫిబ్ర‌వ‌రిలో హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024