






Best Web Hosting Provider In India 2024

Anushka Sharma: దీపికా పదుకోన్ భర్తతో డేటింగ్.. విరాట్ కోహ్లి భార్య రియాక్షన్ వైరల్.. అతడు బాయ్‌ఫ్రెండ్‌గా ఉండలేడంటూ..
Anushka Sharma: దీపికా పదుకోన్ భర్త రణ్‌వీర్ సింగ్ తో డేటింగ్ పై విరాట్ కోహ్లి భార్య అనుష్క శర్మ స్పందించింది. అయితే ఆమె చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. అతడు బాయ్‌ఫ్రెండ్ కాలేడంటూ ఆమె అనడం విశేషం.

Anushka Sharma: బాలీవుడ్ నటుడు రణ్‌వీర్ సింగ్ తెలుసు కదా. స్టార్ హీరోయిన్ దీపికా పదుకోన్ ను అతడు పెళ్లి చేసుకున్నాడు. ఇక మరో బాలీవుడ్ నటి అనుష్క శర్మ స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లిని పెళ్లాడింది. కానీ ఒకప్పుడు ఈ ఇద్దరి డేటింగ్ రూమర్లు వార్తల్లో నిలిచాయి. అయితే రణ్‌వీర్ సింగ్ తో తాను ఎందుకే డేటింగ్ చేయలేదో అప్పట్లోనే అనుష్క ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. ఆమె కామెంట్స్ ఇంట్రెస్టింగా ఉన్నాయి.
రణ్‌వీర్ బాయ్‌ఫ్రెండ్‌గా ఉండలేడు
రణ్‌వీర్ సింగ్ 2010లో వచ్చిన బ్యాండ్ బాజా బారాత్ మూవీతో తొలిసారి బాలీవుడ్ లోకి అడుగుపెట్టాడు. ఆ మూవీలో ఫిమేల్ లీడ్ గా అనుష్క నటించింది. ఈ ఇద్దరి మధ్య కెమెస్ట్రీ బాగుందని అప్పట్లో కామెంట్స్ వచ్చాయి. సినిమా కూడా హిట్ అయింది. దీంతో అనుష్కతో ఎందుకు డేటింగ్ చేయకూడదు అని అప్పట్లో రణ్‌వీర్ ను మీడియా ప్రశ్నించేది. దీనికి అతడు స్పందిస్తూ.. అనుష్కను గర్ల్‌ఫ్రెండ్ గా హ్యాండిల్ చేయడం కష్టమని, ఆమె బాయ్‌ఫ్రెండ్ ను చంపేస్తుందని అనడం విశేషం.
దీనికి అనుష్క కూడా ఘాటుగానే స్పందించింది. “రణ్‌వీర్ బాయ్‌ఫ్రెండ్ గా ఉండలేడు. అతడు మంచివాడు. కష్టపడతాడు. కానీ ఆ సమయంలో అతడు తన పనిలో తాను బిజీ అయ్యాడు. అది తన తొలి సినిమా. అప్పుడే ఇండస్ట్రీలోకి వస్తున్నాడు. అది నేను అర్థం చేసుకోగలను. అందుకే అతనితో ఎప్పుడూ డేటింగ్ చేయనని నేను అన్నాను. ఎందుకు మీరిద్దరూ డేటింగ్ చేయకూడదని ఎంతో మంది నన్ను అడిగారు. ఇదే కారణమని చెప్పేదాన్ని. తన రోజు ఎలా గడిచిందో చెప్పడంతోపాటు నా రోజు ఎలా గడిచిందో కూడా అడిగే బాయ్‌ఫ్రెండ్ నాకు కావాలి. ఆ పని అతడు ఎప్పుడూ చేయడు. అందుకే అతనితో డేటింగ్ చేయను” అని అనుష్క చెప్పింది.
అనుష్క, రణ్‌వీర్ ఇప్పుడిలా..
అనుష్క, రణ్‌వీర్ 2010లో వచ్చిన బ్యాండ్ బాజా బారాత్ మూవీ తర్వాత కొన్నేళ్లకు మరోసారి దిల్ దడక్నే దో అనే మరో సినిమాలోనూ కలిసి నటించారు. ఆ తర్వాత అనుష్క శర్మ క్రికెటర్ విరాట్ కోహ్లిని పెళ్లి చేసుకుంది. ఆమెకు ఇప్పటికే ఇద్దరు పిల్లలు ఉన్నారు.
ఇటు రణ్‌వీర్ సింగ్ కూడా నటి దీపికా పదుకోన్ ను పెళ్లాడాడు. ఈ జంటకు గతేడాది ఓ పాప జన్మించింది. పెళ్లి తర్వాత అనుష్క సినిమాలకు దూరమైంది. ఆమె చివరిగా షారుక్ ఖాన్ తో కలిసి జీరో మూవీలో నటించింది. ఇటు రణ్‌వీర్ సింగ్ గతేడాది సింగం అగైన్ లో కనిపించాడు. ఇప్పుడు మరో రెండు సినిమాలు చేస్తున్నాడు.