Nag Ashwin: ఆ సినిమా ట్రైలర్ చూసి వారం రోజులు డిప్రెషన్‍లోకి వెళ్లా: కల్కి డైరెక్టర్ నాగ్ అశ్విన్

Best Web Hosting Provider In India 2024

Nag Ashwin: ఆ సినిమా ట్రైలర్ చూసి వారం రోజులు డిప్రెషన్‍లోకి వెళ్లా: కల్కి డైరెక్టర్ నాగ్ అశ్విన్

Chatakonda Krishna Prakash HT Telugu
Published Apr 15, 2025 02:56 PM IST

Nag Ashwin: డైరెక్టర్ నాగ్ అశ్విన్ తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ విషయం చెప్పారు. ఓ హాలీవుడ్ సినిమా ట్రైలర్ చూసి తాను వారం రోజులు డిప్రెషన్‍లోకి వెళ్లానని తెలిపారు. అందుకు కారణాన్ని కూడా వెల్లడించారు.

Nag Ashwin: ఆ సినిమా ట్రైలర్ చూసి వారం రోజులు డిప్రెషన్‍లోకి వెళ్లా: కల్కి డైరెక్టర్ నాగ్ అశ్విన్
Nag Ashwin: ఆ సినిమా ట్రైలర్ చూసి వారం రోజులు డిప్రెషన్‍లోకి వెళ్లా: కల్కి డైరెక్టర్ నాగ్ అశ్విన్

డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఇప్పటి వరకు చేసినవి మూడు సినిమాలే అయినా టాప్ డైరెక్టర్ల జాబితాలోకి ఎక్కేశారు. ఎవడే సుబ్రమణ్యం, మహానటి, కల్కి 2898 ఏడీ చిత్రాలతో వరుస హిట్స్ కొట్టారు. గతేడాది పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్‍తో నాగ్ అశ్విన్ తెరకెక్కించిన కల్కి బ్లాక్‍బస్టర్ అయింది. ఈ మూవీ సీక్వెల్ కల్కి 2 స్క్రిప్ట్ పనుల్లో ఆయన ప్రస్తుతం బిజీగా ఉన్నారు. కాగా, తాజాగా ఓ ఇంటరాక్షన్‍లో నాగ్ అశ్విన్ పాల్గొన్నారు. కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకున్నారు.

ఇన్‍సెప్షన్ ట్రైలర్ చూసి డిప్రెషన్‍లోకి..

కొందరు ఫిల్మ్ మేకర్లకు ఏదైనా రాసేటప్పుడు.. అలాంటి కాన్సెప్ట్, ఐడియాతోనే వేరే చిత్రాలు రావడం జరుగుతూ ఉంటుందని నాగ్ అశ్విన్ అన్నారు. మీకు ఏదైనా అలాంటిది ఎదురైందా అనే ప్రశ్నకు ఆయన స్పందించారు. ఇన్‍సెప్షన్ మూవీలోని ఐడియా తనకు ఆ చిత్రం రిలీజ్‍కు ముందే వచ్చిందని నాగ్ అశ్విన్ చెప్పారు.

తాను అనుకుంటున్న ఐడియాతో ఉన్న ఇన్‍సెప్షన్ ట్రైలర్ చూసి వారం రోజులు డిప్రెషన్‍లోకి వెళ్లానని నాగ్ అశ్విన్ చెప్పారు. “ఇన్‍సెప్షన్ లాంటి ఐడియానే నాకు ఉండింది. అచ్చం అలాంటిదే కాకపోయినా చాలా దగ్గరగా నా ఐడియా ఉంది. 2008లోనే నేను డ్రీమ్స్ గురించి రాసుకున్నా. కానీ ఒక్కసారి ఇన్‍సెప్షన్ ట్రైలర్ చూశాక.. వారం రోజులు డిప్రెషన్‍లో ఉన్నా. అటూఇటూ తిరుగుతూ మ్యాగీ తింటూ ఉన్నా” అని నాగ్ అశ్విన్ అన్నారు.

క్రిస్టఫర్ నోలాన్ దర్శకత్వం వహించిన ‘ఇన్‍సెప్షన్’ హాలీవుడ్‍లో ఒకానొక గ్రేట్ సినిమాగా నిలిచింది. మాస్టర్ పీస్‍ అంటూ ప్రశంసలు దక్కించుకుంది. 2010లో విడుదలైన ఈ సైన్స్ ఫిక్షన్ మూవీ భారీ సక్సెస్ అయింది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాకు ఫ్యాన్స్ ఉన్నారు. రీ-రిలీజైన ప్రతీసారి ఈ మూవీకి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. ఇన్‍సెప్షన్ చిత్రంలో లియోనార్డో డికాప్రియో లీడ్ రోల్ చేశారు.

ఈ 2 సినిమాలను ఎడిట్ చేయాలనుకున్నా

“వేరే ఏ చిత్రానికైనే నేను డైరెక్ట్ చేసి ఉంటే బాగుండేదని అనిపించిందా” అనే ప్రశ్న నాగ్ అశ్విన్‍కు ఎదురైంది. డైరెక్ట్ చేస్తే బాగుండేదనే చిత్రాలు లేవని, కానీ ఎడిట్ చేస్తే బాగుంటుందని రెండు సినిమాలకు అనుకున్నానని నాగ్ అశ్విన్ చెప్పారు. ఖలేజా, డియర్ కామ్రేడ్ చిత్రాలకు తాను ఎడిటర్‌గా ఉండి ఉండాల్సిందని అనుకున్నానని తెలిపారు. ఆ రెండు సినిమాల్లో కంటెంట్ బాగానే ఉన్నా.. బాక్సాఫీస్ వద్ద సరిగా పర్ఫార్మ్ చేయలేకపోయాయి. టీవీల్లోకి వచ్చాక ఖలేజా క్లాసిక్‍లా నిలిచిపోయింది.

నాగ్ అశ్విన్ ప్రస్తుతం కల్కి 2 సినిమా స్క్రిప్ట్ రాస్తున్నారు. ఈ ఏడాది చివర్లో షూటింగ్ మొదలుపెట్టాలని అనుకుంటున్నట్టు ఇటీవల హింట్స్ ఇచ్చారు. సీక్వెల్‍లో ప్రభాస్ పోషిస్తున్న కల్కి పాత్ర ఎక్కువగా ఉంటుందని కూడా చెప్పారు. ముందుగా ప్రభాస్ లేని పోర్షన్లు షూట్ చేసే ఛాన్స్ ఉంది.

మైథలాజికల్ సైన్స్ ఫిక్షన్ మూవీ కల్కి 2898 ఏడీ గతేడాది జూన్ 27న థియేటర్లలో రిలీజైంది. ఈ మూవీని తెరకెక్కించిన నాగ్ అశ్విన్‍పై భారీ ప్రశంసలు దక్కాయి. ఈ చిత్రం రూ.1200కోట్లకు పైగా కలెక్షన్లను దక్కించుకుంది. ఈ చిత్రంలో ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొణ్ ప్రధాన పాత్రలు పోషించారు. వైజయంతీ మూవీస్ పతాకం ఈ మూవీని ప్రొడ్యూజ్ చేసింది. కల్కి చిత్రంతో పాన్ ఇండియా రేంజ్‍లో పాపులర్ అయ్యారు నాగ్ అశ్విన్.

Chatakonda Krishna Prakash

TwittereMail
చాటకొండ కృష్ణ ప్రకాశ్.. హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. ఇక్కడ ప్రస్తుతం ఎంటర్‌టైన్‍మెంట్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2022 నవంబర్‌లో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024