






Best Web Hosting Provider In India 2024

OTT Platforms: ఈ ఓటీటీ ప్లాట్ఫామ్స్ కూడా ఉన్నాయని మీకు తెలుసా? బోల్డ్ కంటెంట్ కోసం కూడా ఓ ఓటీటీ
OTT Platforms: ఓటీటీ ప్లాట్ఫామ్స్ అంటే నెట్ఫ్లిక్స్, ప్రైమ్ వీడియోలాంటివే కాదు.. మరెన్నో ఉన్నాయన్న విషయం మీకు తెలుసా? ఇండియాలో ఎక్కువ మందికి తెలియని ఆ ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఏవో చూడండి. బోల్డ్ కంటెంట్ కోసమే ప్రత్యేకంగా ఓటీటీ ఉంది.

OTT Platforms: ఓటీటీ అనగానే సాధారణంగా నెట్ఫ్లిక్స్, ప్రైమ్ వీడియోలాంటివే అనే ఫీలింగ్ చాలా మందిలో ఉంది. ఇవి కాకుండా సోనీ లివ్, జీ5, ఆహా వీడియో, జియోహాట్స్టార్ కూడా తెలుసు. అయితే వీటితోపాటు మరికొన్ని ఓటీటీ ప్లాట్ఫామ్స్ కూడా ఇండియాలో ఉన్నాయి. అవేంటో చూడండి. అందులోని కంటెంట్ కూడా ఫాలో అవండి.
ఉల్లు (Ullu) ఓటీటీ
బోల్డ్ కంటెంట్ కు కేరాఫ్ ఈ ఓటీటీ ప్లాట్ఫామ్. ఉల్లు అంటే గుడ్లగూబ అని అర్థం. 2018లో ఈ ప్లాట్ఫామ్ ప్రారంభమైంది. ఇందులో వచ్చే సినిమాలు, వెబ్ సిరీస్ చాలా వరకు అడల్ట్ ఓరియెంటెడ్ గానే ఉంటాయి. ఇతర ఓటీటీ ప్లాట్ఫామ్స్ తో పోలిస్తే ఈ ఓటీటీ ఈ విషయంలోనే ప్రత్యేకంగా నిలుస్తోంది. కేవలం బోల్డ్ కంటెంటే కావాలని అనుకున్న వాళ్లకు ఈ ఉల్లు బెస్ట్ ఆప్షన్. ఇందులో మూడు వెబ్ సిరీస్, సినిమాల వరకు ఫ్రీగా చూసే ఛాన్స్ ఉంటుంది. ఆ తర్వాత సబ్స్క్రైబ్ చేసుకోవాలి.
మనోరమ మ్యాక్స్ (Manorama Max)
కేవలం మలయాళం కంటెంట్ తో ఉండే రీజినల్ ఓటీటీ ప్లాట్ఫామ్ ఈ మనోరమ మ్యాక్స్. మలయాళ సినిమాలు, వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ అవుతుంటాయి. మలయాళం కంటెంట్ ఇష్టపడే తెలుగు ప్రేక్షకులు ఇంగ్లిష్ సబ్ టైటిల్స్ తో అందుబాటులో ఉండే ఈ మలయాళం మూవీస్, వెబ్ సిరీస్ లను ఇందులో చూడొచ్చు.
హోయ్చొయ్ (Hoichoi)
హోయ్చొయ్ కూడా ఓ రీజినల్ ఓటీటీ ప్లాట్ఫామ్. ఇందులో ఎక్కువగా బెంగాలీ కంటెంట్ స్ట్రీమింగ్ అవుతుంది. 2017లోనే ఈ ఓటీటీ మొదలైంది. కేవలం నెలకు రూ.50 సబ్స్క్రిప్షన్ తో ఇందులోని కంటెంట్ ను చూడొచ్చు. బెంగాలీ మూవీస్, వెబ్ సిరీస్ లను చూడాలనుకునేవాళ్లు ఈ ఓటీటీ ప్లాట్ఫామ్ ను ఫాలో కావచ్చు.
సైనా ప్లే (Saina Play)
సైనా ప్లే కూడా కేవలం మలయాళం కంటెంట్ అందించే రీజినల్ ఓటీటీ ప్లాట్ఫామ్. 2019లో ఈ ఓటీటీ ప్రారంభమైంది. ఇందులోనూ భారీ స్థాయిలో మలయాళం కంటెంట్ అందుబాటులో ఉంది.
చౌపల్ (Chaupal) ఓటీటీ
ప్రముఖ ప్రాంతీయ ఓటీటీ ప్లాట్ఫామ్స్ లో ఈ చౌపల్ కూడా ఒకటి. ఇది ప్రధానంగా పంజాబీ, హర్యాన్వీ, భోజ్పురి కంటెంట్ స్ట్రీమింగ్ చేస్తుంది. 2021లో ఈ ప్లాట్ఫామ్ ప్రారంభమైంది. అక్కడి కంటెంట్ చూడాలనుకునేవారు ఈ ఓటీటీని ట్రై చేయొచ్చు.
డిస్కవరీ ప్లస్ (Discovery+)
డిస్కవరీ ప్లస్ కూడా ఓ భిన్నమైన ఓటీటీ ప్లాట్ఫామ్. జియోగ్రఫీ అంటే ఆసక్తి ఉన్న వాళ్లకు ఇది బెస్ట్ ఆప్షన్. ప్రకృతి, సైన్స్, చరిత్రకు సంబంధించిన ఎన్నో డాక్యుమెంటరీలు ఇందులో అందుబాటులో ఉన్నాయి. నెలకు రూ.99 నుంచి ఏడాదికి రూ.299 సబ్స్క్రిప్షన్ ప్లాన్స్ తో ఈ ఓటీటీ కంటెంట్ ను చూడొచ్చు.
సన్ నెక్ట్స్ (Sun NXT)
సన్ నెక్ట్స్ కూడా ఓ ప్రాంతీయ ఓటీటీ ప్లాట్ఫామే. ప్రధానంగా తమిళ కంటెంట్ ఇందులో అందుబాటులో ఉంటుంది. దీంతోపాటు తెలుగు, కన్నడ, మలయాళం మూవీస్ కూడా చూడొచ్చు.
సంబంధిత కథనం