శబరిమల అయ్యప్ప బంగారు లాకెట్ ఇలా బుక్ చేసుకోవాలి.. ఎన్ని గ్రాములు, ధర ఎంత?

Best Web Hosting Provider In India 2024


శబరిమల అయ్యప్ప బంగారు లాకెట్ ఇలా బుక్ చేసుకోవాలి.. ఎన్ని గ్రాములు, ధర ఎంత?

Anand Sai HT Telugu Published Apr 15, 2025 03:41 PM IST
Anand Sai HT Telugu
Published Apr 15, 2025 03:41 PM IST

Ayyappa Gold Locket : శబరిమల ఆలయంలో పూజించే అయ్యప్ప స్వామి చిత్రం ఉన్న బంగారు లాకెట్ల పంపిణీ ప్రారంభమైంది. ఈ లాకెట్‌ను ఎలా బుక్ చేసుకోవాలి? ఎంత ధర ఉంటుందో తెలుసుకోండి.

శబరిమల అయ్యప్ప బంగారు లాకెట్
శబరిమల అయ్యప్ప బంగారు లాకెట్

సోమవారం విషు పండుగ శుభ దినం నాడు శబరిమల అయ్యప్ప ఆలయంలో భక్తులకు అయ్యప్ప స్వామి చిత్రంతో కూడిన బంగారు లాకెట్లను పరిచయం చేశారు. మీరు కూడా ఈ లాకెట్ పొందాలనుకుంటే శబరిమల సన్నిధి అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించడం ద్వారా దీన్ని బుక్ చేసుకోవచ్చు. లాకెట్లు 2, 4, 8 గ్రాముల బరువులలో లభిస్తాయి.

మెుదటి లాకెట్‌ ఏపీకి

శబరిమల గర్భగుడిలో అయ్యప్ప విగ్రహం ఉన్న బంగారు లాకెట్‌ను ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మణిరత్నం మొదటగా కొన్నాడు. ఈ కార్యక్రమంలో మంత్రి వీఎన్ వాసవన్, ట్రావెన్‌కోర్ దేవస్వం బోర్డు అధ్యక్షుడు ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు. ఆన్‌లైన్‌లో బుక్ చేసుకున్న వారిలో ముందుగా ఎంపికైన వ్యక్తి మణిరత్నం. అందుకే ఆయనకు మెుదటి లాకెట్‌ను అందజేశారు. విషు రోజున సన్నిధానం వద్ద జెండా చెట్టు కింద బంగారు లాకెట్ల పంపిణీని ప్రారంభించారు.

లాకెట్ ధరలు

మొదట ఆన్‌లైన్‌లో బుక్ చేసుకున్న భక్తుల నుండి ఎంపిక చేసిన వారికి లాకెట్‌ను అందజేశారు. పూజల తర్వాత భక్తులకు లాకెట్లను పంపిణీ చేశారు. దేవస్థానం బోర్డు రెండు, నాలుగు, ఎనిమిది గ్రాముల బరువున్న బంగారు లాకెట్లను విడుదల చేసింది. రెండు గ్రాముల బంగారు లాకెట్ ధర రూ. 19,300, నాలుగు గ్రాముల లాకెట్ ధర రూ. 38,600, ఎనిమిది గ్రాముల లాకెట్ ధర రూ. 77,200గా నిర్ణయించారు. భక్తుల డిమాండ్‌ను పరిగణనలోకి తీసుకుని దేవస్థానం బోర్డు లాకెట్‌లను ప్రవేశపెట్టింది.

ఇక్కడ బుక్ చేయాలి?

గత రెండు రోజుల్లో 100 మందికి పైగా భక్తులు వీటిని బుక్ చేసుకున్నారు. శబరిమల అయ్యప్ప స్వామి ప్రతిమ ఉన్న బంగారు లాకెట్‌ను ధరించడం చాలా మంది భక్తులకు ఉన్న కోరిక. దీనిని sabarimalaonline.org వెబ్‌సైట్ ద్వారా బుక్ చేసుకోవచ్చు. వెబ్‌సైట్ వెళ్లిన తర్వాత లాగిన్ అవ్వాలి. తర్వాత పైన నేరుగా గోల్డ్ లాకెట్ అని కనిపిస్తుంది. అందులోకి వెళ్లి బుక్ చేసుకోవచ్చు. అలా రిజర్వేషన్లు చేసుకునే వారు శబరిమల ఆలయాన్ని సందర్శించి అక్కడి పరిపాలనా కార్యాలయం నుండి లాకెట్‌ను సేకరించాలి.

Anand Sai

eMail

సంబంధిత కథనం

జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.

Best Web Hosting Provider In India 2024


Source link