Horror Movie: మ‌ల‌యాళం అడ్వెంచ‌ర్‌ హార‌ర్ మూవీ తెలుగులో ఫ్రీ స్ట్రీమింగ్‌ – నిధికి కోసం ద‌య్యాల బంగ‌ళాలో అడుగుపెడితే

Best Web Hosting Provider In India 2024

Horror Movie: మ‌ల‌యాళం అడ్వెంచ‌ర్‌ హార‌ర్ మూవీ తెలుగులో ఫ్రీ స్ట్రీమింగ్‌ – నిధికి కోసం ద‌య్యాల బంగ‌ళాలో అడుగుపెడితే

Nelki Naresh HT Telugu

Horror Movie: మ‌ల‌యాళం అడ్వెంచ‌ర్ హార‌ర్ మూవీ సైమ‌న్ డేనియ‌ల్ తెలుగు వెర్ష‌న్‌ను యూట్యూబ్‌లో ఫ్రీగా చూడొచ్చు. ఈ మ‌ల‌యాళం మూవీలో వినీత్‌కుమార్, దివ్య పిళ్లై హీరోహీరోయిన్లుగా న‌టించారు. స‌జ‌న్ ఆంటోనీ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు.

హారర్ మూవీ

Horror Movie: మ‌ల‌యాళం అడ్వెంచ‌ర్ హార‌ర్ మూవీ సైమ‌న్ డేనియ‌ల్ తెలుగులోకి వ‌చ్చింది. యూట్యూబ్‌లో ఈ మూవీ ఫ్రీగా స్ట్రీమింగ్ అవుతోంది. ఈ మ‌ల‌యాళం మూవీలో వినీత్‌కుమార్, దివ్య పిళ్లై హీరోహీరోయిన్లుగా న‌టించారు. స‌జ‌న్ ఆంటోనీ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు.

ట్విస్ట్‌లు…

2022లో మ‌ల‌యాళంతో పాటు త‌మిళంలో ఒకేసారి థియేట‌ర్ల‌లో ఈ మూవీ రిలీజైంది. ఈ మూవీ కాన్సెప్ట్‌తో పాటు కొన్ని ట్విస్ట్‌లు ఆడియెన్స్‌ను మెప్పించాయి. స్క్రీన్‌ప్లేతో పాటు హార‌ర్ ఎలిమెంట్స్ రొటీన్ కావ‌డంతో సైమ‌న్ డేనియ‌ల్ మూవీ బాక్సాఫీస్ వ‌ద్ద యావ‌రేజ్‌గా నిలిచింది. తెలుగు వెర్ష‌న్ మాత్రం డైరెక్ట్‌గా యూట్యూబ్‌లోనే రిలీజైంది.

బంగ‌ళాలో నిధి…

సైమ‌న్ డేనియ‌ల్ ఓ ఆర్కియాల‌జిస్ట్‌. అన్నామ‌లై ఏరియాలోని 1940కి చెందిన బ్రిటీష‌ర్ల కాలం నాటి బంగ‌ళాలో బంగ‌ళాలో నిధి ఉంద‌నే ప్ర‌చారం జ‌రుగుతుంటుంది. ఆ నిధి కోసం వ‌చ్చిన సైమ‌న్ డేనియ‌ల్ ఫ్రెండ్ సంతోష్ క‌నిపించ‌కుండాపోతాడు. సంతోష్ ను వె తుక్కుంటూ అన్నామ‌లై వ‌స్తాడు సైమ‌న్‌.

ఆ పాత కాలం నాటి బంగ‌ళాకు చెందిన మిస్ట‌రీని ఛేదించే క్ర‌మంలో సైమ‌న్ తెలుసుకున్న నిజాలేమిటి? అన్నామ‌లైలో సైమ‌న్‌కు ప‌రిచ‌య‌మైన స్టెల్లా ఎవ‌రు? ఆ బంగ‌ళా ఓన‌ర్స్ మార్గ‌రీటా, ఆమె కూతురు క్యాథ‌రిన్ ఆత్మ‌లు ఆ బంగ‌ళాలో నిజంగానే తిరుగుతున్నాయా? సంతోష్ ఎలా చ‌నిపోయాడు? ఆ బంగ‌ళాలోని నిధిని సైమ‌న్ ద‌క్కించుకున్నాడా? లేదా? అన్న‌దే ఈ మూవీ క‌థ‌.

నెగెటివ్ షేడ్స్….

ఈ సినిమాలో దివ్య పిళ్లై పాజిటివ్‌గా క‌నిపించే నెగెటివ్ షేడ్స్ క్యారెక్ట‌ర్‌లో క‌నిపించింది. ఆమె పాత్ర‌కు సంబంధించిన ట్విస్ట్‌లు ఈ సినిమాకు హైలైట్‌గా నిలిచాయి.

తెలుగులో తండేల్‌…

దివ్య పిళ్లై మ‌ల‌యాళంతో పాటు త‌మిళం, తెలుగు భాష‌ల్లో ప‌లు సినిమాలు చేసింది. తెలుగులో ఇటీవ‌ల రిలీజైన నాగ‌చైత‌న్య తండేల్ మూవీలో చంద్ర పాత్ర‌లో నాచుర‌ల్ యాక్టింగ్‌ను క‌న‌బ‌రిచింది. త‌గ్గేదేలే సినిమాలో హీరోయిన్‌గా క‌నిపించింది. త‌మిళంలో రాయ‌న్‌, కాథువ‌కుల రెండు కాద‌ల్ సినిమాలు ఆమెకు మంచి పేరు తెచ్చిపెట్టాయి.

ప్ర‌స్తుతం విజ‌య్ సేతుప‌తి ఏస్‌లో ఓ కీల‌క పాత్ర చేస్తోంది. మ‌ల‌యాళంలో ఓజ‌మ్‌, గ‌రుడ‌న్‌, మాస్ట‌ర్ పీస్‌తో పాటు ప‌లు సినిమాలు చేసింది. గ‌త వారం రిలీజైన మ‌మ్ముట్టి బ‌జూక‌లో ఓ ఇంపార్టెంట్ రోల్ చేసింది.

Nelki Naresh

TwittereMail
నెల్కి న‌రేష్ కుమార్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియ‌ర్ కంటెంట్ ప్రొడ్యూస‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. సినిమా, టీవీ రంగాల‌తో పాటు స్పోర్ట్స్‌కు సంబంధించిన రెగ్యుల‌ర్ అప్‌డేట్స్‌, రివ్యూల‌ను అందిస్తుంటారు. తెలంగాణ యూనివ‌ర్సిటీ లో మాస్ క‌మ్యూనికేష‌న్ అండ్ జ‌ర్న‌లిజంలో పీజీ చేశారు. గ‌తంలో న‌మ‌స్తే తెలంగాణ దిన‌ప‌త్రిక‌లో ప‌నిచేశారు. 2022 ఫిబ్ర‌వ‌రిలో హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024