





Best Web Hosting Provider In India 2024

Sharwanand: ఆయనతో తమన్నా 4 సినిమాలు చేశారంటే మాములు విషయం కాదు.. హీరోయిన్ అనడం ఇష్టం లేదు.. హీరో శర్వానంద్ కామెంట్స్
Sharwanand About Tamanna In Odela 2 Pre Release Event: తమన్నా నటించిన మైథలాజికల్ హారర్ థ్రిల్లర్ మూవీ ఓదెల 2 ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా యంగ్ హీరో శర్వానంద్ హాజరయ్యాడు. ఈ ఈవెంట్‌లో మిల్కీ బ్యూటీ తమన్నాపై శర్వానంద్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. తమన్నాను హీరోయిన్ అని పిలవడం ఇష్టం లేదన్నాడు.
Sharwanand About Tamanna In Odela 2 Pre Release Event: మిల్కీ బ్యూటి తమన్నా భాటియా నటించిన లేటెస్ట్ తెలుగు ఫిల్మ్ ఓదెల 2. మైథలాజికల్ హారర్ థ్రిల్లర్ జోనర్‌లో తెరకెక్కిన ఓదెల 2కి అశోక్ తేజ దర్శకత్వం వహించారు. డైరెక్టర్ సంపత్ నంది సూపర్ విజన్ అందించారు.
ముఖ్య అతిథిగా శర్వానంద్
ఏప్రిల్ 17న థియేటర్లలో గ్రాండ్‌గా ఓదెల 2 రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో ఇటీవల ఓదెల 2 ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా యంగ్ హీరో శర్వానంద్ హాజరయ్యాడు. ఓదెల 2 ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో హీరోయిన్ తమన్నాపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు శర్వానంద్.
అరుంధతి, అమ్మోరూ చూసినట్లుగా
హీరో శర్వా మాట్లాడుతూ.. “అందరికీ నమస్కారం. కొన్ని కొన్ని సినిమాలు ప్లాన్ చేయాల్సిన అవసరం లేదు. ఆ మంచి వాటంత అదే జరిగిపోతుంది. ఓదెల 2 టీజర్ చూడగానే అరుంధతి, అమ్మోరు సినిమాలు చూసిన ఫీలింగ్ వచ్చింది. ఏదో మ్యాజిక్ జరగబోతుందనే ఫీలింగ్ నాకుంది” అని అన్నాడు.
రెండు దశాబ్ధాలుగా అంటే
“సంపత్ నంది గారితో ఏడాదిగా ట్రావెల్ చేస్తున్నాను. ఆయన ఒక అడిక్షన్. తమన్నా గారు ఆయనతో నాలుగు సినిమాలు చేశారంటే మామూలు విషయం కాదు. తమన్నా గారిని హీరోయిన్ అని పిలవడం నాకు ఇష్టం లేదు. తను వండర్‌ఫుల్ ఆర్టిస్ట్. రెండు దశాబ్దాలుగా హీరోయిన్‌గా ఉండడం మామూలు విషయం కాదు” అని తమన్నాపై శర్వానంద్ కామెంట్స్ చేశాడు.
ఓపెనింగ్స్ అదిరిపోతాయని
“ఒక మాస్ సినిమాకి ఎలా అయితే ఆడియన్స్ వెయిట్ చేస్తారో ఈ సినిమా కోసం ఆడియన్స్ అంతా ఈగర్‌గా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా ఓపెనింగ్స్ అదిరిపోతాయని ఎందుకో నాకు స్ట్రాంగ్ ఫీలింగ్. కొన్ని సినిమాలను ఆడియన్స్ డెఫినెట్‌గా చూడాలని ముందే ఫిక్స్ అయిపోతున్నారు. ఓదెల 2 కూడా అలాంటి సినిమానే. ఈ సినిమాకి నేను వెళ్తాను. ఆడియన్స్ కూడా వెళ్దామని ఫిక్స్ అయ్యారని నమ్ముతున్నాను” అని శర్వానంద్ అభిప్రాయం వ్యక్తం చేశాడు.
ఈ సమ్మర్‌కి ఇదే బ్లాక్ బస్టర్
“మధు గారికి టీమ్ అందరికీ ఆల్ ద వెరీ బెస్ట్. ఈ సినిమా టీజర్ చూడగానే నాకు నచ్చింది సౌందర్ రాజన్ గారి విజువల్స్. మంచి సినిమా చేశారు. బ్లాక్ బస్టర్ కొట్టాలి. ఈ సమ్మర్‌కి ఇదే బ్లాక్ బస్టర్ అవుతుందని నా నమ్మకం. విష్ యు ఆల్ ది బెస్ట్” అని ఛార్మింగ్ స్టార్ శర్వానంద్ తన స్పీచ్ ముగించాడు.
విజువల్ ట్రీట్‌లా
ఇదే ఈవెంట్‌లో ఆర్ట్ డైరెక్టర్ రాజీవ్ నాయర్ మాట్లాడుతూ.. “సంపత్ నంది గారితో కలిసి వర్క్ చేయడం గొప్ప అవకాశంగా భావిస్తున్నాను. ఈ సినిమా కోసం వండర్‌ఫుల్ యూనివర్స్ క్రియేట్, రీ క్రియేట్ కూడా చేసాం. డెఫినెట్‌గా ఈ సినిమా ఒక విజువల్ ట్రీట్‌లా ఉండబోతోంది. ఈ సినిమా గొప్ప సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను” అని అన్నారు. కాగా, ఓదెల 2 మూవీ యూనిట్ అంతా ఈ ప్రీ రిలీజ్ వేడుకలో పాల్గొన్నారు.
సంబంధిత కథనం