





Best Web Hosting Provider In India 2024

Gunde Ninda Gudi Gantalu: సెంటిమెంట్‌తో గుండెలు పిండేసిన బాలు -రోహిణి పార్లర్ సీక్రెట్ రివీల్ -భయంతో వణికిన మనోజ్
Gunde Ninda Gudi Gantalu: గుండె నిండా గుడి గంటలు ఏప్రిల్ 16 ఎపిసోడ్‌లో రోహిణి బ్యూటీ పార్లర్ అమ్మేసిన నిజం బాలుకు తెలిసిపోతుంది. ప్రభావతి పార్లర్ ప్రస్తుతం క్వీన్ పార్లర్‌గా మారిందని, రోహిణి అందులో ఎంప్లాయ్‌గా మాత్రమే పనిచేస్తుందనే సంగతి బయటపడుతుంది.
పల్లెటూళ్లో ఉన్నన్ని రోజులు సరదాగా గడపాలని సత్యం ఫ్యామిలీ మెంబర్స్ ఫిక్సవుతారు. వారి చేత కొన్ని గేమ్స్ ఆడిస్తుంది సుశీల. ఇందులో భాగంగా ట్రూత్ అండ్ డేర్ గేమ్ ఆడతారు. ఈ గేమ్‌లో భాగంగా శృతికి ఓ టాస్క్ ఇస్తాడు బాలు. మీ మమ్మీకి ఫోన్ చేసి నీకు నిలువెళ్ల పొగరు ఉందని, ఎందుకమ్మా అని అడగమని అంటాడు.
శోభన ఫైర్….
శృతిని పెళ్లిచేసుకున్నప్పుడు మా అత్త నన్ను బాగా తిట్టిందని, ఇప్పుడు ఫోన్ చేయాల్సిందేనని రవి పట్టుపడతాడు. తప్పనిసరిగా శృతి తన తల్లి శోభనకు ఫోన్ చేసి బాలు చెప్పిన మాట అంటుంది. శృతి అన్న మాటలు వినగానే కోపంతో కూతురిపై ఎగిరిపడుతుంది. శోభన.
మనోజ్ బిల్డప్పులు…
ట్రూత్ అండ్ డేర్‌లో భాగంగా మనోజ్‌కు టాస్క్ ఇస్తాడు బాలు. ఐ యామ్ ఆల్వెస్ డేర్ అని బిల్డప్‌లు ఇస్తాడు మనోజ్. వీధి చివరలో ఉన్న మామిడి చెట్టు నుంచి ఓ కాయ కోసుకురమ్మని మనోజ్‌కు టాస్క్ ఇస్తాడు బాలు. వాడు ఎన్నో చెట్లు ఎక్కాడు…ఈ మామిడి చెట్టు ఎక్కడం ఓ లెక్క అని మనోజ్‌కు సపోర్ట్ చేసి మాట్లాడుతుంది ప్రభావతి.
చిన్నప్పుడు ఆ చెట్టుపై దయ్యం ఉందని ప్రచారం జరిగిన సంగతి మనోజ్‌కు గుర్తొస్తుంది. మనోజ్‌ను సీక్రెట్‌గా బాలు ఫాలో అవుతాడు. తెల్ల దుప్పటి కప్పుకొని బెదిరిస్తాడు. బాలును చూసిన మనోజ్ దయ్యం అని అరుస్తూ పారిపోతూ ఇంట్లోకి వస్తాడు. అతడిని చూసి అందరూ నవ్వుకుంటారు.
చివరగా అబద్ధం…
ఆ తర్వాత ట్రూత్ ఆర్ డేర్ గేమ్ టాస్క్‌ను రోహిణికి ఇస్తాడు రవి. డేర్ అంటే ప్రాణాల మీదకు వచ్చే పనులు చేయమంటారని భయపడుతుంది. ట్రూత్ అని అంటుంది. పార్లరమ్మ చెప్పినన్నీ నిజాలు ప్రపంచంలో ఏ స్త్రీ మూర్తి చెప్పి ఉండదని బాలు అంటాడు.
ఆఖరి సారి మీరు ఎప్పుడు అబద్ధం చెప్పారు అని రోహిణిని అడుగుతాడు రవి. మనోజ్‌ను పెళ్లి చేసుకున్నప్పటి నుంచి ఈ రోజు వరకు తాను చెప్పినవన్నీ అబద్దాలేనని, నిజాలు ఎప్పుడు చెప్పలేదని మనసులో అనుకుంటుంది రోహిణి.
బాలుపై నింద…
ప్రపంచంలో నిజాలు ఉన్నట్లు అబద్దాలు ఉన్నాయి. అబద్దాల వల్ల ఎవరికి హానీ కలగకపోతే అబద్ధం చెప్పొచ్చు అని ఏదేదో మాట్లాడుతుంది. మేము అడిగిన దానికి నువ్వు చెప్పిన దానికి సంబంధం లేదని మీనా అంటుంది. మా మలేషియా మావయ్య విషయంలో ఒక్క అబద్ధం ఆడానని రోహిణి అంటుంది.
మనోజ్‌కు తాగించింది బాలు కాదు…మా మావయ్య అన్న సంగతి బయటపెడుతుంది.రోహిణి మావయ్యే తనకు మందు తాగించాడని మనోజ్ ఒప్పుకుంటాడు. నిజం తెలిసి కూడా తాను చెప్పలేకపోయానని అంటుంది రోహిణి. నిజం తెలుసుకోకుండా బాలును కొట్టినందుకు పశ్చాత్తాపపడుతుంది సుశీల. సారీ చెబుతుంది.
తన కుటుంబం బాగుండాలి…
మీనాకు ట్రూత్ అండ్ డేర్ టాస్క్ ఇస్తుంది శృతి. ట్రూత్ అని మీనా అంటుంది. తన కుటుంబం బాగుండాలని చెబుతుంది. తమ్ముడికి ఉద్యోగం రావాలని, చెల్లికి మంచి సంబంధం కుదరాలని అంటుంది. అవి తప్ప తనకంటూ ఏ ఆశలు లేవని చెబుతుంది.
బాలులో మంచి లక్షణాలు…
ట్రూత్ అండ్ డేర్‌లో బాలులో ఉండే మూడు మంచి లక్షణాలు చెప్పమని ప్రభావతికి టాస్క్ ఇస్తుంది సుశీల. వాడికి వాళ్ల నాన్న అంటే ప్రాణం…వాళ్ల నాన్న కోసం ఎంతకష్టమైనా భరిస్తాడు…ఏమైనా చేస్తాడు అని అంటుంది. ఎక్కువ సంపాదన కోసం ఆశపడడు. వాడి కష్టార్జితాన్నే నమ్ముకుంటాడు.
ఎదుటివాళ్లకు కష్టమని, తనకు నష్టమని తెలిసిన నిజమే మాట్లాడుతాడని అంటుంది. జీవితంలో మొదటిసారి ప్రభావతి మనసులో బాలుపై ఎలాంటి అభిప్రాయం ఉందో తెలిసిందని సత్యం అంటాడు. అమ్మ అంటే ఎప్పటికీ అమ్మే కదా అని చెబుతాడు. తల్లి మాటలతో బాలు ఎమోషనల్ అవుతాడు.
అవన్నీ నిజమైతే బాగుండేది…
ఇప్పుడు నేను చెబుతాను…అమ్మ గురించి…ఆమె ప్రేమ గురించి అని బాలు అంటాడు. చిన్నప్పుడు అమ్మతో తనకు ఉన్న జ్ఞాపకాలు చెబుతాడు. నాకు జ్వరమస్తే మా అమ్మ నా తలను ఒడిలో పెట్టుకొని రాత్రి మొత్తం మేలుకొని ఉండేది. నాకు జ్వరం తగ్గాలని ముడుపులు క ట్టేది అని అంటాడు.
నిద్రలో భయపడితే నన్ను గుండెలకు హత్తుకునేది. జాతరకు వెళితే…నేను ఎక్కడ తప్పిపోతానో అని నా చేయి విడిచిపెట్టేది కాదు అని బాలు అంటాడు. నేను చెప్పినవన్నీ నిజమైతే ఎంతో బాగుండేది, నిజంగా జరిగి ఉంటే ఇంకా ఎంతో బాగుండేది అని బాలు ఎమోషనల్ అవుతాడు. బాలు మాటలతో ప్రభావతి కన్నీళ్లు పెట్టుకుంటుంది.
అమ్మ కోసం ఎదురుచూశా..
ఏమైందో తెలియదు చిన్నప్పుడే మా అమ్మ నన్ను బామ్మ దగ్గర వదిలిపెట్టి వెళ్లిందని బాలు అంటాడు. రోజు అమ్మ కోసం గడప దగ్గర కూర్చొని ఎదురుచూసేవాడిని. అప్పుడు వెళ్లిన మా అమ్మ ఇప్పటికీ తిరిగిరాలేదని చెబుతాడు.
మా అమ్మ తప్పిపోయిందని, నేను ఇంకా ఆ చిన్నప్పటి అమ్మ కోసం వెతుకుతూనే ఉన్నానని బాలు అంటాడు. దానికి కారణం ఒకరిపై పడాల్సిన నింద అని బాలు అనగానే సత్యం అతడి మాటలను ఆపేస్తాడు. బాలు ఎక్కడ నిజం బయటపెడతాడోనని మనోజ్ కంగారు పడతాడు.
ప్రభావతి కన్నీళ్లు…
వాళ్ల అమ్మ ఎక్కడ తప్పిపోయిందో ఈ తల్లీకొడుకులకే తెలుసునని ప్రభావతి అంటుంది. వాళ్ల అమ్మ ఏ ఏటిలోనే పడి కొట్టుకుపోయి ఉంటుందని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఎప్పుడు అత్తయ్యను ఏడిపించే బాలు…ఈ రోజు అందరిని ఏడిపించాడని రోహిణి అంటుంది. బాలు మనసులో ఇంత బాధ ఉందని తమకు ఈ రోజే తెలిసిందని రవి, శృతి అంటారు.
నష్టజాతకులు…
బాలు అన్నం తినకుండా బయట ఒంటరిగా కూర్చొని అంటాడు. తన మనసులో చాలా ఏళ్లుగా దాచుకున్న బాధను బయటపెడతాడు. తన కథలో అమ్మ లేదని, తనకు మాత్రమే లేదని అంటాడు. అమ్మ ప్రేమ దొరకని బిడ్డలు కొందరు ఉంటారు. నష్టజాతకులు…నాలాంటి వాళ్లు అని చెబుతాడు.
మీరెప్పుడు ఇంత నిరాశగా మాట్లాడటం నేను చూడలేదని బాలుతో మీనా అంటుంది. మీ అమ్మ మిమ్మల్ని ద్వేషించడం వెనుక ఏదో బలమైన కారణం ఉండే ఉంటుందని అదేంటో చెప్పమని బాలును అడుగుతుంది మీనా.
పాత జ్ఞాపకం…
తన అన్నయ్య నీళ్లలో పడి కొట్టుకుపోయిన పాత జ్ఞాపకం గుర్తుచేసుకుంటాడు. తనపై పడిన నిందను గుర్తు చేసుకొని కోపం పట్టలేకపోతాడు. వీడిని తీసుకెళ్లి జైలులో పెట్టండి అని తల్లి అన్న మాటలు గుర్తుకొస్తాయి. మీనాకు ఆ గతం గురించి చెప్పలేకపోతాడు.
బాలు అంటేనే కోపం…
మనుషుల మీద ప్రేమ లేకపోతేనే కోపం పెరుగుతుంది. బాలు అంటేనే కోపం కనిపిస్తుంది. ఆ కోపమే అందరికి కనిపిస్తుంది. మీరు ఎవరికి కనిపించడం లేదని మీనా అంటుంది. అది నేను వేసుకున్న ముసుగు అని బాలు బదులిస్తాడు. అందరికి నాన్న అనేది నమ్మకం. అమ్మ అన్నది నిజం. కానీ నా విషయంలో అమ్మ కూడా నమ్మకమే అయ్యిందని బాధ పడతాడు.
మనోజ్, రవి, మౌనిక పుట్టిన కడుపులో నుంచే నేను పుడితే…వాళ్లకు దక్కిన ప్రేమ నాకు ఎందుకు దక్కడం లేదని బాధగా ఉంటుందని బాలు అంటాడు. కష్టపడని కొడుకును, తండ్రికి ద్రోహం చేసే కొడుకును ప్రేమిస్తుంది.
కానీ కష్టం వస్తే అండగా నిలబడే కొడుకుకను, కష్టపడే కొడుకును మాత్రం ఎందుకు దగ్గరకు తీసుకోదనే ప్రశ్నకు పాతికేళ్లుగా తనకు సమాధానం దొరకలేదని అంటాడు. ఇప్పటివరకు ఆ ప్రశ్నకు జవాబుతో పాటు చెప్పేవాళ్లు దొరకలేదని బాలు ఎమోషనల్‌గా బదులిస్తాడు.
నిజం తెలుసుకున్న బాలు…
బాలు కారులో రోహిణి బ్యూటీ పార్లర్ ఓనర్ జర్నీ చేస్తుంది. డబ్బులు ఇవ్వకుండా ఆమె పార్లర్‌లోకి వెళ్లిపోతుంది. ఆమె కోసం పార్లర్‌లోకి వెళతాడు బాలు. ఆ పార్లర్‌కు రోహిణి ఓనర్ కాదనే నిజం బయటపడుతుంది.
పార్లర్‌ను రోహిణి అమ్మేసిందని, ప్రస్తుతం రోహిణి పార్లర్‌లో ఓ ఎంప్లాయ్‌గానే పనిచేస్తుందనే నిజం కూడా బాలుకు తెలుసుకుంటాడు. అక్కడితో నేటి గుండె నిండా గుడి గంటలు సీరియల్ ముగిసింది.
సంబంధిత కథనం