Karthika Deepam Today Episode April 16: జ్యోత్స్న కొత్త ప్లాన్.. నాన్న మాటలకు కాంచన గుండెబద్దలు.. శ్రీధర్ వెటకారం

Best Web Hosting Provider In India 2024

Karthika Deepam Today Episode April 16: జ్యోత్స్న కొత్త ప్లాన్.. నాన్న మాటలకు కాంచన గుండెబద్దలు.. శ్రీధర్ వెటకారం

Karthika Deepam Today Episode April 16: దీపను జైలు నుంచి బయటికి రానీయకుండా ప్లాన్ ఆలోచిస్తుంది జ్యోత్స్న. కాల్ చేసిన కాంచనను చాలా మాటలు అంటారు సుమిత్ర, శివన్నారాయణ. దీంతో కాంచన గుండె పగిలేలా ఏడుస్తుంది. కార్తీక్ ఇంటికి శ్రీధర్ వస్తాడు. కార్తీక దీపం 2 నేటి ఎపిసోడ్‍లో ఏం జరిగిందో ఇక్కడ చూడండి.

Karthika Deepam Today Episode April 16: జ్యోత్స్న కొత్త ప్లాన్.. నాన్న మాటలకు కాంచన గుండెబద్దలు.. శ్రీధర్ వెటకారం (Photo: Hotstar)

కార్తీక దీపం 2 నేటి (ఏప్రిల్ 16, 2025) ఎపిసోడ్‍లో ఏం జరిగిందంటే.. దీపను జైలును నుంచి బయటికి రాకుండా చేయాలని సుమిత్ర అంటుంది. ఆ దీప మళ్లీ ఇంటి ముఖం చూడకూడదు సుమిత్ర, దాని బతుకు జైలులోని గడిచిపోవాలని పారిజాతం అంటుంది. జరగబోయేది అదే గ్రానీ అని జ్యోత్స్న చెబుతుంది. తాతా.. పోదాం పదా అని అంటుంది. నేను ఎక్కడికీ రాలేను.. కొడుకు దగ్గరే ఉంటానని ఏడుస్తాడు శివన్నారాయణ. దశరథ్‍ బదులు దీప నన్ను కాల్చినా బాగుండేదంటూ నాటకాలు ఆడుతుంది పారిజాతం. దీప.. విశ్వాసం లేని ఆయుధం అని సుమిత్ర అంటుంది. సాయం చేసిన చేతికే గాయం చేసిందని మాట్లాడుతుంది.

జ్యోత్స్న కొత్త ప్లాన్

తప్పు దీపది కాదు.. మనది అని సుమిత్ర అంటుంది. సరి చేసుకుందాం మమ్మీ అని జ్యోత్స్న చెబుతుంది. దీప చేయాల్సింది చేసింది.. మనం చేయాల్సింది చేయాలి అని అంటుంది. “దాని కూతురు జోలికి వస్తే భర్తనైనా చంపడానికి సిద్దమంది కదా.. నా తండ్రి జోలికి వస్తే నాది అలాంటి రియాక్షనే ఉంటుంది కదా” జ్యో అంటుంది. ఏదో ఒకటి చేసి దీపను ఈ కేసు నుంచి కార్తీక్ తప్పిస్తాడే అని పారిజాతం అంటుంది. కేసు నుంచి తప్పించడం కాదు.. దీపకు బెయిల్ కూడా రాకుండా చేస్తానని జ్యో అంటుంది.

జ్యోత్స కొత్త ప్లాన్.. తాతకు చెప్పి..

మమ్మీని చూసుకో.. నాకు బయట చిన్న పని ఉంది.. అది చూసుకొని ఎస్‍ఐను కలిసి వస్తా అని పారిజాతానికి జ్యోత్స్న చెబుతుంది. నీతో మాట్లాడాలని పారు అడిగితే.. తర్వాత అని జ్యో అంటుంది. ఇంతలో తాత శివన్నారాయణతో జ్యో మాట్లాడుతుంది. దీప జైలు నుంచి బయటికి రాకుండా ఏదో ప్లాన్ చేసినట్టు అర్థమవుతోంది. తన ప్లాన్‍ను తాత శివన్నారాయణకు చెబుతుంది. అయితే, ఆ ప్లాన్ ఏదో ఇప్పటికీ తెలియకుండా మ్యూజిక్‍తో కవర్ చేశారు మేకర్స్. ఇంతకీ జ్యోత్స్న తాతతో ఏం మాట్లాడుతోందో అని పారు ఆలోచిస్తూ ఉంటుంది. సరేనమ్మా నువ్వే కలువు, నేను ఫోన్ చేసి మాట్లాడతానని శివన్నారాయణ అంటాడు.

బుల్లెట్ నీ గుండెకు తగులుతుంది

జ్యోత్స్న వెళ్లి పోతుంటే పారిజాతం పిలుస్తుంది. నువ్వు బాధపడేది నిజమేనా.. నాటకమా అని సూటిగా అడుగుతుంది పారు. “దశరథ్ నా కన్నతండ్రి కాకపోవచ్చు. కానీ ఆయన పంచిన ప్రేమ నాలో ఉంటుంది కదా” అని జ్యో అంటుంది. దీపను ఇరికించే ప్లాన్‍లో ఇది భాగం కాదు కదా అని పారు అడుగుతుంది. అది ఇది కాదు, కానీ అనవసరంగా వచ్చి దీప నాకు ఓ అవకాశం ఇచ్చింది, వదిలిపెట్టను గ్రానీ అని జ్యో అంటుంది. మీ తాతకు తెలికుండా చేయ్, నీ నాటకాలన్నీ బయటపడితే బుల్లెట్ దశరథ్‍కు కాదు నీ గుండెకు తగులుతుంది అని జ్యోను హెచ్చరిస్తుంది పారిజాతం. తనకు ఏం చేయాలో క్లారిటీ ఉందని, సైలెంట్‍గా ఉండు అని జ్యో అంటుంది.

దీప అయితే బయటికి రాదని జ్యో చెబుతుంది. దీన్ని చూస్తుంటే నాకే భయమేస్తోంది, మనకెందుకు చెప్పే వరకు సైలెంట్‍గా ఉందామని పారు అనుకుంటుంది.

దశరథ్ స్పృహలోకి వస్తేనే..

దశరథ్ స్పృహలోకి వచ్చారా అని కానిస్టేబుల్‍ను అడుగుతుంది జైలులో ఉన్న దీప. ఇంకా స్పృహలోకి రాలేదని కానిస్టేబుల్ చెబుతుంది. నీకు బయటికి వచ్చే రాత ఉంటే ఆయన బతుకుతారని అంటుంది. నా కోసం కాదు సుమిత్రమ్మ కోసం బతకాలని దీప అనుకుంటుంది.

బంధం చచ్చిపోయింది

మా అన్నయ్యకు ఏమీ కాకూడదు, మా అన్నయ్య బతకాలి అంటూ దశరథ్ పరిస్థితి తలుచుకొని ఏడుస్తుంటుంది కాంచన. సుమిత్రకు కాల్ చేసి పరిస్థితి తెలుసుకోవచ్చు కదా అని అనసూయ అంటుంది. ఫోన్ వదిన దగ్గరలేనట్టుంది, కాల్ లిఫ్ట్ చేయడం లేదని అంటుంది. శివన్నారాయణకు కాల్ చేయాలని అనసూయ చెబితే.. అంత ధైర్యం రావడం లేదని కాంచన అంటుంది. మీ పిన్ని పారిజాతానికి ఫోన్ చేసి మాట్లాడాలని చెబుతుంది. దీంతో ఫోన్ చేస్తుంది కాంచన.

నీ దగ్గర ఫోన్ లేదు కదా.. నీ కోసమే కాంచన చేసిందేమో అని సుమిత్రతో పారిజాతం చెబుతుంది. కాల్ కట్ చేయాలని కోపంగా అంటాడు శివన్నారాయణ. మళ్లీ కాల్ చేస్తుంది కాంచన. ఎందుకు ఫోన్ చేసిందో నువ్వు అడుగు అని సుమిత్రకు ఇస్తుంది పారిజాతం. పిన్ని ఒక్కసారి వదినకు ఇస్తావా అని కాంచన అడుగుతుంది. సుమిత్రనే మాట్లాడుతుంది. “ఎందుకు నీ కొడలు చేసిన పనికి ఎంత బాధపడుతున్నానో తెలుసుకునేందుకా” అని సుమిత్ర అంటుంది. అన్నయ్యకు ఎలా ఉంది వదినా అని కాంచన అడుగుతుంది. నీ కొడలు చేయాలనుకున్నది ఇంకా జరగలేదులే.. అని మాటలు అంటుంది సుమిత్ర.

ఇంకెప్పుడు మాకు ఫోన్ చేయవద్దని కాంచనకు సుమిత్ర చెబుతుంది. వదినా అని బాధగా అంటుంది కాంచన. “ఇంకెప్పుడు నువ్వు అలా పిలవొద్దు. ఎందుకంటే మన మధ్య ఉన్న వదినా అన్న బంధం చచ్చిపోయింది. మీరంతా కలిసే నా భర్తకు ఈ గతి పట్టించారు” అని సుమిత్ర అరుస్తుంది. వదినా కావాలంటే నా గొంతు నులిమి చంపెయ్.. కానీ ఇలా మాట్లాడుతుంటే ఊరిపి ఆడడం లేదని ఏడుస్తుంది కాంచన. ముందు అన్నయ్యకు ఎలా ఉందో చెప్పు అని కాంచన అడుగుతుంటే.. సుమిత్ర దగ్గరి నుంచి ఫోన్ లాక్కుంటుంది పారిజాతం. నీకు కొంచెమైనా సిగ్గు ఉందా అంటూ నోటికొచ్చినట్టు మాట్లాడుతుంది. బాధ పడుతున్నట్టు డ్రామా కొనసాగిస్తుంది పారు.

ఆస్తి నీది అవుతుందని అనుకుంటున్నావా..

ఏ దేవుడైనా కరుణిస్తే తప్ప వాడు బతికే అవకాశం లేదు, ఈ నిజం మీకు ఎలా చెప్పాలి అని శివన్నారాయణ మనసులోనే బాధపడుతుంటాడు. అన్నయ్యను చూసేందుకైనా నువ్వు రాలేదు అని సూటిపోటి మాటలు అంటుంది పారిజాతం. అన్నయ్య పోతే పూర్తి ఆస్తి నీకే వస్తుందని అనుకుంటున్నావేమో అంటూ అక్కసుగా మాట్లాడుతుంది. దీంతో అస్తమానం ఆస్తి..ఆస్తి అని చస్తారే అని పారిజాతంపై కోప్పడతాడు శివన్నారాయణ. అసలు ఆ మనిషిలో అంత సేపు మాట్లాడడం అవసరమా, ఆస్తి గురించి ఆ మనిషి మాట్లాడిందా అని అరుస్తాడు.

నా ఆఖరి కోరిక.. తలబాదుకుంటూ ఏడ్చిన కాంచన

ఫోన్ తీసుకొని కాంచనతో మాట్లాడతాడు శివన్నారాయణ. మా పరువు తీశారు.. ఇప్పుడు ప్రాణాలు తీస్తున్నారని కోప్పడతాడు. నాన్న అని కాంచన బాధగా అంటే.. “నిన్ను కన్న పాపానికి మీ అమ్మ చచ్చిపోయి సుఖంగా పోయింది కానీ.. బతికి ఉంటే ఎందుకు కన్నానా అని ఏడ్చేది” అని శివన్నారాయణ అంటాడు. దీంతో అయ్యే అంటూ తలబాదుకుంటూ ఏడుస్తుంది కాంచన. తండ్రిగా నా ఆఖరి కోరిక అని శివన్నారాయణ అంటే.. అలా మాట్లాడొద్దని కాంచన అంటుంది. “నువ్వు ఎప్పుడూ నాకు కనిపించకు” అని శివన్నారాయణ అంటాడు. దీంతో బోరున విలపిస్తుంది కాంచన.

నేనెందుకు బతకాలి

ఆగు చెల్లెమ్మ.. వాళ్లేదో ఆవేశంలో అన్నారని ఏడుస్తున్న కాంచనతో అనూసయ అంటుంది. నా కన్న తండ్రే అసహ్యించుకున్నాక నేనెందుకు బతకాలి అంటూ మరింత ఏడుస్తుంది కాంచన. తల బాదుకుంటూనే ఉంటుంది. “కోడలేమో హత్యా నేరం మీదేసుకొని పోలీస్ స్టేషన్‍లో ఉంది.. అన్నయ్యేమో చావుబతుల మధ్య ఆసుపత్రిలో ఉన్నాడు. భార్యను ఎలా కాపాడుకోవాలో తెలియక నా కొడుకు రోడ్లు పట్టుకొని తిరుగుతున్నాడు. వదిన, పిన్ని, నాన్న అందరూ నన్ను అసహ్యించుకొని మాట్లాడుతున్నాను. నేనెందుకు బతకాలి” అని కాంచన ఏడుస్తుంది. కష్టాలు అందరికీ వస్తాయంటూ అనసూయ సముదాయిస్తుంది. దీప అందరి గురించి ఆలోచించి బతుకు నాశనం చేసుకుందని అంటుంది. మనం ఏమీ చేయలేమని బాధపడుతుంది. కుబేర ఫొటో చూసుకుంటూ ఏడుస్తుంది.

అలా అయితేనే నిజం బయటపడుతుంది

దశరథ్ కళ్లు తెరిస్తేనే నిజాలు బయటపడతాయి.. ఆయనే నన్ను కాపాడతారు అని జైలులో కూర్చొని ఆలోచిస్తుంటుంది దీప. “ఆయన గుండెకు తగిలిన బుల్లెట్ నేను పేల్చింది కాదని తెలుస్తుంది. ఆయన తొందరగా కోలుకోవాలి” అని మనసులో అనుకుంటుంది.

కాంచనను క్షమాపణ అడిగిన కావేరి

కాంచన ఇంటికి కావేరి వస్తుంది. నన్ను క్షమించు అక్కా అని కావేరి అడుగుతుంది. “దీపకు నేను జ్యోత్స్న గురించి చెప్పకపోయి ఉంటే ఆ ఇంటికి వెళ్లేది కాదు. ఇంత ఘోరం జరిగేది కాదు” అని కావేరి అంటుంది. అందుకే ఆడపెత్తనం.. బోడిపెత్తనం అంటారంటూ శ్రీధర్ ఇంట్లోకి వస్తాడు. మిమల్ని రావొద్దన్నాం కదా అని కాంచన కోప్పడుతుంది. ధశరథ్ తన వెటకారపు మాటలు కొనసాగిస్తాడు.

అనసూయ వార్నింగ్.. కార్తీక్ విజిల్

భార్యలందరూ మొగుళ్ల మాటలు వినడం మానేశారని కాంచన, కావేరి, అనూసయను ఉద్దేశించి వెటకారంగా అంటాడు శ్రీధర్. ఇంక కార్తీక్ గాడి భార్య అంటే అంటూ దీప గురించి ఎత్తబోతాడు. అంతటితో ఆగండి.. నా మేనకోడలి గురించి తప్పుగా మాట్లాడితే చోపురు కట్టలు విరిగిపోతాయంటూ అనసూయ వార్నింగ్ ఇస్తుంది. దీంతో విజిల్ వేసుకుంటూ లోపలికి వస్తాడు కార్తీక్. మీరు ఇంతకాలం ఇలా గట్టిగా మాట్లాడకనే ఈయన అచ్చోసిన ఆంబోతులా తిరుగుతున్నాడని తండ్రి శ్రీధర్‌ను అంటాడు కార్తీక్.

శ్రీధర్ మాత్రం తన నోటిదూలతో మాటలు అంటూనే ఉంటాడు. ఎక్కడైనా ఏదైనా జరిగితే వాలిపోతావని.. నా ఉసిరి తగులుతుందని చెప్పేందుకు వచ్చావా అని కార్తీక్ అంటాడు. ఆసుపత్రికి వెళ్లకపోయావా అని అడుగుతుంది. వెళితే మీ తాత ఆయనను ఇంటికి వరకు పరుగెత్తించి కొడతారని అనసూయ అంటుంది. తోడబుట్టిన అన్నయ్య ఆసుపత్రిలో ఉంటే మీ అమ్మ చేసుకుందుకు వెళ్లిందా అని కార్తీక్‍తో శ్రీధర్ అంటాడు. వెళితే తాత ఊరుకుంటాడా అని కార్తీక్ బదులిస్తాడు. ఎన్నిసార్లు తిట్టినా నేను రావట్లేదా అని శ్రీధర్ అంటే.. వీళ్లు అత్మాభిమానం ఉన్న మనుషులండి అంటూ పంచ్ వేస్తుంది కావేరి. నేను బరి తెగిలించిన మనిషినంటావ్ అని శ్రీధర్ అంటాడు.

బావ బతకడం కష్టమేనంట

మమల్ని ఇలా వదిలేయండని కాంచన అంటుంది. నీ కోడలు ఇరుక్కుంది మర్డర్ కేసులో అని శ్రీధర్ అంటాడు. ఆసుపత్రిలో తెలిసిన నర్సు ఉంటే ఫోన్ చేసి కనుకున్నానని, దశరథ్ బావ బతకడం కష్టమేనంట అని శ్రీధర్ చెబుతాడు. దీంతో అందరూ కంగారు పడతారు. పొరపాటున బావకు ఏదైనా జరిగితే దీపకు ఉరిశిక్షే అని శ్రీధర్ అంటాడు.

ఒక్క సాక్ష్యమైనా ఉందా..

మామయ్యకు బుల్లెట్ తరిగిలినప్పుడు పక్కనే ఉన్నట్టు మాట్లాడకు అంటూ అరుస్తాడు కార్తీక్. దీప వల్ల ఏ తప్పు జరగలేనని నమ్ముతున్నానని చెబుతాదు. మన బంగారం మనకు మంచిదేనని, అవతలి వారు నమ్మాలి కదా అని శ్రీధర్ అంటాడు. దీప తప్పు చేయలేదని నిరూపించేందుకు ఒక్క సాక్ష్యమైనా ఉందా అని శ్రీధర్ ప్రశ్నిస్తాడు. ఆధారాలు ఉన్నా మీ తరఫున కోర్టులో వాదించి, దీపను బయటికి తీసుకొచ్చి మంచి లాయర్ కూడా మీ తరఫున లేరని శ్రీధర్ అంటాడు. వాళ్ల తరఫున లాయర్ భగవాన్ దాస్ ఉన్నాడని చెబుతాడు. పొరపాటున వాడు నీ భార్యకు వ్యతిరేకంగా కేసు వాదిస్తే దీపకు యావజ్జీవ శిక్షే అని శ్రీధర్ గట్టిగా చెబుతాడు. దీంతో కార్తీక్ కంగారుగా చూస్తాడు. దీంతో కార్తీక దీపం 2 నేటి (ఏప్రిల్ 16) ఎపిసోడ్ ముగిసింది. దీప బయటికి రాకుండా జ్యో ఎలాంటి ప్లాన్ వేసిందో చూడాలి.

Chatakonda Krishna Prakash

TwittereMail
చాటకొండ కృష్ణ ప్రకాశ్.. హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. ఇక్కడ ప్రస్తుతం ఎంటర్‌టైన్‍మెంట్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2022 నవంబర్‌లో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024