ఎక్కువ కష్టపడక్కర్లేదు! రోజుకు కేవలం 20 పుల్-అప్స్ చేస్తే చాలు బోలెడు ప్రయోజనాలు పొందచ్చు!

Best Web Hosting Provider In India 2024

ఎక్కువ కష్టపడక్కర్లేదు! రోజుకు కేవలం 20 పుల్-అప్స్ చేస్తే చాలు బోలెడు ప్రయోజనాలు పొందచ్చు!

Ramya Sri Marka HT Telugu

పుల్-అప్స్ అనేవి శరీర బరువుతో చేసే అత్యంత ప్రభావవంతమైన వ్యాయామాల్లో ఒకటి. కండరాలను బలోపేతం చేసేందుకు శారీరకంగా, మానసికంగా ఆరోగ్యాన్ని మరింత మెరిచేందుకు ఇవి చాలా బాగా సహాయపడతాయి. ఎక్కువ కష్టపడకుండా ప్రతిరోజూ ఉదయం కేవలం 20 పుల్-అప్స్ చేయడం వల్ల కలిగే ప్రయోజనాలేంతో తెలుసుకుందాం రండి.

రోజూ 20 పుల్ అప్స్ చేయండి ఈ ప్రయోజనాలన్నింటినీ పొందండి

బిజీ, ఒత్తిడిలతో నిండిన ఆధునిక జీవనశైలిలో మనం ఆరోగ్యాన్ని పట్టించుకోవడమే కష్టంగా మారింది. డెడ్‌లైన్స్, ట్రాఫిక్, గ్యాడ్జెట్లు… ఇవన్నీ మన రోజువారీ జీవితాన్ని ఆక్రమించేయడంతో, శరీరానికి శ్రమ పెట్టే అవకాశం చాలామందికి దొరకడం లేదంటే తప్పేం లేదేమో.కానీ ఆయుష్షు పెరగాలంటే ఎలాంటి నొప్పులు వ్యాధుల బాధలు లేకుండా బతకాలంలే రోజులో కాసైపైనా శరారీక శ్రమ చేయాల్సిన అవసరం ఉంది. అలా అని గంటల పాటు జిమ్‌లో గడపాల్సిన అవసరం లేదు. కేవలం కొన్ని నిమిషాల్లోనే శరీరాన్ని బలంగా, ఆకర్షణీయంగా మార్చే ఒక అద్భుతమైన వ్యాయామం ఉంది. అదే పుల్-అప్స్!

పుల్-అప్స్ అనేవి ప్రత్యేకమైన ఎక్విప్‌మెంట్ అవసరం లేని, ఇంట్లోనే చేయగల పవర్‌ఫుల్ వ్యాయామం. మీరు ప్రారంభ దశలో ఉన్నవారైనా, రోజూ వ్యాయామం చేసేవారైనా సరే వీటిని చేయచ్చు. పుల్-అప్స్ అన్ని వయస్సుల వారికి అనుకూలమైనవి కూడా. ఈ వ్యాయామం ద్వారా మీ శరీరం బలపడటమే కాదు, మానసికంగా ధైర్యం, స్థిరత్వం కూడా పెరుగుతాయి.ఎక్కువ కష్టపడకుండా రోజూ ఉదయం కేవలం 20 పుల్-అప్స్ చేస్తే చాలు. శరీరంలో వచ్చే మార్పులు చూసి మీరు ఆశ్చర్యపోతారు!

పుల్ అప్స్ చేయడం వల్ల మానసికంగా, శారీరకంగా వచ్చే మార్పులు ఏంటి?

1. శరీర బలం చేకూరుతుంది:

పుల్-అప్స్ సమయంలో వాడే ప్రధాన కండరాలు అంటే శరీరంలోని అన్ని భాగాలకు బలాన్ని చేకూరుస్తాయి. ఉదాహరణకు లాటిసిమస్ డోర్సి వీపు భాగాన్ని ఆకారంలోకి తేవడంలో సహాయపడుతుంది. అలాగే బైసెప్స్, ట్రైసెప్స్ చేతులకు బలాన్ని ఇస్తాయి. డెల్టాయిడ్స్ (Shoulders) భుజాల స్థిరత్వాన్ని పెంచుతాయి. ఇలా శరీరంలోని కండరాలపై ఒత్తిడి పడి అవి బలంగా తయారవుతాయి.

2. పోస్చర్ మెరుగవుతుంది

పుల్-అప్స్ చేయడం వల్ల వెనుక భాగంలోని కండరాలు బలపడతాయి. దీని వలన శరీర పోస్చర్ మెరుగువుతుంది. మనం నడిచే, కూర్చునే తీరు మెరుగవుతుంది. ఆఫీస్ లో ఎక్కువసేపు కూర్చొనే పనొ చేసే వారికి నడుము నొప్పులు తగ్గుతాయి.

3. శరీరం ఆకర్షణీయంగా మారుతుంది

పుల్ అప్స్ వల్ల శరీరంపై మసిల్స్ రావడానికి చాలా బాగా సహాయపడుతుంది. “V-shaped torso” (పైన పొడవుగా, కింద తక్కువగా ఉన్న శరీర ఆకృతి) సాధ్యమవుతుంది.ఫిట్ గా, కాన్పిడెంట్ గా కనిపిస్తారు. ఆకర్షణీయంగా మారతారు.

4. గ్రిప్ పెరుగుతుంది

రోజుకు 20 పుల్ అప్స్ చేయడం వల్ల చేతులు, వేళ్లలో బలం పెరుగుతుంది. ఇది వయస్సు పెరిగినాక వచ్చే చేతుల్లో వణకు, చేతులు బలం లేకపోవడం వంటి సమస్యలను తగ్గిస్తుంది. మంచి గ్రిప్ ఇస్తుంది. అంతేకాదు.. ఇతర వ్యాయామాలైన (deadlifts, rows)వంటి వాటిని చేసే సామర్థ్యాన్ని పెంచుతుంది.

5. మానసిక ధైర్యం

పుల్-అప్స్ చేయడం కొంచెం కష్టమైన వ్యాయామం. దీనిని ప్రతిరోజూ చేయడం వల్ల మీకు తెలియకుండానే మీలో క్రమశిక్షణ పెరుగుుతుంది. మీలో పట్టుదల, మానసిక ధైర్యం పెరుగుతాయి. అన్నింటా ఆత్మవిశ్వాసంతో ఉండగలుగుతారు.

6. బరువు తగ్గడానికి సహాయపడుతుంది

పుల్-అప్స్ చేసే సమయంలో శరీరం ఎక్కువగా కేలరీలను ఖర్చు చేస్తుంది. దీని వల్ల ఫాట్ బర్న్ వేగంగా జరుగుతుంది. మెటబాలిజం పెరుగుతుంది. దీని వల్లల శరీరం వేగంగా కేలరీలను ఖర్చు చేస్తుంది. బరువు తగ్గుతుంది.

7. హార్మోన్ల సంతులనం

శక్తితో కూడిన వ్యాయామాలు ముఖ్యంగా పుల్-అప్స్ వంటి బాడీవెయిట్ ఎక్సర్సైజులు టెస్టోస్టెరోన్ లెవల్స్‌ను పెంచడంలో సహాయపడతాయి. ఇది మానసికరంగా, శారీరకంగా మిమ్మల్ని ధృఢంగా ఉంచుతుంద.

జాగ్రత్తలు తప్పనిసరి:

మీరు ఇంత వరకూ పుల్ అప్స్ చేయని వారేతే ఒకేసారి 20 పుల్ అప్స్ చేయకండి. నిదానంగా రోజుకు 5తో ప్రారంభించి కొద్ది కొద్దిగా పెంచుతూ రండి. ఇలా రోజుకు కేవలం 20 చేస్తే చాలు. మానసికంగా, శారీరకంగా ఫిట్ గా ఉండగలుగుతారు. అలాగే వీటిని ఎప్పుడు పడితే అప్పుడు చేయకండి. ఉదయాన్నే చేస్తేనే మెటబాలిజం యాక్టివ్ అయి రోజంతా శక్తితో నిండి ఉంటారు. సాయంత్రం చేయాలనుకున్నా ఫర్వాలేదు కానీ ఒకే సమయంలో చేసేలా ప్లాన్ చేసుకోండి.

Ramya Sri Marka

eMail
మార్క రమ్యశ్రీ హిందుస్తాన్ టైమ్స్‌ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ లైఫ్‌స్టైల్, ఆస్ట్రాలజీ వార్తలు రాస్తున్నారు. గతంలో ఈనాడు, టీన్యూస్, ఈటీవీ భారత్ వంటి సంస్థల్లో కంటెంట్ రైటర్‌గా పనిచేశారు.జర్నలిజంలో ఎనిమిదేశ్లకు పైగా అనుభవం ఉంది. కాకతీయ యూనివర్సిటీలో మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం పీజీ చేశారు. 2024 నవంబరులో హెచ్.టి తెలుగులో చేరారు.

సంబంధిత కథనం

Source / Credits

Best Web Hosting Provider In India 2024