Jr NTR: సినిమా ఫస్ట్ చూసింది ఎన్టీఆర్ గారే.. అక్కడ కాంప్రమైజ్ కావొద్దన్నారు: అర్జున్ సన్నాఫ్ వైజయంతీ నిర్మాతలు

Best Web Hosting Provider In India 2024

Jr NTR: సినిమా ఫస్ట్ చూసింది ఎన్టీఆర్ గారే.. అక్కడ కాంప్రమైజ్ కావొద్దన్నారు: అర్జున్ సన్నాఫ్ వైజయంతీ నిర్మాతలు

Sanjiv Kumar HT Telugu

Arjun Son Of Vyjayanthi Producers About Jr NTR Response: నందమూరి కల్యాణ్ రామ్ హీరోగా విజయశాంతి కీలక పాత్రలో నటించిన సినిమా అర్జున్ సన్నాఫ్ వైజయంతి. ఈ సినిమాను ఫస్ట్ చూసింది జూనియర్ ఎన్టీఆర్ అని, అక్కడ కాంప్రమైజ్ కావొద్దన్నారని నిర్మాతలు అశోక్ వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు తెలిపారు.

సినిమా ఫస్ట్ చూసింది ఎన్టీఆర్ గారే.. అక్కడ కాంప్రమైజ్ కావొద్దన్నారు: అర్జున్ సన్నాఫ్ వైజయంతీ నిర్మాతలు

Arjun Son Of Vyjayanthi Producers About Jr NTR Response: నందమూరి కల్యాణ్ రామ్ హీరోగా సాయి మంజ్రేకర్ హీరోయిన్‌గా నటించిన ఎమోషనల్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ అర్జున్ సన్నాఫ్ వైజయంతి. సీనియర్ హీరోయిన్ విజయశాంతి కీలక పాత్ర పోషించిన ఈ సినిమాకు ప్రదీప్ చిలుకూరి దర్శకత్వం వహించారు.

ఏప్రిల్ 18న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో అర్జున్ సన్నాఫ్ వైజయంతి మూవీ గ్రాండ్ రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా ఈ మూవీ నిర్మాతలు అశోక్ వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు విలేకరులు సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు.

అర్జున్ S/O వైజయంతి మూవీ ఎలా స్టార్ట్ అయింది?

కల్యాణ్ రామ్ గారితో ఒక సినిమా చేయాలనుకున్నాం. ఆయన ఎక్స్‌పరిమెంటల్ ఫిలిమ్స్ ఎక్కువగా చేస్తున్నారు. ఒక మాస్ కమర్షియల్ సినిమాని ఆయనతో చేయాలని ఈ కథని సిద్ధం చేయించాం. కథ ఆలోచన దగ్గర నుంచి ప్రతిదీ కల్యాణ్ రామ్ గారి కోసం తయారుచేసినవే. మదర్ క్యారెక్టర్‌ను విజయశాంతి గారు చేయాలని ముందే ఫిక్స్ అయ్యాం. అన్ని ప్లాన్ చేసుకుని చేసిన సినిమా ఇది. మంచి ఎమోషనల్ యాక్షన్ ఫిల్మ్.

దర్శకుడిగా ప్రదీప్ గారిని ఎంపిక చేసుకోడనికి కారణం?

-ప్రదీప్ గారితో నేనొక వెబ్ ఫిల్మ్ చేశాను. ఆయనతో నాకు మంచి ఎక్స్‌పీరియన్స్ ఉంది. అయినా కమర్షియల్ మీటర్ తెలిసిన డైరెక్టర్. ఈ కథకు ఆయన బెటర్ అనిపించింది. హై ఎమోషన్ ఉన్న ఈ సినిమాని ఆయన అద్భుతంగా తీశారు.

అశోక్ గారు మీరు అలా ఎలా సినిమా చేసి పదేళ్లు అవుతుంది. మళ్లీ ఈ సినిమా చేయడం ఎలా అనిపించింది?

-అలా ఎలా సినిమా నా ఫ్రెండ్ అనీస్ కోసం చేశాను. అందులో సునీల్ కూడా ఉన్నారు. ఆ సినిమాని సునీల్‌నే ప్రమోట్ చేశారు. కల్యాణ్ గారు నా ఫ్రెండ్. అందరం కలసి ఒక సినిమా చేద్దామని ఈ ప్రాజెక్ట్ చేయడం జరిగింది.

విజయశాంతి గారి పాత్ర గురించి?

-లేడీ పోలీస్ ఆఫీసర్ అనగానే విజయశాంతి గారే గుర్తుకు వస్తారు. కర్తవ్యం సినిమా స్ఫూర్తితో తీర్చిదిద్దిన పాత్రలో కనిపిస్తారు. ఈ కథని ఆమె ఓకే చేస్తారని మాకు గట్టి నమ్మకం. మా నమ్మకం ప్రకారం ఈ సినిమాని ఆమె ఒప్పుకోవడం చాలా ఆనందాన్ని ఇచ్చింది. ఇందులో చాలా పవర్‌ఫుల్ రోల్ చేశారు.

ఎన్టీఆర్ సినిమా చూసి మీతో ఏం షేర్ చేసుకున్నారు ?

-సినిమా ఫస్ట్ చూసింది జూనియర్ ఎన్టీఆర్ గారే. ఆయన చూసిన తర్వాత చాలా కాన్ఫిడెంట్‌గా చెప్పారు. ఎమోషనల్ యాక్షన్ బెస్ట్ ఉందని చెప్పారు. రికార్డింగ్ దగ్గర కాంప్రమైజ్ కాకుండా చూకోమని చెప్పారు. అజీనిష్ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చాడు. ఎన్టీఆర్ గారు చెప్పినట్లు చివరి ఇరవై నిముషాలు కళ్లు చెమ్మగిల్లెలా ఉంటుంది. ఇలా రావడానికి కారణం సినిమా బిగినింగ్ నుంచి బిల్డ్ చేసిన ఎమోషన్. ఎన్టీఆర్ గారు చెప్పినట్టు సినిమా కచ్చితంగా పెద్ద హిట్ అవుతుంది.

Sanjiv Kumar

TwittereMail
సంజీవ్ కుమార్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియ‌ర్ కంటెంట్ ప్రొడ్యూస‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్‌ కథనాలు, మూవీ రివ్యూలు అందిస్తుంటారు. గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. తెలంగాణ యూనివర్సిటీలో మాస్ క‌మ్యూనికేష‌న్ అండ్ జ‌ర్న‌లిజంలో పీజీ చేశారు. 2023 ఆగస్టులో హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024