ఏపీ పాలీసెట్‌ దరఖాస్తుల స్వీకరణకు ఏప్రిల్ 17వరకు గడువు.. 30న ప్రవేశ పరీక్ష

Best Web Hosting Provider In India 2024

ఏపీ పాలీసెట్‌ దరఖాస్తుల స్వీకరణకు ఏప్రిల్ 17వరకు గడువు.. 30న ప్రవేశ పరీక్ష

HT Telugu Desk HT Telugu
  • Share on Whatsappమమ్మల్ని ఫాలో అవ్వండి
  • Share on Facebook
HT Telugu Desk HT Telugu

ఆంధ్రప్రదేశ్‌ పాలీసెట్-2025 దరఖాస్తు గడువును పొడిగించారు. ఈ మేరకు సాంకేతిక విద్యాశాఖ అప్‌డేట్‌ ఇచ్చింది. ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తు చేయడానికి ఏప్రిల్ 17 వ‌ర‌కు పొడిగించారు.ఏప్రిల్ 30న ప్ర‌వేశ ప‌రీక్ష‌ నిర్వహిస్తారు.

ఏపీ పాలిసెట్‌ 2025 గడువు పొడిగింపు
మమ్మల్ని ఫాలో అవ్వండిShare on Whatsapp
  • Share on Facebook

ఏపీలో పాలిటెక్నిక్ కామ‌న్ ఎంట్రన్స్ టెస్ట్ (పాలీసెట్‌)-2025 అభ్య‌ర్థులకు రాష్ట్ర సాంకేతిక విద్యా మండ‌లి అప్‌డేట్ ఇచ్చింది. ద‌ర‌ఖాస్తు దాఖ‌ల‌కు గుడువు ఏప్రిల్ 17 వ‌ర‌కు పొడిగించింది. అభ్య‌ర్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల‌ని కోరుతోంది. నోటిఫికేష‌న్‌ షెడ్యూల్‌ ప్రకారం మార్చి 12వ తేదీన ద‌ర‌ఖాస్తులు స్వీక‌ర‌ణ ప్రారంభించి, ఏప్రిల్ 15వ తేదీ వరకు ద‌ర‌ఖాస్తుల స్వీక‌ర‌ణ‌కు గ‌డువుగా విధించారు.

పాలీసెట్‌ దరఖాస్తుల స్వీకరణ గడువు ముగిసిన తర్వాత పలువురు సాంకేతిక విద్యా మండలికి అభ్యర్థించడంతో గడువు పొడిగించారు. పాలిసెట్‌ ద‌ర‌ఖాస్తు చేయడానికి మ‌రో రెండు రోజులు గ‌డువును పెంచింది. దీంతో ఏప్రిల్ 17వ తేదీ వ‌ర‌కు ద‌రఖాస్తులు చేసుకోవ‌చ్చు. ఏప్రిల్ 30 ప్ర‌వేశ ప‌రీక్ష ఉంటుంది. ప్ర‌వేశ‌ప‌రీక్ష ఆఫ్‌లైన్ మోడ్‌లోనే ఉంటుంది.

ముఖ్య‌మైన తేదీలు

1.ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తు దాఖ‌లు ప్రారంభంః మార్చి 12

2. ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తు చేసేందుకు ఆఖ‌రు తేదీః ఏప్రిల్ 15

3. ద‌ర‌ఖాస్తు దాఖ‌ల‌కు గ‌డువు పెంపుః ఏప్రిల్ 17

3. ప్ర‌వేశ‌ప‌రీక్ష తేదీః ఏప్రిల్ 30 (ఉద‌యం 11 గంట‌ల నుండి మ‌ధ్యాహ్నం 1 గంట వ‌ర‌కు)

4. ఫ‌లితాలు విడుద‌లః మే 10

అప్లికేష‌న్ ఫీజు

అప్లికేష‌న్ ఫీజు ఓసీ, బీసీ అభ్య‌ర్థుల‌కు రూ.400, ఎస్సీ, ఎస్టీ అభ్య‌ర్థుల‌కు రూ.100గా నిర్ణ‌యించారు. ప్ర‌వేశ ప‌రీక్ష‌కు 1,50,000 మంది విద్యార్థులు హార‌య్యే అవ‌కాశం ఉంద‌ని అంచ‌నా వేస్తున్నారు.

అర్హ‌త‌లు

ప‌దో త‌ర‌గ‌తి పూర్తి చేసిన వారు, అలాగే ప‌దో త‌ర‌గ‌తి ప‌బ్లిక్ ప‌రీక్ష‌లు రాసే అభ్య‌ర్థులు పాలిసెట్ రాసేందుకు అర్హులు. ఎటువంటి వ‌యో ప‌రిమితి లేదు.

రిజ‌ర్వేష‌న్లు

1. ఓపెన్ కేట‌గిరీ (ఓసీ)- 50 శాతం

2. ఎస్సీ కేట‌గిరీ- 15 శాతం

3. ఎస్టీ కేట‌గిరీ- 6 శాతం

4. బీసీ కేట‌గిరీ – 29 శాతం (బీసీ-ఏః7, బీసీ-బీ 10, బీసీ-సీః 1, బీసీ-డీః 7, బీసీ-ఈః 4 శాతం)

5. మ‌ద‌న‌ప‌ల్లి, రాజ‌మండ్రి రెసిడెంట‌ల్ పాలిటెక్నిక్‌ల్లోః ఎస్సీ 75 శాతం, ఎస్టీ 5 శాతం, బీసీ 10 శాతం, ఓసీ 10 శాతం.

6. పాడేరు, శ్రీశైలం, య‌ట‌పాక రెసిడెంట‌ల్ పాలిటెక్నిక్‌ల్లోః ఎస్సీ 18 శాతం, ఎస్టీ 75 శాతం, బీసీ 5 శాతం, ఓసీ 2 శాతం.

7. విద్యార్థినీల‌కు 33.33 శాతం సీట్లు కేటాయిస్తారు.

8. దివ్యాంగుల‌కు 5 శాతం సీట్లు కేటాయిస్తారు.

9. ఎన్‌సీసీ అభ్య‌ర్థుల‌కు 1 శాతం

10. స్పోర్ట్స్ అండ్ గేమ్స్ అభ్య‌ర్థుల‌కు 0.5 శాతం

11. సైనికోద్యోగుల పిల్ల‌ల‌కు 2 శాతం

500 కేంద్రాల్లో ప‌రీక్ష నిర్వ‌హ‌ణ‌

రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాల్లో 500 ప‌రీక్షా కేంద్రాల్లో ప‌రీక్ష నిర్వ‌హిస్తారు. ప‌రీక్ష‌కు వారం ముందు హాల్ టిక్కెట్లు విడుద‌ల చేస్తారు. ప‌రీక్ష ఆబ్జెక్టివ్ మోడ్‌లో ఉంటుంది. 120 ప్ర‌శ్న‌లు ఉంటాయి. మ్యాథ‌మెటిక్స్ – 50 ప్రశ్న‌లు, ఫిజిక్స్- 40 ప్ర‌శ్న‌లు, కెమిస్ట్రీ-30 ప్ర‌శ్న‌లు ఉంటాయి. ప‌రీక్ష రెండు గంటల పాటు ఉంటుంది. ప‌రీక్ష ప‌దో త‌గ‌తి సిల‌బ‌స్ ఆధారంగానే ఉంటుంది.

ద‌ర‌ఖాస్తు ఇలా చేయాలి?

ద‌ర‌ఖాస్తును ఆన్‌లైన్‌లో చేసుకోవాలి. మొబైల్ నెంబ‌ర్‌తో ద‌ర‌ఖాస్తు చేసుకోవాలంటే అధికారిక వెబ్‌సైట్ డైరెక్ట్ లింక్ https://polycetap.nic.in/mob.aspx ద్వారా, లేదా ప‌దో త‌ర‌గ‌తి హాల్‌టిక్కెట్ నెంబ‌ర్‌తో ద‌ర‌ఖాస్తు చేసుకోవాలంటే అధికారిక వెబ్‌సైట్ డైరెక్ట్ లింక్ https://polycetap.nic.in/hall.aspx ను ఉప‌యోగించాలి.

ప‌దో త‌ర‌గ‌తి హాల్ టిక్కెట్టు నెంబ‌ర్, ప‌దో త‌ర‌గ‌తి పాస్ అయిన సంవ‌త్స‌రం, డేట్ ఆఫ్ బ‌ర్త్ ఇవ్వాలి. ఆ త‌రువాత స్కూల్ రికార్డ్‌ల్లో ఉన్న విధంగానే పేరును న‌మోదు చేయాలి. ఆ త‌రువాత తండ్రి పేరు ఇవ్వాలి. మ‌ళ్లీ డేట్ ఆఫ్ బ‌ర్త్ ఇవ్వాలి. ఆ త‌రువాత హౌస్ నెంబ‌ర్‌, విలేజ్/ స్ట్రీట్‌, మండ‌లం/ టౌన్ / సీటీ, జిల్లా, పిన్ కోడ్‌, మొబైల్ నెంబ‌ర్‌తో కూడిన పూర్తి అడ్ర‌స్‌ను ఇవ్వాలి.

ఆ త‌రువాత ఎగ్జామ్ సెంట‌ర్‌ను ఎంపిక (ప్రిఫ‌రెన్స్‌) చేసుకోవాలి. ఆ త‌రువాత ఏరియా కోడ్ ఇవ్వాలి. రిజ‌ర్వేష‌న్ కేట‌గిరీ (బీసీ, ఎస్సీ, ఎస్టీ) ఇవ్వాలి. ప్ర‌త్యేక కేట‌గిరీ ఉంటే (సీఏపీ, ఎస్‌పీ, పీహెచ్‌, ఎన్‌సీసీ) వాటిని కూడా పొందు ప‌ర‌చాలి. మైనార్టీలైతే వారి వివ‌రాలు ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే ఉర్దూ మీడియా ఎగ్జామ్ సెంట‌ర్ల (గుంటూరు, నంద్యాల‌)కు ప్రిఫ‌రెన్స్ కూడా ఇవ్వాలి. ఆ త‌రువాత అప్లికేష‌న్ ఫీజు చెల్లించాలి.

కాలేజీలు, సీట్లు, ఫీజులు, ఎగ్జామ్ సెంట‌ర్ల కోడ్‌లు, కాలేజీ కోడ్‌ల‌తో పాటు ఇత‌ర వివ‌రాల కోసం అధికారిక వెబ్‌సైట్ డైరెక్ట్ లింక్ https://polycetap.nic.in/BROCHURE.pdf లో అందుబాటులో ఉంటాయి.

(జ‌గ‌దీశ్వ‌ర‌రావు జ‌ర‌జాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు)

HT Telugu Desk

సంబంధిత కథనం

టాపిక్

AdmissionsAndhra Pradesh NewsEntrance TestsTeluguTelugu News
Source / Credits

Best Web Hosting Provider In India 2024