




Best Web Hosting Provider In India 2024
ఇంట్లో 6 దశాబ్దాల నాటి బ్యాంక్ పాస్ బుక్- ఓపెన్ చేసిన వెంటనే కోటీశ్వరుడు అయిపోయాడు! షాకింగ్ స్టోరీ..
చిలీకి చెందిన ఒక వ్యక్తి కథ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తండ్రికి చెందిన 6 దశాబ్దాల నాటి బ్యాంక్ పాస్ బుక్ ఎక్సిక్వియల్ అనే వ్యక్తికి అనుకోకుండా కనిపించింది. ఆ వెంటనే అతను రాత్రికి రాత్రే కోటీశ్వరుడు అయిపోయాడు! ఇంతకీ ఏం జరిగిందంటే..
‘రాత్రికి రాత్రే కోటీశ్వరులం అయిపోతే ఎంత బాగుంటుంది?’ అని మనలో చాలా మంది కలలు కంటూ ఉంటారు. కానీ అలా అవ్వాలంటే ఊహకు మించిన అద్భుతం జరగాలి. అదృష్టం కలిసిరావాలి. చిలీకి చెందిన ఓ వ్యక్తి జీవితంలో ఇదే జరిగింది! మరణించిన తండ్రికి సంబంధించిన ఒక బ్యాంక్ పాస్ బుక్.. ఆ వ్యక్తిని రాత్రికి రాత్రే ధనవంతుడిని చేసేసింది. ఇంతకి ఏం జరిగిందంటే..
అసలేం జరిగింది..?
ఇది చిలీకి చెందిన ఎక్సిక్వియల్ హినోజోసా అనే వ్యక్తి కథ. తన తండ్రి మరణించిన పదేళ్ల తర్వాత.. ఓసారి అయన వస్తువులను సర్దటం మొదలుపెట్టాడు ఎక్సిక్వియల్. అప్పుడే, తన తండ్రికి చెందిన 6 దశాబ్దాల క్రితం నాటి పాత బ్యాంక్ పాస్ బుక్ అతనికి దొరికింది. అది అతని అదృష్టాన్ని శాశ్వతంగా మార్చేసింది.
1960-70లో ఎక్సిక్వియల్ తండ్రి ఒక ఇల్లు కొనడానికి డబ్బు పొదుపు చేశాడు. పాస్ బుక్ ప్రకారం ఎక్సిక్వియల్ తండ్రి రూ. 1.4లక్షల వరకు పొదుపు చేశాడు. దాన్ని ఆయన ఎప్పుడూ వాడలేదు.
6 దశాబ్దాల వడ్డీ, ద్రవ్యోల్బణంతో అడ్జెస్ట్ చేసిన తర్వాత ఆ 1.4లక్షలు కాస్తా రూ. 10కోట్లుగా మారింది.
ఎక్సిక్వియల్ తండ్రి బ్యాంకు ఖాతా, పొదుపు గురించి కుటుంబంలో ఎవరికీ తెలియదు. ఆ తండ్రి మరణించిన పదేళ్ల వరకు ఆ పాస్ బుక్‌ని ఎవరూ చూడకపోవడం, ఇల్లు సర్దుతుండగా ఎక్సిక్వియల్కి దొరకడం విశేషం.
కోటీశ్వరుడు అయిపోయానన్న సంతోషంలో బ్యాంక్ నుంచి డబ్బులు విత్‌డ్రా చేద్దామని ఎక్సిక్వియల్ అనుకున్నాడు. అప్పుడే అతనికి షాక్ తగిలింది! వాళ్ల నాన్న పొదుపు చేసి బ్యాంక్ మూతపడిందని అతను తెలుసుకున్నాడు.
ఇలాంటి పరిస్థితుల్లో పాస్ బుక్ ఉన్నా పెద్ద ఉపయోగం లేదు. డబ్బు పోయినట్టే!
కానీ అదృష్టం అనేది ఎక్సిక్వియల్ని వదల్లేదు! ఆ పాస్ పుస్తకంలో ఒక కీలక విషయం ఉంది. “స్టేట్ గ్యారంటీడ్” అని ఒక స్టాప్ దానిలో ఉంది. బ్యాంకు చెల్లింపులు చేయలేకపోతే ప్రభుత్వం ఇస్తుందనిఆ హామీ సూచించింది.
ఎక్సిక్వియల్ ప్రభుత్వాన్ని సంప్రదించాడు. అయితే, చిలీ ప్రభుత్వం మొదట్లో ఈ హామీని నెరవేర్చేందుకు ప్రయత్నించలేదు.
అప్పటి నుంచి తన డబ్బు కోసం ఎక్సిక్వియల్ ప్రభుత్వంతో సుదీర్ఘ పోరాటం చేశాడు.
“ఆ డబ్బు మా కుటుంబానిది. మా నాన్న ఎంతో కష్టపడి దాన్ని కాపాడుకున్నాడు,” అని చెప్పిన ఎక్సిక్వియల్ పాస్ బుక్ దొరికే వరకు ఆ కుటుంబానికి తెలియదని అన్నాడు.
కానీ మిలియనీర్ కావడానికి ఎక్వియెల్ ప్రయాణం అంత సులభం కాదు. అతనికి అనుకూలంగా అనేక కోర్టు తీర్పులు వచ్చినప్పటికీ, ప్రభుత్వం అడుగడుగునా అప్పీల్ వేస్తూ వెళ్లింది. చివరికి ఎక్సిక్వియల్ న్యాయ పోరాటం దేశ అత్యున్నత న్యాయస్థానానికి చేరింది.
ఈ నిధులు తన తండ్రి కష్టపడి సంపాదించిన పొదుపు అని, దీనికి ప్రభుత్వ నిబద్ధత హామీ ఇచ్చిందని అతను వాదించాడు.
చివరికి 2022లో, చిలీ సుప్రీంకోర్టు అతనికి అనుకూలంగా తీర్పు ఇచ్చింది. అతనికి 1 బిలియన్ చిలీ పెసోలు (సుమారు రూ .10 కోట్లు) వడ్డీ, భత్యాలతో సహా పరిహారం చెల్లించాలని ప్రభుత్వానికి ఆదేశాలిచ్చింది.
ఇలా ఎక్సిక్వియల్ అనే వ్యక్తి తండ్రి పాత పాస్ బుక్‌తో కోటీశ్వరుడయ్యాడు.
వాస్తవానికి ఈ ఎక్సిక్వియల్ కథ రాయిటర్స్ మొదట 2022 లో ప్రచురించింది. కానీ ఈ స్టోరీ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
సంబంధిత కథనం
Best Web Hosting Provider In India 2024
Source link